దేశంలో ఎన్నో దర్గాలు ఉన్న ఇది మాత్రం కొంచం ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దర్గాలో రొట్టెల పండగ ఎప్పటి నుండో ఆచారంగా ఉంది. ఇంకా ఇలాంటి విశేషాలు ఈ దర్గాలో చాలానే ఉన్నాయి. మరి ఈ దర్గా ఎక్కడ ఉంది? ఇక్కడ ఆ రొట్టెల పండుగ జరుపుకోవడానికి కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో శ్రీ హజ్రత్ బారా షహీద్ దర్గా ఉంది. ఇక భక్తుల రొట్టెలకే సంతసించి వారు కోరిన కోర్కెలు బారాషహీద్ తీరుస్తారని నమ్మకం. విశ్వాసమే ప్రధానంగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దర్గాగా బారాషహీద్ ఖ్యాతి గాంచింది. ఇచ్చి పుచ్చుకోవడంలో మానవత్వం, పరస్పర సహకారం ఉందనే తత్వాన్ని బోధిస్తూ రొట్టెల పండగ చేసుకుంటారు. వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ ఆచారం నేటికీ కొనసాగుతూ లక్షలమంది భక్తులు దర్గాకు చేరుస్తోంది. పవిత్ర యుద్ధంలో అమరులైన బారాషహీద్ పవిత్రమైన స్వర్ణాల చెరువు ప్రాంతంలో సమాధి చెందారు. ఆ సమాధి నేడు బారాషహీద్ దర్గాగా మారి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. అప్పట్లో నెల్లూరు ప్రాంతం తమిళనాడు రాష్ట్రాన్ని పాలించిన ఆర్కాట్ నవాబుల పాలనలో ఉండేది. వందల ఏళ్ల క్రితం నెల్లూరుకు ఎటువంటి రాకపోకలు కూడా లేనివిధంగా పూర్తి అటవీప్రాంతంగా ఉండేది. సహజసిద్ధంగా ఏర్పడిన స్వర్ణాల చెరువు మాత్రమే ఉండేది. ఆర్కాట్ నవాబు సతీమణి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఒకరోజు బారాషహీద్ ఆమెకు కలలో కనిపించి తాను స్వర్ణాల చెరువు వద్ద సమాధి అయ్యానని, తనకు అక్కడ దర్గా నిర్మించమని ఆదేశించారు. తనకొచ్చిన స్వప్నం గురించి ఆమె ఆర్కాట్ నవాబుకు చెప్పగా వెంటనే భారీ సైన్యంతో అటవీప్రాంతంలో ఉన్న స్వర్ణాలచెరువు వద్దకు ఆర్కాట్ నవాబు వచ్చి బారాషహీద్ కోరిన విధంగా సమాధి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అప్పట్లో దూరప్రాంతాలకు వచ్చే క్రమంలో రొట్టెలే ఆహారంగా ఎక్కువ వినియోగంలో ఉండేది. ఈ క్రమంలో నవాబు, అతని సతీమణి రొట్టెలు తిని స్వర్ణాల చెరువులో నిలబడి మిగిలిన రొట్టెలు తమతో వచ్చిన పరివారానికి పంచిపెట్టారు. ఆమె వెంటనే కోలుకోవడంతో షహీద్‌పై భక్తివిశ్వాసాలు పెరిగాయి. ఆ తర్వాత ఆర్కాట్ నవాబు షహీద్‌కు సమాధి నిర్మించి కొంత భూమిని దర్గాకు కేటాయించారు. ఇది సుమారు 266 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. బారాషహీద్ దర్గా నిర్మితమయ్యాక బారాషహీద్ మహిమలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ ఉదయం పూట భక్తులు దర్గాను దర్శించుకొని వెళ్లేవారు. సాయంత్రం పూట దర్గాకు రక్షణగా పులి దర్గాలో సంచరించి రాత్రి అక్కడే నిద్రించి పొద్దునే వెళ్లేముందు దర్గా ప్రాంగణం మొత్తాన్ని తోకతో శుభ్రం చేసేది. దాదాపు 50 ఏళ్ల క్రితం వరకు కూడా ఇది కొనసాగింది. పులికోసం దర్గాలో బోను ఉంది. ఏటా మొహరం కలసి వచ్చేలా బారాషహీద్ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి. దాదాపు 266 ఏళ్ల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. 1751వ సంవత్సరం జూలై 14వ తేది న బారాషహీద్ మహిమ ప్రకటితమైంది. ఇక ఇక్కడికి చుట్టూ పక్కల గ్రామాల నుండే కాకుండా సౌదీ అరేబియా, దుబాయ్ దేశాల్లో సిర్థపడిన ముస్లింలు, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.