స్ప్రింగ్ ఆనియ‌న్స్ తో ఉపయోగాలు!

ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు. తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదు అంటారు. కానీ ఉల్లి ధరకు బయపడో లేక ఘాటు నచ్చకనో కొందరు ఉల్లిపాయను దూరంగా ఉంటారు. అలాంటి వారికి ఉల్లికాడల మంచి ప్రత్యామ్నాయం. ఉల్లికాడల ఖరీదు చాలా తక్కువే. ఉల్లిపాయల్ని కొనలేక, తినలేక బాధపడుతున్నాం అనుకునే వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు తెచ్చుకోవచ్చు. పోషకాల పరంగా చూసినా ఇవెంతో చాలా ఉపయోగపడతాయి.

spring onionsఇంగ్లిష్‌లో స్ప్రింగ్ ఆనియ‌న్స్ గా పిలవబడే ఉల్లికాడలని ఫ్రైడ్ రైస్ ,సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. చైనా ,జపాన్ వాసులు సలాడ్స్ ,సూపుల్లో వీటిని ఎక్కువగా వాడతారు.ముఖ్యంగా సీఫుడ్ లో వీటిని వాడితే నీసువాసన వుండదు.కాబట్టి అక్కడ వాటి వినియోగం ఎక్కువ. వీటితో సాధార‌ణంగా కూర‌లు చేసుకుంటారు. లేదా కొత్తిమీర‌, క‌రివేపాకులా వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. ఉల్లికాడ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

spring onions chickenఉల్లికాడలలో విటమిన్ C, విటమిన్ B2, థయామిన్ లు సమృద్ధిగా కూడా ఉంటాయి. విటమిన్ A, విటమిన్ K ని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇవి కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం మరియు క్రోమియం, మాంగనీసు, ఫైబర్ కు మంచి మూలం.

vitamin k with spring onionsఉల్లిపాయలతో పోలిస్తే కాడల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి రక్తపీడనం అదుపులో ఉంటుంది. అలాగే పచ్చి ఉల్లికాడల రసం తీసుకొని అంతే పరిమాణంలో ,తేనెతో కలిపి తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.వీటిలోని పెక్టిన్ అనే పదార్థం పెద్ద పేగుల్లోని పొరలు చెడిపోయి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. పైల్స్ సమస్యతో బాధపడేవారు పెరుగులో ఉల్లికాడలని వేసి పచ్చిగా తింటే మంచిది. పైల్స్ వల్ల వచ్చే వాపు ,నొప్పి తగ్గుతాయి

spring onions juiceఉల్లి కాడల్లో ఉండే కెమోఫెరాల్‌ అనే ఫ్లవనాయిడ్‌ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్టు కూడా చూస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటూ, ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తగ్గుతాయి. వీటిల్లో ఉండే ఫోలేట్లు గుండె జబ్బులని కూడా అదుపులో ఉంచుతాయి.

గర్భిణిలు తొలి మూడునెలల్లో వీటిని తరచూ తినడం వల్ల, కడుపులో బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్‌ బాగా అందుతుంది. గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి. ఆటిజం వంటి ప్రవర్తనాపరమైన సమస్యలూ రాకుండా ఉంటాయి.

ఉల్లికాడ‌ల్లో పెక్టిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది పెద్ద పేగుల్లోని సున్నిత‌మైన పొర‌ల‌ను ర‌క్షిస్తుంది. దీంతో పెద్ద పేగు దెబ్బ తిన‌కుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా ఉంటాయి.

blood pressure controlఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. గ్లూకోస్ శక్తిని బాగా పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది.

కెలొరీలూ కొవ్వూ తక్కువగా… పీచు ఎక్కువగా ఉండే ఉల్లికాడల్ని తరచూ తినే వారిలో అధిక బరువు సమస్య తలెత్తదు. డైటరీ ఫైబర్‌ అంటే ఆహార సంబంధిత పీచు వీటి నుంచి సమృద్ధిగా అందుతుంది. అది ఆకలిని అదుపులో కూడా ఉంచుతుంది.

ఉల్లికాడలను విరివిగా తినడం వలన వాడితే రక్తపోటు, ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఉల్లికాడల్లోని గ్జియాంతిన్‌ అనే పదార్థం కంటిచూపుని బాగా మెరుగుపరుస్తుంది. హానికారక కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR