Aa vigrahaniki chematalu pattadam venuka rahasyam telusthe ascharyapotharu

0
13522

మన దేశంలోని ప్రతి ఆలయం వెనుక ఒక దైవ రహస్యం అనేది దాగి ఉంటుంది. ప్రతి ఆలయంలో ఏదో ఒక విశేషం తప్పకుండ ఉంటుంది. అలానే ఇక్కడ ఉన్న ఈ ఆలయంలోని విగ్రహానికి చెమటలు పట్టడం మన కళ్లారా చూడవచ్చు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ విగ్రహానికి అసలు చెమటలు పట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. vigrahamతమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రం ఉంది. 108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుత విషయం ఉన్నది. ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపు సమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది. అయితే ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంస వాహనం మీద ఊరేగింపుగా వేలుతూవుండగా స్వామివారు గరుడ వాహనం మీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.vigrahanikiఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది. అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది.2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది. 3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది.4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.5 వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మాయాల్సుంటుంది.5ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది. vigrahanikiప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందువేళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూవుంటుంది. విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతు ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి. ఎందుకంటే గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువువుండి క్రమంగా పెంచుకుంటూ పోయే సరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ గరుత్మంతుని తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలో కాలగారుడన్ అని పిలుస్తారు. vigrahanikiఇలా చెమటలు పడుతున్న గరుత్మంతుని విగ్రహాన్ని మరియు స్వామివారి ఊరేగింపు చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ చిత్రాన్ని తిలకిస్తుంటారు.vigrahaniki