తేనే నువ్వులు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు. అందుకే మనం  తినే ఆహరం పట్ల శ్రద్ధ తీసుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య సంరక్షణలో తెనేది తేనెది ప్రత్యేక పాత్ర. తేనేలో ఉన్న లక్షణాల కారణంగా మనకు ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టే మన పూర్వీకుల కాలం నుండి తేనెను ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు. తేనెను తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది.

ఇక నువ్వుల విషయానికి వస్తే నువ్వుల నూనెను చాలా మంది వంటల్లో వాడుతూ ఉంటారు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. ఇపుడు నూనె కాదుకదా కనీసం నువ్వులు కూడా కంటికి కనిపించడం లేదు. నువ్వుల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో నువ్వులు గ్రామాల్లోనేకాదు పట్టణాల్లో సైతం అరుదుగా కనిపిస్తున్నాయి.

  • ఈ నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు మెండు. అందుకే వీటిని ‘పవర్ హౌజ్’ అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ ‘ఇ’ కూడా సమృద్ధిగా ఉంటుంది. నల్ల నువ్వులు రోజు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ నువ్వుల్లో ఉండే పోషకాల వల్ల వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.
  • నువ్వులల్లో ఉండే మూలాశక్తి వల్ల అల్ట్రావైలెట్ కిరణాల చర్మంపై పాడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్‌ని నల్ల నువ్వలు తగ్గిస్తాయి. అయితే తేనె, నువ్వులను కలిపి ఉద‌యాన్నే తీసుకుంటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..? ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి ప్రతి రోజూ ఉదయం పరగడపున తింటే, దాదాపు ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుంది.

  • తేనే, నువ్వులలో ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర నిర్మాణంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం పెరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులురావు.
  • అదే విధంగా ఇది స్కిన్ మరియు హెయిర్ హెల్త్ కండీషన్ ను మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తి లభించటం వలన ఉదయం లేవగానే తినటం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాయామం చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రేగులను శుభ్రపరచి గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. పొట్టలో ఉన్న కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది. దాంతో బరువు కూడా తగ్గిపోతారు.

పీరియడ్స్ సమయంలో పొట్ట తిమ్మెర్లను తగ్గిస్తుంది. నొప్పులను నివారిస్తుంది. తేనె, నువ్వుల మిశ్రమం తీసుకోవడం వాపులు, వారిన్ సమస్యలు తగ్గుతాయి. దాంతో పొట్ట ఉదరంలో నొప్పులు తగ్గుతాయి. వీటిని తినటం వలన ఆకలి త్వరగా వేయదు. మెదడులో రక్త సరఫరా మెరుగు పడి అల్జీమర్స్ వంటి సమస్యలు రావు. మెదడు యాక్టివ్ గా మారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR