Home Unknown facts Amrutham, visham tho patuga kshira sagara madhanamlo inka em uthbavinchayo telusa?

Amrutham, visham tho patuga kshira sagara madhanamlo inka em uthbavinchayo telusa?

0

మనం పురాణాలూ చూసుకుంటే దేవతలకి, రాక్షసులకు మధ్య చాల యుద్ధాలే జరిగాయి. ఒక్కో యుద్ధం వెనుక ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలంటి యుద్ధాలలో ముక్యంగా చెప్పుకుంటే క్షీర‌సాగ‌ర మ‌థ‌నం ఉంటుంది. అయితే ఆ సంగ్రామంలో అమృతం, విషం ఏ కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేకమైనవి కూడా ఉధ్భవించాయని చెపుతున్నారు. మరి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. amruthamపురాణాల ప్ర‌కారం ఒక‌ప్పుడు దేవ‌త‌లు అమృతం కోసం శ్రీ‌మ‌హావిష్ణువు విశ్రాంతి తీసుకునే క్షీర‌సాగ‌రాన్ని మథించాల‌ని అనుకున్నారు. అయితే అందుకు వారి బ‌లం స‌రిపోలేదు. దీంతో వారు రాక్ష‌సుల స‌హాయం కూడా తీసుకోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో దేవ‌త‌లు, రాక్ష‌సులు అంద‌రూ క‌లిసి ఆదిశేషువును తాడుగా, మంద‌రగిరి ప‌ర్వ‌తాన్ని క‌వ్వంలా చేసుకుని క్షీర‌సాగ‌రాన్ని మ‌థించ‌డం మొద‌లు పెడ‌తారు. ఆ క్రమంలో మంద‌ర‌గిరి ప‌ర్వ‌తం నేల‌కు కుంగిపోతూ ఉంటుంది. అప్పుడే విష్ణువు కూర్మావ‌తారం (తాబేలు) ఎత్తి త‌న చిప్ప‌ను ఆ ప‌ర్వ‌తం కింద పెడ‌తాడు. దీంతో మ‌ళ్లీ సాగ‌ర మ‌థ‌నం మొద‌లవుతుంది.
ఇంకా విష్ణుమూర్తి కుర్మావతార రూపములో మందరపర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నోరకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువలమాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి, ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది.క్షీర సాగ‌ర మ‌థ‌నం జ‌రిపిన‌ప్పుడు చంద్రుడు బ‌య‌టికి వ‌స్తాడు. అప్పుడు దాన్నిశివుడు త‌న త‌ల‌పై ధ‌రించాడు. ఇంకా పాలసముద్రాన్ని చిలికినప్పుడు విషం దావాన‌లంలా ఉద్భ‌విస్తుంది. దాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకున్నాడు.వీటితోపాటు 4 దంతాలు ఉన్న ఐరావ‌త‌మనే పెద్ద ఏనుగుతోపాటు మరో 64 ఇత‌ర తెల్ల ఏనుగులు బ‌య‌టికి వ‌చ్చాయి. వాటిని ఇంద్రుడు స్వీక‌రించాడు.ఇంకా ఉచ్ఛైశ్ర‌వ‌మ‌నే తెల్ల‌ని గుర్రం ఉద్భ‌వించింది. దాన్ని రాక్ష‌సుల రాజు బ‌లి స్వీక‌రించాడు.ఈ సమయంలోనే రంభ‌, ఊర్వ‌శి, మేన‌క‌, తిలోత్త‌మ వంటి అప్స‌ర‌స‌లు మ‌థ‌నం నుంచి ఉద్భ‌వించారు. వారిని స్వ‌ర్గానికి పంపారు. ఇంకా కోరిన కోర్కెలు తీర్చే ఆవు కామ‌ధేనువు జ‌న్మిస్తుంది. దాన్నుంచి వ‌చ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని య‌జ్ఞ యాగాదుల కోసం ఉప‌యోగించ‌డం మొద‌లు పెట్టారు.
ఇందులో ఇంకా అడిగిన‌వ‌న్నీ ఇచ్చే క‌ల్ప‌వృక్షం పుట్టుకొస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచారు.సురాపానానికి (మ‌ద్యం) అధిప‌తి అయిన వారుణీ దేవి పుట్టుకొస్తుంది. ఆమెను రాక్ష‌సులు స్వీక‌రిస్తారు.అంతేకాకుండా ముట్టుకోగానే ఎంత‌టి అల‌స‌ట‌నైనా దూరం చేసే పారిజాత వృక్షం కూడా ఇందులోనే ఉద్భ‌విస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచుతారు.

ఇంకా మ‌ణుల్లోకెల్లా అత్యంత గొప్ప‌దైన కౌస్తుభ‌మ‌ణి పుట్టుకొస్తుంది. దాన్ని విష్ణువు త‌న వ‌క్ష‌స్థ‌లంపై అలంక‌రించుకున్నాడు. శంఖు చ‌క్రాలు పుట్టుకొస్తాయి. వాటిని కూడా విష్ణువే స్వీక‌రిస్తాడు.చివ‌రిగా ధ‌న్వంత‌రి అమృత భాండంతో క్షీర సాగ‌రం నుంచి బ‌య‌టికి వ‌స్తాడు. అందులో ఉన్న అమృతాన్ని తాగి దేవ‌తలు మృత్యుంజ‌యులుగా మారారు.

Exit mobile version