కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఏది వేసుకుంటే మంచిది? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి?

కరోనా మహమ్మారి కట్టడికి మాస్కు ధరించాం.. సామాజిక దూరం పాటించాం అంటే సరిపోదు.. కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. అదొక్కటే ప్రస్తుతం కరోనాకు సరైన అస్త్రం. కానీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోక జనం సతమతమవుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ డోస్ లే ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంతమంది జనాల్లో కోవిషీల్డ్ కంటే కోవాగ్జిన్ మంచిదని నమ్ముతూ వ్యాక్సినేషన్ కు దూరంగా ఉంటున్నారు.

Covid Vaccineమరి రెండింటిలో ఏ వ్యాక్సిన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. తొలి డోస్ కోవాగ్జిన్ తీసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే ఏం అవుతుంది? లేదా తొలి డోస్ కోవీషీల్డ్ తీసుకుని రెండో డోస్ కోవాగ్జిన్ తీసుకుంటే ఏంటి పరిస్థితి ఇలాంటి అనుమానాలు చాలామందని వెంటాడుతున్నాయి. వారిపై వైద్య నిపుణులు ఇచ్చే సలహా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Covid Vaccineవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏ వ్యక్తి కి అయినా సరే ఇమ్యూన్ జెనిటిక్ ఎఫెక్ట్స్‌పై పని చేస్తుంది. ఒక మనిషి నుండి మరొక మనిషికి కాస్త వేరేగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే విధంగా ఒక వ్యక్తి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వ్యాక్సిన్ వేయించుకున వరకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది తెలియదు. వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క వ్యాక్సిన్ ఆధారంగా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

కోవాక్సిన్ : 

Covid Vaccineహైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ ఇది కూడా కరోనా వైరస్ వచ్చే ప్రమాదం తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ చాలా మంది ఈ వ్యాక్సిన్ ని తీసుకున్నారు. కొవ్యాక్సిన్ ఇంజక్షన్ చేసిన ప్రాంతంలో ఎర్రగా అవడం వల్ల నొప్పి కలగడం లాంటివి జరుగుతాయి. జ్వరం, చెమట పట్టడం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, దురద కలగడం లాంటివి రావడం, తల నొప్పి కలగడం లాంటివి కొవ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వచ్చే ఇబ్బందులు.

కొవి షీల్డ్ : 

కొవి షీల్డ్ కు కోవాక్సిన్ కి మధ్య సైడ్ ఎఫెక్ట్స్ కాస్త ఒకేలా ఉంటాయి. టీకా చేసిన ప్రదేశం లో నొప్పి కలగడం, ఎర్రగా మారడం, జ్వరం ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండడం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తాయి.

Covid Vaccineతెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం రెండు వ్యాక్సిన్ల‌ను అందుబాటులో ఉన్నాయి. అయితే కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ ఎక్కువగా పంపిణీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కోవాగ్జిన్ అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లలో ఈ రెండింటిలో మ‌న‌కు న‌చ్చిన వ్యాక్సిన్‌ను ఎంచుకునేందుకు అవ‌కాశం లేదు. ఆయా జిల్లాల టీకా కేంద్రాల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేయించుకోవడం ఒక్కటే మార్గం. ఈ రెండింటిలో ఒక‌టి మంచిది, ఇంకోటి మంచిది కాదు అని చెప్పడం కరెక్టు కాదని.. రెండు మంచి ఫలితాలే ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండూ కూడా క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువ‌ల్ల రెండింటిలో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవ‌చ్చు. అయితే తొలి డోస్ కోవాగ్జిన్ తీసుకుంటే సెకెండ్ డోస్ కూడా అదే వేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే రెండో డోస్ కచ్చితంగా కోవిషీల్డ్ మాత్రమే వేసుకోవాలి.

Covid Vaccineఎందుకంటే కోవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంపై త‌యారైంది. కోవిషీల్డ్ వైర‌ల్ వెక్ట‌ర్ ప్లాట్‌ఫాంపై ఆధార‌ప‌డి ఉంటుంది. దీంతో రెండు టీకాల‌ను క‌లిపి తీసుకోవ‌డం అస్సలు ఏ మాత్రం మంచిది కాదు. క‌రోనావైర‌స్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ను మాత్ర‌మే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి.. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. త్వరగా కోలుకున్నామళ్లీ రాదనే నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. దీనివ‌ల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అవుతాయి. దీంతో మ‌ళ్లీ వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

Covid Vaccineక‌రోనా నుంచి కోలుకున్న రెండు వారాల‌కు రెండో డోస్ తీసుకోవ‌చ్చు. అదే మొద‌టి డోస్ తీసుకోక‌ముందు క‌రోనా వ‌స్తే.. రిక‌వ‌రీ అయినా 28 రోజుల త‌ర్వాత‌నే వ్యాక్సిన్ వేసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న తరువాత కనీసం 28 రోజుల విరామం అవసరం. ఆ విరామంలో ఎలాంటి ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడూ తీసుకునే ఆహార‌మే తీసుకోవాలి. అయితే ఆల్కాహాల్ కు, చెడు వ్యసనాలకు చాలా దూరంగా ఉండడమే మంచిది అన ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండ‌టం మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR