Home Unknown facts శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి యొక్క కుడిపాద ముద్ర స్వయంభుగా వెలసిన అద్భుత ఆలయం

శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి యొక్క కుడిపాద ముద్ర స్వయంభుగా వెలసిన అద్భుత ఆలయం

0

శ్రీ లక్ష్మినరసింహస్వామి వారు కొలువై ఉన్న ప్రముఖ క్షేత్రాలలో ఈ ఆలయం చాల ప్రాముఖ్యతని సంతరించుకుంది. అయితే స్వామివారు ప్రహ్లదుడిని రక్షించడానికి, హిరణ్యకశిపుని చంపడానికి ఈ రూపాన్ని ధరించాడు. మరి ఇక్కడ ఆ స్వామి ఎలా వెలిసాడు? ఈ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం, బళ్లారి వెళ్లే రోడ్డు మార్గానికి 40 కి.మీ. దూరంలో పెన్నానది తీరమున గుట్ట మీద శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. ఇది స్వయంభువు నరసింహమూర్తి ఆలయమని, నరసింహస్వామి ఇచట గల కొండమీద ఒక పాదమును, కర్నూలు జిల్లాలోని అహోబిలం కొండమీద మరో పాదమును మోపి భక్తులను నిరంతరం కాపాడుచున్నాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

ఈ ఆలయం నందు శ్రీ నరసింహస్వామి వారి యొక్క కుడిపాద ముద్ర ఇచట స్వయంభుగా వెలసినట్లు చెబుతారు. ఆ పాదముద్ర వెనుక భాగమున శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ప్రతిష్టించారు. ఈ స్వామివారి పాదముద్ర వద్ద ఒక బిలం ఉన్నదీ. స్వామివారికి అభిషేకించిన జలం ఈ బిలం గుండా వెళ్లి సుమారు 3 కి.మీ. దూరంలో ఉన్న పెన్నా నది అంతర్వాహినిగా కలుస్తుంది. అందువలన ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలంగా భక్తులు పిలుస్తున్నారు.

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, ఈ ప్రదేశం అంత ఒకప్పుడు అరణ్యంగా ఉండేది, ఇక్కడ ఒకినా గుట్ట మీద చెట్టు క్రింద కూర్చుండి ఉద్దాలక మహర్షి తపం చేస్తుండేవాడు. అతడు ప్రతిరోజు సమీపంలో ఉన్న పెన్నా నదికి వెళ్లి స్నానం చేసి ఆ చెట్టు క్రింద తపస్సు చేసేవాడు. అయితే ఆ అడవిలో ఒక రాక్షసుడు జంతువులను చంపి తిని ఆ కళేబరాలను నదిలో పడేసేవాడు. ఆలా కలుషథం అవుతున్న నీటిలో స్నానం చేయలేని మహర్షి బాధపడి శ్రీ మహావిశుంవుకి ప్రార్ధించాడు. అతని ప్రార్థనలు విన్న విష్ణువు ఆ రాక్షసుణ్ణి సంహరించి మహర్షి బాధలని తొలగించి ఇక్కడ శ్రీ నరసింహ రూపాన వెలసాడని స్థల పురాణం చెబుతుంది.

ఈవిధంగా స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని పెన్నా అహోబిలంగా భక్తులు పిలుచుకుంటున్నారు.

Exit mobile version