Home Unknown facts భారత్ లోనే కాదు…పాకిస్తాన్ లో కూడా పూజలందుకుంటున్న ఆంజనేయస్వామి!!!

భారత్ లోనే కాదు…పాకిస్తాన్ లో కూడా పూజలందుకుంటున్న ఆంజనేయస్వామి!!!

0

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది. శ్రీ హనుమాన్‌ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది.

anjaneya swami temple in pakistanఅంతటి విశిష్టత ఉంది కాబట్టే మన దేశంలో హనుమాన్ ఆలయాలు ఊరూరా ఉంటాయి. అదేవిధంగా మన దేశం నుండి విభజన జరిగిన పాకిస్తాన్ లో అనేక హిందూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కరాచిలోని పంచముఖి ఆలయం. పాక్ హిందూ సంఘం పాకిస్తాన్ లో అనేక హిందూ దేవాలయాలను పరిరక్షిస్తుంది..వాటిని నిర్వహించి భారతీయ సంస్కృతిని పోషిస్తోంది…

ఒప్పుడు మన దేశం.. అఖండ భారత దేశంగా ఉండేది.. ఈ అఖండ భారతావని ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి నిదర్శనంగా నిలిచింది. కాలక్రమంలో అఖండ భారతం అనేక ముక్కలయింది. ఇక బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత దేశం .. పాకిస్తాన్ .. భారత్ రెండుగా విభజించబడ్డాయి. అయితే విభజన పాకిస్తాన్ లో అనేక హిందూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

పాకిస్థాన్‌లోని కరాచీలో సోల్జర్ బజార్ వద్ద శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖమైన క్షేత్రం ఉంది. ఇక్కడి శ్రీ పంచముఖి హనుమాన్‌ మందిరం యుగయుగాల నుంచి పూజలందుకుంటోంది. మహానట బలదేవ్ దాస్ గడీ నశీన్ ఆధ్వర్యం లో ఈ దేవాలయం 1927 లో నిర్మించబడింది. ఇందులోని స్వామి వారి విగ్రహం సహజ సిద్ధంగా ఏర్పడినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. నీలం, తెలుపు రంగములో 8 అడుగుల ఆంజనేయ విగ్రహం శతాబ్దాల క్రితం నుంచి పూజలందుకోంటోంది.

వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. పాక్‌లోని హిందువులు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. పురావస్తుశాఖ అధ్యయనంలో ఈ ఆలయం 1500ఏళ్ల క్రితం నిర్మించినట్టు వెల్లడయింది. ఇక్కడ శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం హనుమ, నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలతో దర్శనమిస్తుంది. ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం భక్తులకు అభయమిస్తుంది. ఈ ఆలయంలో మూలవిరాట్‌ ఉన్న ప్రాంగణంలో 21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరువెరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

కొన్ని ఏళ్ల క్రితమే ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారు. నలుపు, తెలుపు పాలరాయితో నిర్మితమైన ఈ ఆలయం ఆలయం ముందు వాకిలిలో ఇరువైపులా పసుపు రాయి స్తంభాలతో చూపరులను ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణ తవ్వకాల్లో పురాతనమైన వానర మూకల విగ్రహాలతోపాటు కృష్ణుడు, వినాయకుడు వంటి అనేక విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని ఆలయప్రాంగణంలో ప్రతిష్టించారు. పాక్‌లోని కరాచీలో హిందువులకు శ్రీ పంచముఖి హనుమాన్‌ ఆలయం పవిత్రమైన ప్రదేశం.

భారతదేశంలో బాబ్రీ కట్టడం కూల్చివేత తరువాత ఈ ప్రాంతంలోని దేవాలయాల మీద దాడి నుండి బయటపడిన పాకిస్తాన్లోని కొన్ని హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. బాబ్రీ మసీదు అల్లర్లలో ఈ ఆలయాన్ని అక్కడి హిందువు, సింధియా లు పరిరక్షించారు. తర్వాత ఈ మందిరాన్ని అక్కడ హిందూ సమితి పునర్నిర్మించారు. ప్రస్తుతం ఆ ఆలయంలో పంచముఖి హనుమాన్ విగ్రహంతో పాటు శ్రీరాముడు, సీతాదేవి, పంచముఖి వినాయకుడు, కృష్ణుడు, శివుడు, వంటి అనేక విగ్రహాలను ప్రతిష్టించారు.

ఈ ఆలయంలో శ్రీరామనవమి కృష్ణాష్టమి హనుమజ్జయంతి ,దసరా ఉత్సవాలను వైభవం గా నిర్వహిస్తారు. మంగళ ,శనివారాలలో స్వామికి సిందూరం తోనూ నువ్వుల నూనె తోనూ పూజ చేస్తారు. దీని వల్ల శని నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ భారతదేశం నుండి మహారాష్ట్రులు, అలాగే సింధీలు అలాగే బలూచిలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. స్థానిక ముస్లింలు కూడా హనుమంతుని దర్శించుకుంటారు.

Exit mobile version