Home Life Style Soul Circus: A Must Read Telugu Book That Will Change Your Life...

Soul Circus: A Must Read Telugu Book That Will Change Your Life For Good

0

“రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే” – వెంకట్ శిద్దారెడ్డి

పుస్తకాలు చాలానే ఉంటాయి కానీ కొన్ని లక్షల పుస్తకాలు లేని పవిత్రతను అలుముకొని గుడిలో పూజింప బడుతుంటాయి కానీ అక్కడ ఎక్కడో నక్క ఊలకి దూరంగా శునక శోకనికి దగ్గరగా జీవం లేని మనుషుల విషాదాన్ని స్మశానపు పవిత్రతని అలుముకొని, కలలు నిండిన ఆకాశానికి ఆశలు వొదిలేసుకున్న భూమికి తక్కెడగా ఒక పుస్తకం ఉంటుంది అలాంటి పుస్తకమే Venkat Sid రచించిన “సోల్ సర్కస్”…

ఎప్పుడు తెలుగు పుస్తకాలు చదివిన ఏదో అసంతృప్తి ఇంకేదో కావాలి మన వాళ్లు Ayn Rand లాగా నరాలు తెగిపోయే అంత తీవ్ర ఉత్కంఠతో చెప్పాలి అనుకున్న philosophy ని ముక్కు సూటిగా చెబుతూనే కథని ఎందుకు నడిపించరు అని అనుకుంటున్న నాకు ఈ పుస్తకం సమాధానం ఇచ్చింది. ఈ పుస్తకాన్ని Ayn Rand పుస్తకాలతో పోల్చడం నా ఉద్దేశం కాదు కాని అతను చెప్పదల్చుకున్న విషయాన్ని అద్భుతమైన narration అంతకు మించిన screenplay వీటికి తొడు non-linear structure ఇంత కంటే ఏమీ చెప్పగలం రచయిత సామర్థ్యం గురుంచి. ముఖ్యంగా “resurrection” కథ అసలికి ఆ అంశాన్ని అలా ఎలా చెప్పగలిగాడు ఇతను ఈ కథని చదివిన వెంటనే మళ్ళీ చదివాను మళ్ళీ మళ్ళీ చదివాను almost ఇతని మీద వీపరితమైన అసూయ కలిగింది అలా ఎలా రాయగలిగాడు ఇతను అని. ఈ ఒక్క కథనే కాదు ఆల్మోస్ట్ అన్ని కథలు అలానే మళ్ళీ మళ్ళీ చదివాను.

ఇలాంటి పుస్తకాలు మరి కొన్ని వస్తే తెలుగు భాష ఎక్కడికి పోదు మనతోనే ఉంటుంది. కానీ ఇలాంటి పుస్తకాలు రాయడం అసాధ్యం ఎన్నో ఏళ్ల నుంచి వేదనతో నిండిన అగ్నిగోళాలు మింగుతూ వాటితో ignorance పెరుకుపోతున్న నెత్తుటిని నిత్యం తగలు పెట్టుకుంటే గాని ఇలా రాయలేము.

ఈ పుస్తకం చదవండి. ఒక కథ చదవండి తరువాత మీరు చదవాల్సిన అవసరం లేదు ఆ పుస్తకమే మీతో చదివిస్తుంది.

Thank You వెంకట్ గారు ఫర్ “సోల్ సర్కస్”

“నీ హృదయం నీ రింగ్ మాస్టర్, ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురుంచి రాయగలిగితేనే అది కథ అవుతుంది. లేకపోతే అది ఆవు వ్యాసమే! ఇప్పటివరకు వచ్చిన కథలే మళ్ళీ వస్తాయి. ఇప్పటివరకు చెప్పిన నీతే మళ్ళీ చెప్తారు. అప్పుడు ఈ భూమ్మీద కొత్త కథంటూ పుట్టాదు. Go Do some సోల్ సర్కస్.” – వెంకట్ శిద్దారెడ్డి

Exit mobile version