సీతారాములు అరణ్యవాసంలో పర్ణశాల గురించి మీకు తెలుసా?

రాముడు స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం భద్రాద్రి. శ్రీరాముడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. గర్భాలయంలో ఉన్న శ్రీరాముని మూలవిరాట్టు, వనవాసంలో ఉన్నప్పుడు వారు ఏర్పరుచుకున్న పర్ణశాల, ఇక్కడే నివసించిన శబరికి రాముడు ఇచ్చిన వరం ఇలా ఎన్నో విశేషాలు కలిగిన మహిమ గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి. మరి శ్రీరాముడు నిర్మించిన పర్ణశాల గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

sri ramతెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఉంది. భద్రాచలంలోని పవిత్ర నది గోదావరి నది తీరమున సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఇక్కడ విష్ణువే శ్రీ సీతారామచంద్రుడై వెలిసాడు. ఈ ఆలయాన్ని భద్రాద్రి కోదండ రామాలయం అంటారు. ఇక ఈ ఆలయానికి కొన్ని కోలోమీటర్ల దూరంలో పంచవటి అని పిలువబడే గ్రామం ఉంది. ఇక్కడే శ్రీరాముడు నిర్మించి నివసించిన పర్ణశాల ఉంది. ఈ పర్ణశాల భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

sri ramశ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ పర్ణశాల నిర్మించుకొని నివసించుట వలన ఈ ప్రాంతానికి పర్ణశాలగా, ఇక్కడ వెలసిన శ్రీరాముడి ఆలయానికి పర్ణశాల ఆలయంగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడ సీతారాములు అరణ్యవాసంలో సంచరించిన వింతలు విశేషాలు, ఇచట జరిగిన విశేషాలు ఇప్పటికి తెలియచేసి చూపిస్తుంటారు. ఇక్కడ శూర్పణఖ పరాభఘట్టం, సీతమ్మ మాయలేడిని కోరడం, సీతాపహరణం, రావణుడి రథచక్రపు గుర్తులు గల రావణగుట్ట కొన్నిటిగా చెప్పవచ్చు. ఇవి ఇప్పటికి ఈ ప్రాంతంలో ఉన్నవి.

sri ramఇక ఈ పర్ణశాల మధ్య గోదావరి నది ఒడ్డున ఒక రాతి మీద సీతారాములు కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. ఇక్కడ ఒకవైపు గోదావరి నది మరొక వైపున పర్వత రాజములు గల ఈ ప్రదేశంలో ఉన్న పర్ణశాల కి కొద్దీ దూరంలో కొండవాగు ఒకటి ఉంది. దీనినే సీతమ్మ వాగు అని పిలుస్తారు. ఈ వాగు నీటిలో సీతమ్మవారు స్నానం చేసేవారట అందుకే ఆ వాగుకి సీతమ్మ వాగు అనే పేరు వచ్చినదని చెబుతారు. ఇక్కడ సీతమ్మవారు బట్టలు ఆరేసుకునే చోటు, ఆభరణాలు పెట్టిన చోటు, పసుపు, కుంకుమ బరిణెలు ఉంచిన చోటు అని స్థానికులు భక్తులకి వివరిస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR