Home Health చేపల కన్నా రొయ్యలే మంచివా?

చేపల కన్నా రొయ్యలే మంచివా?

0
సీ ఫుడ్ తినేవారు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపలలో ఎటువంటి పోషకాలు ఉంటాయో వీటిలో అంతకన్నా ఎక్కువగానే ఉంటాయి. చాలామంది చేపలు కన్నా రొయ్యలు తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే చేపలు లాగ వీటికి ముల్లులు ఉండవు, మాంసం మెత్తగా ఉంటుంది. తినడానికి రుచికరంగా ఉంటాయి.
fish
  • మాంసాహారాలన్నింటి తో పోలిస్తే, రొయ్యల్లోనే తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఒక పెద్ద రొయ్యలో రెండు గ్రాముల కొవ్వు , 30 గ్రాముల ప్రోటీను 125 మిల్లీ గ్రాముల ఖనిజాలు లభిస్తాయి. అధిక బరువు సమస్య తోబాధపడేవారు రొయ్యలను తినడం వలన  బరువు అదుపులో ఉంటుంది. అధికబరువుని తగ్గించడంలో రొయ్యలు అంత బాగా పనిచేస్తాయి మరి. రొయ్యల్లో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల అవి గుండె రక్త నాళాల్లో పూడిక రాకుండా చూస్తాయి. ఫలితంగా రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
  • రొయ్యల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పళ్ళు, ఎముకలు దృఢంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. రొయ్యల్లోని ప్రొటీన్స్ కండరాల నిర్మాణానికి, కొత్త కణజాలం ఏర్పడడానికి బాగా  ఉపయోగపడతాయి. హార్మోన్ సమస్య లు ఉన్నవారు.. రొయ్యలు ఆహారం గా తీసుకుంటూ  ఉంటే..  జీవ క్రియలు మెరుగ్గా ఉంటుంది. రక్త హీనత తో బాధ పడేవారికి కూడా  రొయ్య లు అద్భుతమైన ఔషధం గా  పని చేస్తాయి.
  • చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ, విటమిన్‌ బి 12  రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. వీటితో పాటు గుండె జబ్బులను కూడా  రొయ్యలు దూరం చేస్తాయని  వైద్యులు తెలియచేస్తున్నారు. రొయ్య ల్లో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ఉండడం వలన ఇవి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అని వారు  చెప్తున్నారు.
  • పిల్లల ఆరోగ్యానికి సరిపడా  ప్రోటీన్లు  రొయ్యలల్లో అందుతాయి. అందుచేత వారంలో ఒక్కసారి అయినా రొయ్యల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. తరచూ ఆహారంలో రొయ్యలను తీసుకుంటే కావాల్సినంత  బలంతో పాటు మెదడు, నరాల సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. చాలా మంది మతి మరుపుసమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు రొయ్యలు తినడం వలన మతి మరుపు తగ్గుతుంది.
  • రొయ్యల్లో సెలీనియం బాగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇక రొయ్యల్లో ఉండే జింక్, సెలీనియం మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్యం కూడా బాగా పెరుగుతుంది. వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి. తరుచూ శృంగారంలో పాల్గొనాలనుకునేవారు కచ్చితంగా రొయ్యల్ని పచ్చిగానే తింటూ ఉండాలి.
  • గర్భధారణ సమయంలో సీఫుడ్ తినడం వల్ల మీ శరీరానికి ప్రోటీన్, విటమిన్ బి -2, విటమిన్ డి ప్లస్ లభిస్తుంది. సీ ఫుడ్ లో ముఖ్యంగా రొయ్యలు ఇనుము, మెగ్నీషియం, పొటాషియం యొక్క మూలం. గర్భధారణ సమయంలో ఇనుము అధికంగా ఉండే రొయ్యలు తినడం వల్ల శరీరం తల్లికి, బిడ్డకు అదనపు రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇనుము లోపం రక్తహీనతతో పోరాడి గర్భధారణ సమయంలో ఎక్కువ శక్తిని ఇస్తుంది.
  • అయితే రొయ్యలు రుచికరంగా ఉంటాయి కదాని ఎక్కువ నూనెతో వేపుడు చేసుకుని తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ నూనెతో చేసిన కూరలు, వేపుడు తినొచ్చు. ఏమైనా మోతాదుకు మించి మాత్రం తినొద్దనేది ఆరోగ్యం నిపుణులు చెప్పే సలహా.

Exit mobile version