మనం పూజ చేసాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న ఆచారం. పూజ పూర్తి అయ్యాక టెంకాయ కొట్టేస్తాము, నైవేద్యం పెట్టెస్తాము, తంతు పూర్తి అయింది అని అనుకుంటాము. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది.
టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం. అరిష్ట నాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు పెద్దగా నియమాలను పాటించం. కానీ కొన్ని నియమాలను పాటించాలని పండితులు అంటున్నారు.
ఆ విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
- కొబ్బరి కాయను దేవుడి దగ్గర కొట్టటం వల్ల అరిష్ఠాలు అన్ని పోయి శాంతి కలుగుతుంది. కొబ్బరికాయను శుభ్రంగా కడిగి పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకొని కొట్టాలి. కొబ్బరికాయ కొట్టే సమయంలో కొట్టటానికి ఉపయోగించే రాయి ఆగ్నేయ దిశలో ఉండాలి.
- కొబ్బరికాయను సుమారుగా 8 అంగుళాల ఎత్తు నుండి కొట్టాలి. కొబ్బరికాయ సమంగా పగిలితే శుభం కలుగుతుందని భావిస్తారు. ఒకవేళ కొబ్బరికాయకొట్టినప్పుడు లోపల ఏమైనా నల్లగా ఉంటే శివాయ నమహ అంటూ 108 సార్లు జపిస్తే ఆ దోషం పోతుంది.
- కొబ్బరికాయను కొట్టిన తర్వాత నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోని కొబ్బరినీటిలో మరియు కొట్టిన కొబ్బరి చిప్పలలో పంచదార లేదా పటికబెల్లం పలుకులు వేసి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా కొట్టిన కొబ్బరి చిప్పలలో పంచదార వేసి నైవేద్యం పెడితే అన్ని శుభాలే జరుగుతాయట. మీరు కూడాకొబ్బరికాయ కొట్టినప్పుడు మర్చిపోకుండా పంచదార వేసి నైవేద్యం పెట్టండి.