Home Unknown facts Abburapariche ajantha guhalanu modhatakanugonnadhi yevaro thelusaa?

Abburapariche ajantha guhalanu modhatakanugonnadhi yevaro thelusaa?

0

మన దేశంలో కొన్ని ఆలయాలలో ఉండే శిల్పకళా నైపుణ్యం ఇప్పటికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే పూర్వము బౌద్ధ మతులు ఎక్కువగా గుహల్లోనే ఉండేవారు అనడానికి నిదర్శనంగా చాలా గుహల్లో వారి ఆధారాలు సేకరించబడ్డాయి. అలాంటి గుహల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన గుహలు అజంతా, ఎల్లోరా. ఇక్కడి శిలలు, శిల్పాలు సందర్శకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. మరి ఈ గుహలు వెలుగులోకి ఎలా వచ్చాయి? ఆ గుహల్లో ఏం ఉంది, వాటి గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ajanthaమహారాష్ట్ర రాష్ట్రం, మన్మాడ్ కు తూర్పుగా సుమారు 50 కి.మీ. దూరంలో జలగాం అనే రైల్వే స్టేషన్ నుండి సుమారు 60 కీ.మీ. దూరంలో అజంతా గుహలు ఉన్నాయి. రెండువేల సంవత్సరాల క్రితమే అంటే ప్రపంచానికి నాగరికత తెలియనినాడే భారతదేశంలో గొప్ప నాగరికత, ఉత్తమ శాస్రియ విజ్ఞానము వెల్లివిరిసిందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ మొత్తం 26 అజంతా గుహలు, 34 ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవి. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కనబడుతుంది. అజంతాలోని గుహలు అర్ధచంద్రాకారంగా ఉన్న ఒక కొండల వరుసనను, ముందు భాగం వైపు తొలచి నిర్మించారు. గుహ లోపల వివిధ రకాల శిల్పాలే కాకా, రంగులతో చిత్రాలు అనేకం చిత్రించారు. ఈ గుహాలన్నీ కొండపాద భాగం నుండి సుమారు 250 అడుగుల ఎత్తున ఉన్నాయి. అంటే కొండ భాగం మధ్యలో ఉన్నాయి. అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ వరుసకు ఎదురుగా మరొక అర్ధచంద్రాకారపు కొండల వరుస ఉంది. ఈ రెండు వరుసలకు మధ్యగా ఉన్న పల్లంలో ఒక చిన్న వాగు ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని అంజనాది అని అంటారు. కానీ దీని అసలు పేరు వాగిర నది. ఇది ఏడూ రూపాలుగా ప్రవహిస్తుంటుంది. కనుక దీనిని సప్తకుండం అని అంటారు. అజంతా గుహాలయంలోని 30 గుహలను యునెస్కో ప్రపంచ హెరిటేజ్ ప్రదేశాలుగా గుర్తించింది. ఈ గుహలను 1819 లో యాదృచ్చికంగా గుర్తించారు. అయితే మద్రాసు 28 వ అశ్విక దళానికి చెందిన జాన్ స్మిత్ ఈ ప్రాంతానికి వేటకు వచ్చినప్పుడు 10 వ గుహ అగ్రభాగాన్ని చూడడంతో ప్రస్తుత ప్రపంచంలోకి అజంతా గుహల ఉనికి వెలుగులోకి వచ్చింది. అజంతా గుహాలన్నింటిలో మొదటి గుహ చాల గొప్పదిగా చెబుతారు. అయితే గుహలను బుద్ధిజానికి సంబంధించిన శిల్పకళను దాచుకున్న కళా నిలయాలుగా వర్ణించవచ్చు. కొన్ని శిల్పాలు తెరవాడ సంప్రదాయంలో కిరీటం, పాదముద్రలు మాత్రమే ఉంటాయి. మరికొన్ని మహాయాన సంప్రదాయంలో శిల్పాలుగా గోడల్లో తీర్చిదిద్దిన మురల్స్‌ రూపంలో ఉన్నాయి. ఈ చిత్రాల్లో బుద్ధుడు, ఇతర బోధిసత్వుల జీవితాలు, జాతక కథలు చిత్రించారు. రెండో గుహలో బుద్ధుని పుట్టుకకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి. ఇలా గొప్ప శిల్ప కల నైపుణ్యం ఉన్న ఈ అజంతా గుహలు పర్యాటకులను ఆకట్టుకుంటూ విశేష ఆదరణ పొందుతున్నాయి.

Exit mobile version