శివుడి కన్నీటి చుక్క పడిన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది?

0
1613

త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. పురాణం ప్రకారం శివుడి కన్నీటి చుక్క ఈ ప్రదేశంలో పడిందట. మరి శివుడి కన్నీటి చుక్క పడిన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hindu Temple Katas Raj

పాకిస్థాన్ లోని కటాస్ అనే గ్రామంలో కటాసరాజ మందిరం ఉంది. ఇది ఒక శివాలయం. ఇక్కడ మొత్తం 7 ఆలయాలు ఉండగా అందులో ఈ శివాలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉన్నదని చెబుతారు. మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని రోజులు గడిపారని స్థల పురాణం చెబుతుంది.

Hindu Temple Katas Raj

ఇక పురాణానికి వస్తే, దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగానికి శివపార్వతులని ఆహ్వానం రానప్పటికీ సతీదేవి ఆ యాగానికి వెళ్లగా దక్షప్రజాపతి శివుడిని అవమానించడంతో ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు ఆగ్రహించి ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయ తాండవం చేస్తుంటే శ్రీమహావిష్ణువు తన చక్రాయుధంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసి శివుడిని శాంతిపచేస్తాడు. ఆలా సతీదేవి శరీర భాగాలూ పడిన ప్రాంతాలన్నీ కూడా శక్తి పీఠాలుగా వెలిశాయని పురాణం. అయితే సతీదేవి ఆత్మహుతి చేసుకున్న విషయం తెలియడంతో శివుడి కన్నీటి నుండి రెండు కన్నీటి చుక్కలు భూమిపైనా పడ్డాయని పురాణం.

Hindu Temple Katas Raj

సతీదేవి అగ్నికి అహుతైందని శివుడికి తెలిసిన వెంటనే శివుడి కంటి నుండి రెండు కన్నీటి చుక్కలు భూమిమీద పడగ ఒకటి ఈ ప్రాంతంలో పడగ, రెండవది రాజస్థాన్ లోని అజ్మీర్ లో పడి పుష్కర్ రాజ్ గా వెలిసిందని పురాణం. ఇంతటి విశేషం ఉన్న ఈ ఆలయాన్ని 2005 లో భారత మాజీ ఉపప్రధాని లాల్ క్రిష్ణ అద్వానీ గారు సందర్శించారు.

Hindu Temple Katas Raj

ఇక ఈ ఆలయంలో రామమందిరం, హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ఇవి 6 శతాబ్దానికి చెందినవిగా చెబుతారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.

SHARE