పాముకాటుకి తెల్ల ఈశ్వరి మొక్కతో విరుగుడు!

వర్షాకాలం వచ్చిందంటే పాము కాటుతో చనిపోయే సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా పల్లెల్లో పొలం పనులు చేసుకునే వ్యక్తులు పాము కాటుకు గురవడం చూస్తుంటాం. మారుమూల గ్రామాల్లో ఉండే వారు పాముకాటుకు గురైతే ఎక్కువగా వైద్యం ఆలస్యం అవడం వలనే ప్రాణాలు కోల్పోతున్నారు. పాము మనకు శత్రువు కాదు. తన ఆత్మ రక్షణ కోసం, విధి లేని పరిస్ధితుల్లో మాత్రమే కాటు వేస్తుంది. పాము బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వేళ పాము కరిస్తే అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం మంచిది.

snake biteఅయితే వీటికి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే లోపు కొన్ని సార్లు ప్రమాద తీవ్రత పెరిగిపోతుంది. కానీ మనకి అందుబాటులో ఉండే ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధ మొక్కలు వాటి పాము కాటు విషం నుండి బయటపడడంలో సహాయపడవచ్చు. అయితే పాము కరిచినప్పుడు ఆందోళన చెందకుండా వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. విష సర్పం కరిచినా రకరకాల కారణాలతో ఆలస్యం చేసి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే- విషం లేని పాము కరిచినా కంగారుతో, భయంతో మరికొందరు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు.

swellingకాబట్టి పాము కరిచినప్పుడు భయాందోళనలకు గురికావద్దు. దాని వల్ల రక్త ప్రసరణ పెరిగి విషం త్వరగా వ్యాపించే ప్రమాదముంది. బంధు మిత్రులు రోగికి ధైర్యం చెప్పాలి. ప్రక్కనున్నవారు ఆ పాము విషసర్పమా కాదో గుర్తించే ప్రయత్నం చేయండి. దానివల్ల చికిత్స మరింత ఖచ్చితంగా అందచేయవచ్చు. ఆసుపత్రికి వెళ్ళేలోపు ప్రమాద తీవ్రత పెరగకుండా కొన్ని ఆయుర్వేద మూలికలతో ఉపశమనం కల్పించవచ్చు. పంట పొలాల్లో ఎక్కువగా కనిపించే తెల్ల ఈశ్వరి మొక్కను పాము కాటు విషానికి విరుగుడుగా వాడవచ్చు. ఈ మొక్క యొక్క కాయలు విత్తనాలు సేకరించి పొలం గట్లపై వేయడం వలన ఆపద సమయాల్లో ఉపయోగపడుతుంది.

eeshwari plantతెల్ల ఈశ్వరి (తేల్లేసరు )పాదు అని అంటారు. దీనినే నకులి, అహిగంధ, అర్కముల, గరుడ, ఈశ్వర, ఈశ్వరి, నకులేష్ఠ, నకులి, సునంద, రుద్రజాత, ఈశ్వరి, నాకులి, అర్క్ములా, గాంధనాకులి, నాగదమణి అనే పేర్లతో పిలుస్తారు. జ్వరం, అజీర్ణం మరియు జీర్ణ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఈశ్వరీ మొక్క యొక్క వేరుని ఉపయోగిస్తారు. ఈ మొక్క వేరుని పొడి చేసి ఒక చిటికెడు పొడిని వెచ్చని నీటితో తీసుకుంటే జీర్ణసమస్యలు తగ్గుతాయి. అలాగే మొక్క ఆకులతో చేసిన పేస్ట్ కీళ్ల నొప్పి, వాపులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తాజా ఆకు యొక్క పేస్ట్ తలనొప్పిని తగ్గించడానికి పసుపు పొడితో నుదిటిపై పూస్తారు.

joint painఈశ్వరి విత్తనం యొక్క పొడిని గోరువెచ్చని నీటితో కలుపుతారు. చర్మ వ్యాధులు, గాయాలు మరియు ఆకుల పేస్ట్ వాపు ప్రభావిత ప్రాంతాలపై పూయబడుతుంది. దగ్గుతో బాధపడుతున్న రోగులలో ఆకు యొక్క రసం 5-6 మి.లీ మోతాదులో ఇస్తే అధిక కఫం తొలగించడానికి ఉపయోగపడుతుంది.

ఈ మొక్క యొక్క వేరుని తీసుకొని మెత్తగా నీటితో లేదా ఆవు మూత్రంతో నూరి పాము కరిచిన చోట ఆ మిశ్రమాన్ని పూయాలి లేదా ఆ వేరుని బాగా నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల విషం శరీరమంతా వ్యాపించకుండా, విషం పనిచేయకుండా ఔషధం ఆపుతుంది. ఇది పాము కాటుకే కాకుండా తేలు కాటు, జెర్రి కరిచిన చోట కూడా ఔషధంగా ఉపయోగించవచ్చు. అలాగే పొలాల్లో దొరికే నాటు ఎర్రగడ్డను కోసి దానిని అరగదీసి పాము కరిచిన చోట పూయడం వల్ల కూడా విష ప్రభావాన్ని తగ్గించవచ్చు.

snake biteఈశ్వరి యొక్క వేరుని, ఆకును ఎక్కువగా ఉపయోగించడం వల్ల వికారం, వాంతులు మరియు ఉదర తిమ్మిరి ఏర్పడతాయి. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా పరిమిత మోతాదులో మాత్రమే వాడాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR