Home Health ఈ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన మెమరీ పవర్ మీ సొంతం

ఈ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన మెమరీ పవర్ మీ సొంతం

0

మనిషి జీవితంలో ఏది సాధించాలన్నా అందులో జ్ఞాపకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి అంటే ప్రతి విషయం గుర్తుండాలనే అపోహ చాలామందిలో వుంది కాని అది తప్పు. ఎంత పెద్ద మేధావికి అయినా అన్ని విషయాలు గుర్తు పెట్టుకోలేరు. నిజానికి జ్ఞాపకశక్తి అంటే గుర్తుకి తెచ్చుకోవడం. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుంది. మెదడులో అలాంటి ఒక మార్పుకు కారణం సెరిబ్రల్ కార్టెక్స్ బలహీన పడటమే కారణమని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. దీని వల్ల జ్ఞాపక శక్తి సంభందిత సమస్యలు వస్తాయని తెలిపారు.

Foods that boost memoryసరిగా నిద్ర లేకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్,స్వీట్స్ ఇవి అన్ని బ్రెయిన్ పవర్ కు విలన్లు. కాబట్టి ప్రతిరోజు నిద్రపోవడం, తినడం, చేసుకోవడం ఇలా ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. అలాగే మనం తినే కొన్ని ఆహారాలు, అలవాట్లు మెమరీ పవర్ ను పెంచడమే కాకుండా అప్రమత్తంగా కూడా ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మతిమరుపుతో ఇబ్బంది పడేవారు సిట్రస్‌ జాతి పండ్లు తింటే మంచిది. మెదడు శక్తిని పెంచడానికి బ్లాక్‌ క్రాంట్లు, చేపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, వేరుశనగ, నువ్వులు, గుడ్లు తరచూ ఆహారంలో ఉండేలా చేసుకోవాలి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెదడును చురుగ్గా ఉంచడంలో సాయపడుతాయి. వీటిని రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ ఇ యొక్క మంచి వనరులు. వేరుశెనగలో కూడా విటమిన్ ఇ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ నిండి ఉంటుంది. బాదం మరియు హాజెల్ నట్స్ కూడా జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి.

ఆకు పచ్చ కూరగాయాల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. శరీరం మొత్తం మరియు మెదడుకు విస్తరించిన రక్తనాళాలకు అవసరం అయ్యే మెగ్నీషియం ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బెయిన్ పవర్ కు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా అవసరం. బ్రోకలీ, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్, బచ్చలికూర అన్ని ఆకుపచ్చ కూరగాయలలో ఇనుము, విటమిన్ ఇ, కె మరియు బి9, విటమిన్ సి వంటి ఫైటోన్యూట్రియెంట్స్ మెదడు కణాల అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి బ్రోకలీ, కాలే, కొల్లార్డ్‌ గ్రీన్స్‌, బచ్చలి కూడా వంటివి రోజూ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

గుమ్మడికాయ గింజల్లో జింక్‌ ఉంటుంది. వీటిని తినడం ద్వారా మెదడు చురుగ్గా తయారవుతుంది. వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ మరియు బ్రెయిన్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది . ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల, మీరు 19 శాతం మెమరీని పవర్ ను మెరుగుపరచుకొనే అవకాశం ఉంది.

బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ బ్లూబెర్రీస్‌ తినడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉంటుంది. స్ట్రాబెర్రీలు కూడా, క్రమం తప్పకుండా తినడం వల్ల వయస్సు పెరుగుతునప్పుడు, సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణించడంలో సహాయపడుతుంది.

తృణధాన్యాల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. తరచూ తృణ ధాన్యాల్ని ఆహారంగా తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుంది.

టమోటోలో మెదడు కణాలను డ్యామేజ్ చేసి ఫ్రీరాడికల్స్ నుండి రక్షించడానికి, లైకోపిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల టమోటోలను రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం చాలా మంచిది.

ఆయుర్వేద ఔషధం జ్ఞాపకశక్తిని ప్రోత్సహించడానికి ప్రసిద్ది చెందింది. ఎందుకంటే ఇది నరాల కణాల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అశ్వగంధను పొడి లేదా టాబ్లెట్ రూపంలో తీసుకోవడం వలన మెదడు యొక్క జ్ఞాపకశక్తి, శ్రద్ధ మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

అలాగే కేకులు, చాక్లెట్లు తీపి పదార్థాలు మీకు వెంటనే శక్తిని ఇవ్వచ్చు. అయితే, కొద్ది సేపటి తర్వాత మీ శక్తిని ఒక్కసారే పడిపోయేలా చేస్తాయి. దీనివల్ల అలసట, మతిమరుపు ఏర్పడుతుంది. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.

వీటితో పాటు తరుచూ యోగా చేయడం కూడా మెదడును మెరుగుపరిచేందుకు సహాయపడతుంది. యోగా వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని కాపాడుతుందని యోగా అభ్యాసకులు చెప్పారు. యోగ చేస్తే వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, బాగా ఆలోచించడానికి, జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండడానికి యోగ ఎంతో బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

Exit mobile version