How A Student From Osmania University Emerged As The ‘Che Guevera Of Hyderabad’. Read Here

ఉస్మానియా యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్, మ‌తోన్మాదుల అర‌చ‌కాల‌కు అడ్డుకట్ట వేసిన నాయకుడు, ఎప్పుడు ఎవరికీ కూడా భయపడని ధైర్యశాలి, విద్యార్థి ఉద్యమానికి సూర్యుడు, ఉస్మానియా యూనివర్సిటీలో మెరిసిన తార, హైదరాబాద్ చేగువేరా జార్జ్ రెడ్డి. మరి జార్జ్ రెడ్డి ఎవరు? గోల్డ్ మెడల్ సాధించి, తన ప్రతిభతో ప్రొఫెసర్లని ఆశ్చర్యపరిచిన అయన ఉద్యమం వైపు ఎందుకు అడుగులు వేసాడు,  అయన హత్య వెనుక కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

goerge reddyరఘునాథ రెడ్డి, లీలావర్గీస్ దంపతులకి కేరళ రాష్ట్రంలో 1947 జనవరి 15 వ తేదీన జార్జ్ రెడ్డి జన్మించారు. జార్జ్ రెడ్డి గారి తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు అవుతుండటం వలన అయన చదువు కొల్లం, మద్రాస్, వరంగల్, హైదరాబాద్ లో సాగింది. జార్జ్ రెడ్డి కి చిన్నతనం నుండి కూడా ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఇక 1964 లో బిఎస్సి చదవడానికి హైదరాబాద్ లోని నిజం కాలేజీలో చేరాడు. ఇలా డిగ్రీ పూర్తిచేసిన జార్జ్ 1967 లో ఉస్మానియాలో ఎమ్మెస్సి చేయడం కోసం జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో ప్రపంచం అంత కూడా విప్లవ పోరాటాలతో రగిలిపోతుంది. ద‌క్షిణాఫ్రికా, వియ‌త్నాం, ఫ్రాన్స్ త‌దిత‌ర దేశాల్లో సామ్రాజ్యవాద వ్య‌తిరేక ఉద్య‌మాలు వెల్లువెత్తున్నాయి. అయితే ఉస్మానియా లో చేరిన జార్జ్ కి చదువు పైన ఉన్న పట్టుని చూసి ప్రొఫెసర్స్ కూడా ఆశ్చర్యపడేవారు. ఎందుకంటే సబ్జెక్టు లో ప్రొఫెసర్లు చెప్పలేని క్వశన్స్ ని జార్జ్ అడిగేవాడు. జార్జ్ బాక్సర్ కూడా, అయన  ఎక్కువసమయం ఫిట్ గా ఉండటానికి వ్యాయాయం చేస్తుండేవాడు. అయితే ఎమ్మెస్సి పరీక్షల్లో టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన జార్జ్ ఆన్సర్ పేపర్ దిద్దిన బాంబే కి చెందిన ఒక ప్రొఫెసర్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ని ఇంత ఈజీగా సాల్వ్ చేయడం ఆశ్చర్యానికి గురై అతడిని కచ్చితంగా కలసి తీరాలని భావించి ఓయూ క్యాంపస్ కి వచ్చి విసి ఛాంబర్ లో జార్జ్ ని కలుసుకున్నాడు. ప్రపంచం అంత గర్వించదగ్గ మేధావి మీ క్యాంపస్ లోనే ఉన్నాడని విసి కి చెప్పి వెళ్ళాడు.

goerge reddyప్రపంచ విప్లవ కారుడు చేగువీర జార్జ్ రెడ్డి ని బాగా ప్రభావితం చేసాడు. చేగువీర రాసిన గెరిల్లా వార్ ఫెయిర్ అండ్ రివల్యూషన్, బొలీవియాన్ డైరీ గ్రంథాలు జార్జ్ ని బాగా ప్రభావితం చేసాయి. ఇక జార్జ్ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే, కాంగ్రెస్ లోని యంగ్ టార్క్ బృందంతో మొదలయింది. ఇలా కొన్ని రోజులు నమ్మి అందులోనే ఉన్న జార్జ్ చివరకు అది పెట్టుబడిదారీ వ్యవస్థని కాపాడేదని భావించి అందులో నుండి బయటికి వచ్చాడు. అయితే 1969 వ చివర్లో అయనలో ప్రశ్నించే తత్వం పెరిగిపోయింది. ఇందుకు కారణం, అప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమం, శ్రీకాకుళ రైతాంగ పోరాటం, వియాత్నం యుద్ధం ఇవ్వన్నీ కూడా జార్జ్ రెడ్డి ఆలోచనలను కొత్తదారి పట్టించాయి. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు, నేను పుట్టింది నాకోసం కాదని, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించాలని అనుకున్నాడు. ఓయూ లో ఎక్కువశాతం మంది సామజిక అణిచివేతకు గురవుతూ ఉండేవారు. అదిచూసిన జార్జ్ సాధారణ జీవితం గడుపుతూ క్యాంపస్ లో ఆదర్శ విప్లవ కారుడిగా మారాడు.

goerge reddyఅయితే తనలాంటి ఆలోచనలు ఉన్న కొంతమంది స్నేహితులతో కలసి ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఏర్పాటు చేసాడు. ఇందులో ఎక్కువగా సామజిక మార్పు గురించి చర్చలు జరిగేవి. మతోన్మాదం, వియాత్నం యుద్ధం పేరుతో జార్జ్ కరపత్రాలు ముద్రించేవాడు. శాస్రియ విద్య విధానం పై జాతీయ స్థాయిలో జరిగిన ఒక సమావేశంలో జార్జ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది. ఇక జార్జ్ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు అయినా అయన మాటలు ఆలా వింటూనే ఉండిపోయేవారు. ఇది ఇలా ఉంటె, 1970 లో ఉస్మానియా క్యాంపస్ లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఒక వర్గ భావజాలమే అజండాగా ఉన్న విభాగంలో ఆనాటి ఫ్యుడెన్ శక్తుల వారసులు చక్రం తిప్పారు. వీరినే లంపెంగ్ గ్యాంగ్ అని పిలిచేవారు. వీళ్ళ ఆగడాలు అంత ఇంత కాదు. వీళ్ళు ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను హింసించడం, వారికీ నచ్చిన విధంగా విచ్చలవిడిగా చేస్తూ ఉండగా కొంతమంది పాలక మండలి  సభ్యులు వీరికి మద్దతు ఇచ్చేవారు. దీంతో ఈ గ్యాంగ్ మరింత రెచ్చిపోయేవారు.

ఈ గ్యాంగ్ మతం ముసుగులో, కులం అహంకారంతో దళితులకు, మహిళలకు చదువు ఎందుకు అంటూ క్యాంపస్ లో అరాచకం చేసేవారు. ఇది తెలుసుకున్న జార్జ్ ఆ గ్యాంగ్ కి ఎదురు తిరిగాడు. వారి చేతిలో అన్యాయానికి గురైన విద్యార్థులను ఏకం చేసి వారికీ ధైర్యాన్ని ఇచ్చి, టీజింగ్ పేరుతో హింసకి గురవుతున్న అమ్మాయిలకి అండగా ఉండి, ఆ గ్యాంగ్ కి సపోర్ట్ గా ఉంటున్న అధికారులను నిలదీసాడు. దాంతో జార్జ్ రెడ్డి పైన ఆ గ్యాంగ్ ఎన్నో సార్లు దాడులకు పాల్పడింది. ఇలా ఉస్మానియాలో సాగుతున్న ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఉద్యమాన్ని హైదరాబాద్ అంత విస్తరించేలా చేసాడు. ఇలా ప్రజా సమస్యలపైనా పోరాడుతూ ప్రజలతో పాటు కొంతమంది మేధావుల మద్దతును కూడా సంపాదించాడు. దింతో జార్జ్ రెడ్డి చేస్తున్న పోరాటం రాష్ట్రం అంత కూడా ఒక సంచలనం అయింది. అప్పటివరకు క్యాంపస్ వరకే వణుకు పుట్టించిన జార్జ్ తన సిద్ధాంతాలతో అప్పటి పాలక మండలికి కూడా చెమటలు పట్టించాడు. దీంతో ప్రభుత్వం జార్జ్ రెడ్డి పైన pdsv సభ్యులపైనా అక్రమ కేసులకు పాల్పడింది. అయినా జార్జ్ రెడ్డి ఏ మాత్రం భయపడకుండా వెనుకడుగు వేయకుండా సమావేశాలలో ప్రజా సమస్యలపైనా తన గొంతు వినిపించాడు.

goerge reddyఆ సమయంలోనే ఉస్మానియాలో 1972 లో విద్యార్థులు సంగం ఎన్నికలు వచ్చాయి. అయితే అప్పటివరకు మతోన్మాదులకు బయపడి ఎవరు కూడా పోటీ చేసేవారు కాదు. కానీ జార్జ్ రెడ్డి రాకతో ఆ పరిస్థితులు పూర్తిగా మారడంతో ఎబివిపి కి పీడీఎస్ కి మధ్య పోటాపోటీ జరిగింది. ఇక అప్పటికే జరిగిన ఎన్నికల్లో ఎబివిపికి వ్యతిరేకత పెరగడంతో ఇంజనీరింగ్ కాలేజీ ఎన్నికలను రెండు గ్రూపులు కూడా ప్రతిష్ఠతకంగా తీసుకున్నాయి. ఇక ఎబివిపి తరుపున లఖన్ సింగ్ పోటీ పడగ, జార్జ్ రెడ్డి తరుపున యాదగిరి బరిలోకి దిగాడు. అయితే అంతకుముందు ఒకసారి జార్జ్ రెడ్డి పైన ఒక దాడి జరుగగా ఆ దాడిని తిప్పి కొట్టినప్పటికీ జార్జ్ రెడ్డి ని ఒంటరిగా వెళ్లోద్దని తన స్నేహితులు చెప్పారు. కానీ 1972 ఏప్రిల్ 14 వ తేదీన క్యాంపస్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. జార్జిరెడ్డి పానెల్ నుంచి స‌హాయ కార్య‌ద‌ర్శిగా పోటీచేస్తున్న రామ‌చంద్రారెడ్డి వచ్చి లఖన్ సింగ్ మనుషులు మన ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని చెప్పడంతో ఆవేశంతో జార్జ్ రెడ్డి ఒక్కడే ఇంజనీరింగ్ హాస్టల్ వైపు పరిగెత్తి వెళ్లగా అక్కడ ధూల్ పెట్ కి చెందిన 30 మంది రౌడీలు ఒక్కసారిగా కత్తులతో జార్జ్ రెడ్డి పైన దాడి చేసి హత్య చేసారు. జీనా హైతో మ‌ర్నా సీఖో, క‌దం క‌దం ప‌ర్ ల‌డ్నా సీఖో అంటూ విద్యార్థిలోకానికి పోరాట మార్గాన్ని అందించిన ఉద్యమకారుడు నేలకి ఓరుగగా, ఒక్కసారిగా ఉస్మానియా క్యాంపస్ అంతకుడా జార్జ్ రెడ్డి హామర్ హై అంటూ నినాదాన్ని ఇవ్వగా ఆ నినాదం రాష్ట్రమంతా వినిపించింది.

ప్రజా సమస్యలపైనా పోరాడిన, మత రాజకీయాలను ఎదురించిన విప్లవ యోధుడు,  హైదరాబాద్ చేగువీర జార్జ్ రెడ్డి ఇప్పటికి ఉద్యమించే ప్రతి విద్యార్ధి పోరాటంలో బ్రతికే ఉంటాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR