Thank You 2018 For C/o Kancharapalem. A Movie Which Touched Our Hearts & Made Us Emotional

0
464

నవ్వించి కవ్వించే సినిమాలు కొన్ని, ఏడ్పించే సినిమాలు కొన్ని, విసుగు తెప్పించే సినిమాలు మరి కొన్ని. అంతేనా అంటే కాదు, కొన్ని సినిమాల్లోని పాత్రలు మనల్ని వెంటాడుతాయి, మన ఆలోచనల్ని, మనం ఆచరించే పద్ధతుల్ని ప్రశ్నిస్తాయి. మనం బ్రతుకుతున్న సమాజంలోని తప్పు ఒప్పులని మనకు వివరిస్తుంది సినిమా . ఇలా మన మనస్సులో చెరగని ముద్ర వేసిన సినిమాలు చాల అరుదుగా వస్తాయి.

care of kancherapalemఅలాంటి కొన్ని సినిమాల్లో ఈ సంవత్సరం వచ్చినా ‘కేర్ అఫ్ కంచెరపాలెం’ ఒకటి. ఈ సినిమా సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద దర్శకులను, నిర్మాతలని, హీరోలని, మొత్తం తెలుగు ప్రజలందరినీ నవ్వించింది, ఏడిపించింది, లోతుగా చుసిన వారిని కదిలించింది.

ఈ చిత్రంలోని పాత్రల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు, సంఘటనల ద్వారా దర్శకుడు వెంకటేష్ మహా అంతర్లీనంగా నేటి సామాజానికి చెప్పాలి అనుకున్న కొన్ని విషయాలు ఒకసారి విశ్లేషించుకుందాం……!

సుందరం – సునీత

care of kancherapalemఈ ఇద్దరి పిల్లల ద్వారా పిల్లల మనస్సు వారు, ఎదుటి మనిషిని ప్రేమించే తీరు, ఎంత స్వచ్చంగా, కలుషితం లేకుండా ఉంటుందో చెప్పడం దర్శకుడి మొదటి ఉద్దేశం. అదే విధంగా పిల్లలు కొన్ని చిన్న చిన్న సంఘటనలకు ఎలా స్పందిస్తారు , చిన్నవి అనుకున్న విషయాలు వారిని ఎంతలా ప్రభావితం చేస్తాయి, అని చెప్పడం ఇంకో ఉద్దేశం.

ఉదాహరణ: ఒక సన్నివేశంలో సుందరం తన తండ్రితో పూజలో కూర్చొని, వినాయకుడితో సునీతని తనతో మాట్లాడేలా చేయమని కోరుకుంటాడు. సుందరం కోరుకున్నది జరగడంతో దేవుడి మీద భక్తి పెరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల సునీత దూరం అవ్వడంతో, అదే దేవుడి మీద నమ్మకం కోల్పోయి తన తండ్రి చేసిన విగ్రహాన్ని రాళ్ల తో కొడతాడు. ఇక్కడే సుందరం దేవుడి మీద ఉన్న కోపంతో మతం మరడమే కాదు తన పేరుని ‘జోసెఫ్’గా మార్చుకుంటాడు.

జోసెఫ్ – భార్గవి

care of kancherapalemదేవుడి మీద కోపంతో మతం మారిన జోసెఫ్, భార్గవి అనే హిందువు అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఈసారి విధి మళ్ళి మతం రూపంలో అతడిని శపిస్తుంది. భార్గవి తండ్రి జోసెఫ్ భార్గవి ప్రేమించిన అబ్బాయి జోసెఫ్, క్రైస్తవుడు అన్న ఒకే ఒక్క కారణంతో భార్గవిని మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.

ఇక్కడ జోసెఫ్ మతం మరకపోయి ఉంటే భార్గవితో పెళ్లి జరిగేదేమో ???

గెడ్డం – సలీమా

care of kancherapalemభార్గవితో ప్రేమ ఫలించని జోసెఫ్, గెడ్డం అనే పేరు మార్చుకుని నాస్తికుడిలా మారిపోతాడు. తరువాత సలీమా అనే అమ్మాయిని ప్రేమించడం మొదలెడతాడు మన గెడ్డం. తాను ప్రేమించిన అమ్మాయి ముస్లిం, అందులోను తాను ఒక వేశ్య అని తెలిసికూడా సలీమాను పెళ్లి చేసుకోడానికి సిద్దమవుతాడు.

సలీమా చేసే వ్యభిచారం, తన ప్రవర్తన నచ్చని కొందరు మతం ముసుగులో సలీమని కొట్టడంతో, తాను గెడ్డంతో పెళ్ళికి ముందే చనిపోతుంది.

రాజు – రాధా

care of kancherapalemఇకపోతే, అన్ని వదులుకొని చివరకు పెళ్లి కూడా చేసుకోకుండా మిగిలిపోయిన రాజు నలభై ఏండ్ల వయస్సులో అదే వయస్సుగల వితంతువుతో ప్రేమలో పడతాడు, చివర్లో అన్ని అధిగమించి ఒక్కటి అవుతారు.

ఈ ఇద్దరి పాత్రల ద్వారా, ఆ వయస్సులో ఉన్నవారికీ కేవలం ఒక తోడు అవసరమే తప్ప, శారీరక సంబంధం కోసం వెంపర్లాడారు అనేది చెప్పలనుకున్నాడు దర్శకుడు వెంకటేష్ మహా.

ఇలా అంతర్లీనంగా, సుందరం-జోసెఫ్-గెడ్డం-రాజు, అనే పాత్రల ద్వారా సమాజం లోని వయస్సు, కులం, మతం, అంతస్థులు, అనే మనిషి నిర్మించుకున్న గోడలతో పాటు సమాజంలోని తప్పు ఒప్పులను, దర్శకుడు చెప్పకనే చెప్పేసాడు.

వయస్సు, కులం, మతం, పేద-గొప్ప లాంటి అంతర్యాలను అందరికి అర్ధమయ్యేలా, ఒక కనువిప్పును కలిగించేలా చెప్పాడు కాబట్టే ఈ సినిమా అందరిని కదిలించింది.

SHARE