Agnyathavaasam lo paandavulu maaru veshala gurinchi meeku thelusa?

0
17600

కౌరవుల చేతిలో జూదంలో ఓడిపోయినా పాండవులు వనవాసానికి వెళతారు. అయితే అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండవులు ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కౌరవులకు దొరకకుండా ఒక రాజ్యానికి వెళ్లిన పాండవులు మారు వేషాలు ధరిస్తారు. మరి ఎవరు ఎలాంటి వేషాన్ని ధరించారు? ఆ మారు వేషానికి అర్ధం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. paandavuluధర్మరాజు, అజ్ఞాతవ్రతం చేయటం అంత సులభం కాదు. పైగా మనం ఆరుగురం ఒక చోటనే వుండడం శ్రేయస్కరం అని అంటాడు. అప్పుడు అర్జునుడు మహారాజా, నీ ధర్మనిష్ఠకు మెచ్చి ధర్మదేవత తమకు అనుగ్రహించిన వరం వుంది కదా, మనల్ని ఎవరూ గుర్తించ లేరు. పాంచాల, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, శూరసేన, కళింగ, మగధ దేశాలలో మనం ఎక్కడైనా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయవచ్చు. ఆ దేశ జనపదాలలో మనం యథేచ్ఛగా వుండవచ్చు గదా అని అన్నాడు. ఆ ఆలోచన అందరికి నచ్చడంతో ధర్మరాజు మత్స్యదేశం ఆమోదయోగ్యం అనిపిస్తోంది. ఆ దేశాధిపతి విరాటరాజు అన్ని విధాలా యోగ్యుడని విన్నాను అని అంటాడు. paandavuluఅయితే ధర్మరాజు కంకుభట్టు అనే పేరుతో పుణ్యపురాణ గోష్ఠి జరిపే బాధ్యతను స్వీకరిస్తాను అంటూ సవివరంగా చెప్పాడు. దానికి భీముడు చిరునవ్వుతో సోదరులారా, నేను పాకశాలలో చేరి రాజుగారి జిహ్వను ఆకట్టుకుంటాను. వచ్చే పోయే అతిథులను సైతం రకరకాల వంటకాలతో అలరింపజేస్తాను. ఇకపై నా పేరు వలలుడు అని అంటాడు. పాండవ మధ్యముడు అర్జునుడు తన సంగతి ఇలా వివరిస్తాడు అమరావతికి వెళ్లినపుడు అక్కడ అప్సరస ఊర్వశి నన్ను నపుంసకుడవు కమ్మని శపించింది. కాని ఆ శాప ఫలితాన్ని నా అభీష్టానుసారమే అనుభవించవ చ్చని ఇంద్రుడు నాకు మాట యిచ్చాడు. ఇప్పుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటాను. పేడిరూపుతో, బృహన్నల పేరుతో నాట్యాచార్యునిగా విరటుని కొలువులో చేరతాను. లాస్యచాతురిని ప్రదర్శించి, అంతఃపురంలో తిష్ఠ వేస్తాను అనగా అందరూ ఆ ఆలోచనను మెచ్చుకున్నారు.paandavuluఅశ్వశిక్షకునిగా దామగ్రంథి పేరుతో విరటుని కోటలో స్థానం సంపాదిస్తాను అన్నాడు నకులుడు. తంత్రీపాలుడనే పేరుతో మత్య్సదేశాధీశుని గోశాలలో చేరతానన్నాడు సహదేవుడు. ఇక మిగిలింది ద్రౌపది. పాండవుల ముఖాలు వివర్ణం కావడం గమనించిన ద్రౌపది చిరునవ్వుతో, సైరంధ్రీ వేషధారినై మత్స్యభూపతి పట్టమహిషి వ్యక్తిగత పరిచారికగా సేవలందిస్తాను అన్నది. ధర్మరాజు ద్రౌపదికి, సోదరులకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ వివరించాడు. రాజ దర్పాలను, బలపరాక్రమాలను బహిర్గతం కాకుండా కప్పిపుచ్చండి. మన అజ్ఞాతవాసాన్ని భంగపరచడానికి కౌరవ వర్గం అనుక్షణం ప్రయత్నిస్తూ వుంటుందని నిద్రలో కూడా మరువకండి అని మరొకసారి అందరినీ అప్రమత్తం చేశాడు. ఎవరిదారిన వారు విరాట కొలువుకి బయలుదేరబోతున్న తరుణంలో ధౌమ్యమహర్షి వారికి కొన్ని హితోక్తులు యెరుక పరిచాడు. paandavuluవారు ఆరుగురు విరాటకోటలో అలా చేరడంలో వ్యూహం వుంది. ఎల్లపడూ రాజు సరసన వుండే కంకుభట్టారకునికి లోకవిషయాలు ఎప్పటికపడు తెలుస్తూ వుంటాయి. వృకోదరుని భోజన పరాక్రమం చూస్తే, ఎవరైనా భీమునిగా యిట్టే పసికట్టగలరు. ఇప్పుడువండివార్చేదీ, పాకశాలలో తొలిగా రుచులు చూసేదీ తనే. కనుక సమస్యలేదు. అర్జునుడు అంతఃపురానికి, వుద్యానవనాలకు పరిమితమైనాడు. లోకవ్యవహారాలు మొదట అంతఃపురాలలోనే పొక్కుతాయి. ద్రౌపది పట్టమహిషి సేవలోనే వుంటుంది కాబట్టి ఆమెకు తెలియని విశేషాలు వుండవు. అశ్వశాలకు తెలియకుండా రథం కదలదు. కనుక దేశంలో గాని, సరిహద్దుల్లో గాని ఏమాత్రం అలజడి అయినా మొదట తెలిసేది అశ్వశాలకే! అక్కడ నకులుడు వున్నాడు. paandavuluఈవిధంగా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాండవులు కౌరవులకు దొరకకుండా మారు వేషాలతో మత్స్యదేశం రాజ్యంలోకి వెళతారు.