మన దేశంలోని జ్యోతిష్య శాస్ర పండితులు ప్రస్తుత జతకచక్రం లోని 12 వ స్థానాన్ని బట్టి ఆ వ్యక్తికి సంబంధించిన గత జన్మ వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే విదేశీయ పండితుడు అయినా బెర్నీ యాష్ మాన్ గత జన్మ రహస్యాలను తెలుసుకోవడానికి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. మరి అయన కనిపెట్టిన సిద్ధాంతం ఏంటి? అయన చెప్పిన దాని ప్రకారం గత జన్మ వివరాలు ఏవిధంగా ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెర్నీ యాష్ మాన్ కనిపెట్టిన సిద్ధాంతం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న జాతక చక్రాన్ని అపసవ్య దిశలో చూస్తే ఆ వ్యక్తి యొక్క గతజన్మ జాతక చక్రం లభిస్తుందని, ఆ జాతక చక్రం ఆధారంగా ఆ వ్యక్తి గత జీవితం గురించి చాలా వరకు తెలుసుకునే వీలు ఉంటుందని చెప్పాడు. ఇక శని మరియు రాహుకేతువులు ఒక వ్యక్తి గతజన్మ వివరాలను తెలుసుకోవడంలో సహకరిస్తాయి. అయితే ప్రస్తుతం జీవిస్తున్న అందరికి గత జన్మ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే కొందరికి ఈ జన్మే మొదటి జన్మ కూడా కావచ్చు. ఒక వ్యక్తి జాతచక్రంలోని శని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇదే మొదటి జన్మ లేదా గత జన్మ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటె, ఒక వ్యక్తి యొక్క జాతకంలో 12 వ స్థానం అయినా రాశిని బట్టి అతడు గతజన్మలో ఏ వృత్తి చేసేవాడు? ఎలా జీవించేవాడు? ఏవిధంగా మరణించాడనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం మేషరాశి అయినట్లే వారు గత జన్మలో సైనికుడిగా గాని, యోధుడిగాగాని, వైద్యుడిగా జీవించారు. ఆ వ్యక్తి గతజన్మలో అగ్నివల్ల కానీ, ఆయుధం వల్ల కానీ, ప్రమాదంలో కానీ, యుద్ధం వల్ల మరణించినట్లు తెలుస్తుంది.
వృషభం:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం వృషభరాశి అయినట్లైతే గతజన్మలో వారు భూమికి సంబంధించిన వృత్తిలో కానీ, భూమి పన్నులు సేకరిస్తూ కానీ జీవించినట్లుగా చెబుతున్నారు. వీరు గతజన్మలో మెడకి సంబంధించిన అనారోగ్యం వల్ల లేదా ఉరివేయబడటం వలన చనిపోయినట్లు చెబుతున్నారు.
మిధున రాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం ముదున రాశి అయితే వారు గత జన్మలో పత్రిక విలేకరిగా కానీ, ఒక మంచి వక్తగా కానీ, ఒక జేబు దొంగగా జీవించినట్లుగా చెబుతున్నారు. వీరు ఊపిరి ఆగకుండా, క్యావ్యాధి వల్ల లేదా ఊపిరితిత్తుల సమస్య వల్ల మరణించినట్లుగా చెబుతున్నారు.
కర్కాటకరాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం కర్కాటకరాశి అయితే వీరు ఒక పెద్ద కుటుంబానికి తండ్రిగా కానీ తల్లిగా కానీ లేదా ఒక నావికుడిగా జీవించినట్లు చెబుతున్నారు. గత జన్మలో వీరు ప్రసవం అవుతున్నపుడు కానీ, నీళ్లలో మునిగిపోవడం వల్ల మరణించినట్లుగా చెబుతున్నారు.
సింహరాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం సింహరాశి అయితే వీరు గత జన్మలో ఒక పెద్ద రాజ వంశానికి కానీ, గౌరవనీయ వంశానికి కానీ, పేరు పొందిన వైద్యుడు లేదా నటుడు అయి ఉంటారు. ఇక గత జన్మలో వీరు గుండె లేదా వెన్ను సమస్యల కారణంగా మరణించారు.
కన్యారాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం కన్యారాశి అయినట్లయితే వీరు గత జన్మలో తప్పని సరిగా ఒక స్త్రీ అయి ఉంటారు. ఇక వీరు సేవచేసే ఒక నర్సుకాని, ఒక సేవకురాలు కానీ, సహాయం చేసే సన్యాసి అయి ఉంటారు. వీరు గత జన్మలో కరువు వల్ల కానీ, తిండి లేక, అనారోగ్యం వల్ల మరణించారు.
తులారాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం తులారాశి అయితే వారు గత జన్మలో రాయబారిగా కానీ న్యాయమూర్తిగా కానీ ప్రభుత్వ ఉద్యోగిగా జీవించేవారు. ఇక వీరు మద్యపాన వ్యసనం వల్ల లేదా శృంగార సుఖాలు అనుభవించడం వలన గత జన్మలో మరణించారు.
వృచ్చికరాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం వృచ్చికరాశి అయితే ఆ వ్యక్తి గత జన్మలో క్షుద్ర పూజలు చేసే మంత్రవాదిగా కానీ, గూఢచారిగా కానీ జీవించినట్లు గ్రహించాలి. వీరు గత జన్మలో ఇతరుల చేతిలో మరణించారు.
ధనూరాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం ధనూరాశి అయితే ఆ వ్యక్తి గత జన్మలో ఉపాధ్యాయుడిగా కానీ, వేదాంతిగాకాని నిరంతరం ప్రయాణించే వాడిగా జీవించేవారు. ఇక వీరు సత్యాన్ని ప్రచారం చేసినందుకు మరణించారు.
మకర రాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం మకరరాశి అయితే ఆ వ్యక్తి గత జన్మలో స్వయం కృషితో సంపదలు సంపాదించినా వ్యక్తిగా కానీ, ఒక సన్యాసిగా కానీ, ఒక అంగవికలుడిగా కానీ జీవించినట్లు చెబుతున్నారు. ఇక వీరు శ్రమ ఎక్కువగా పడటం వలన లేదా వయసు పై బడటం వలన మరణించారు.
కుంభరాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం కుంభరాశి అయితే వీరు గత జన్మలో ప్రజల కోసం పాటు పడిన సంస్కర్తగా కానీ, విద్యావేత్తగా కానీ, శాస్రజ్ఞుడిగా అయి ఉంటారు. ఇక వీరు గత జన్మలో ప్రేలుడు లేదా విద్యుచ్ఛక్తి కారణంగా అనేక మందితో కలసి మరణించారు.
మీనరాశి:
ఒక వ్యక్తి ప్రస్తుత జాతకచక్రంలోని 12 స్థానం మీనరాశి అయితే ఆ వ్యక్తి గత జన్మలో కళాకారుడిగా కానీ మాత ప్రచారకుడిగా కానీ అతింద్రియ శక్తులు కలిగినవారై ఉంటారు. వీరు మద్యం అధికంగా తాగడటం వలన గతజన్మలో మరణించారు.
ఇక గత జన్మలో ఒక వ్యక్తి చేసిన చెడు లేదా మంచి పనుల ఫలితం అనేది ఆ వ్యక్తి ఈ జనంలో అనుభవించి తీరాల్సిందే అని జ్యోతిష్కులు చెబుతున్నారు.