ఆయుర్వేద టీల్లో అగ్రస్థానం దక్కించుకుంటున్న వైట్ టీ!

కరోనా వచ్చినప్పటి నుండి తెల్లారి లేస్తే ఏ కొత్త రోగం వస్తుందో తెలియక భయంతోనే జనాలు జీవనం సాగిస్తున్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఈ జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి అనేవి… మనకు తరచూ వచ్చేవే. కానీ… ఈ కరోనా రోజుల్లో అలాంటివి వస్తే, మనలో టెన్షన్ పెరగడం సహజం. ఆస్పత్రులకు వెళ్లి టెస్టు చేయించుకుంటే, రిపోర్ట్ లో ఏం వినాల్సి వస్తుందో అనే భయం.

white teaఒకవేళ మనకు ఏ కరోనా లేకపోయినా… టెస్టు కోసం వెళ్లినప్పుడు సోకితే, అంతకంటే దురదృష్టం ఉండదు. ఐతే… అసలీ సమస్యలు రాకుండా చేసుకోవడానికీ, వస్తే వెంటనే తగ్గించేసుకోవడానికీ ఆయుర్వేదంలో ఓ దివ్యమైన టీ ఉంది. ఈ టీని ఓ రోజులో 2 సార్లు తాగితే… చాలు ఎటువంటి రోగం దరిచేరదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అదే వైట్ టీ.

చాలా మంది బ్లాక్ టీ, గ్రీన్ టీ అని అనేక ర‌కాల టీ ల గురించి విని ఉంటారు. కానీ వైట్ టీ గురించి చాలా మందికి తెలియ‌దు. దీన్నే క‌మెల్లియా టీ అని పిలుస్తారు. క‌మెల్లియా సైనెసిస్ అనే మూలిక నుంచి ఈ టీని త‌యారు చేస్తారు. బ్లాక్, గ్రీన్ టీల్లో ఉండేంత కెఫైన్ కంటే…. ఇందులో తక్కువ కెఫైన్ ఉంటుంది. ఈ వైట్ ‌టీలో కూడా ఇప్పుడు చాలా రకాలు వచ్చేశాయి.

white tea vs green teaపాలు, ఇతర పల పదార్థాలతో తయారయ్యే వైట్ చాకొలెట్ మనకు తెలుసు.. దాని నుంచీ వచ్చిన కాన్సెప్టే ఈ వైట్ టీ. కానీ దానికీ, దీనికీ సంబంధం లేదు. కానీ ఇప్పుడు దీన్ని తాగమని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు సూచిస్తున్నారు. రోజుకు మూడు కప్పులు తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఇది గ్రీన్ టీ కంటే మంచిదని చెబుతున్నారు. దీని రుచి కూడా చాలా బాగుంటుందని సూచిస్తున్నారు.

ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకుంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వైట్ టీని రోజూ తాగ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌ప్పుతుంది. ఈ టీలో కెఫీన్, ఏజీసీజీ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తాగితే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

white tea nad its typesఈ టీలో ఉండే పోషకాలు మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. మరి ఈ వైట్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం… 200ml నీటిని 5 నిమిషాలు ఉడికించాలి. బుడగలు వస్తున్నప్పుడు నీటిని కప్పులో పొయ్యాలి. అందులో వైట్ టీ బ్యాగ్ వెయ్యాలి. రెండు నిమిషాల్లో అందులోని సారం నీటిలో చేరుతుంది. దీనికి తీపిదనం కోసం చక్కెర లేదా తేనె కలుపుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు తేనె కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది.

వైట్ టీలో కాటెచిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. అవి మన శరీరంలోని విష వ్యర్థాలతో పోరాడుతాయి. ఈ టీ తాగేవారిలో ముసలితనపు లక్షణాలు త్వరగా రావట్లేదు. ముడుతలు కూడా త్వరగా రావట్లేదు. జుట్టును కాపాడటంలో ఈ టీ బాగా ఉపయోగపడుతోంది. సూర్యుడి వేడి నుంచీ చర్మాన్ని, కణాలనూ రక్షించడంలో ఈ టీ చక్కగా పనిచేస్తోంది.

white teaవైట్ టీలో ఫ్లోరైడ్స్ అధికంగా ఉంటాయి. అవి సూక్ష్మ క్రిముల‌ను చంపుతాయి. దంతాలు, చిగుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో బాక్టీరియా న‌శిస్తుంది. క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదాన్ని త‌గ్గించే గుణాలు వైట్ టీలో ఉంటాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అందువ‌ల్ల వైట్ టీని రోజూ తాగుతుంటే క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు.

వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్ శ‌రీరంలో ఇన్సులిన్ ఉత్ప‌త్తిని పెంచుతాయి. దీంతో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఓ ఎముక‌ల వ్యాధి. దీని వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారి విరిగిపోతుంటాయి. అయితే వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్, కాటెకిన్స్ ఆస్టియోపోరోసిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR