Home Unknown facts Aadavaari Abharanala Venuka Artham

Aadavaari Abharanala Venuka Artham

0

మన హిందూసాంప్రదాయంలో ఎన్నో ఆచారాలనేవి ఉన్నాయి. అందులో భాగమే ఆడవారు నగలు ధరించడం. అయితే ఇలా ఆడవారు వాటిని ధరించడం వెనుక శాస్త్రపరంగా కొన్ని నిజాలు అనేవి ఉన్నాయి. మరి ఆడవారు ఆభరణాలు ధరించాలనే ఆచారం ఎందుకు ఉంది? అలా ధరించడం వెనుక పురాణాలూ ఏం చెబుతున్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.jewellery

వడ్రాణము:
దీని వలన గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అంతేకాకుండా బంగారాన్ని ఏ రూపంగా ధరించిన కూడా ఎంతో శక్తి అనేది శరీరానికి సంక్రమిస్తుంది.

ముక్కర:దీన్ని ధరించడం వలన మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది. ముక్కర ధరించడం వలన ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం. అంతేకాకుండా భార్యాభర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం. అయితే అలంటి చెడుశ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కర పవిత్రం చేస్తుంది.

కాలికి మెట్టెలు:గర్భకోశంలో ఉన్న నరాలకు కాలి వేళ్ళలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలి వెలికి రాపిడి ఉండాలి. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళల్లో ఉంటాయని చెబుతారు.

చంద్రవంక:శిరో మధ్య ప్రదేశంలో ధరించే దానినే చంద్రవంక అని అంటారు. ఆ ప్రాంతం నుంచే జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రము నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందువలనే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు.

కంఠానికి వేసుకునే హారాలు:హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించమని చెబుతూ ధరించటమే కంఠానికి వేసుకునే హారాలు. అయితే తెలిసి తెలియని పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించడం వలన చెడు కలలు రాకపోవటమే కాదు, గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది.

Exit mobile version