Home Health యాపిల్ ను ఇలా తినడం వలన ఎంత ప్రమాదమో

యాపిల్ ను ఇలా తినడం వలన ఎంత ప్రమాదమో

0

యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతారు. ఇయ్యూనిటీ పవర్ పెరుగుతుందని అంటారు. అందుకే రోజుకో యాపిల్ తింటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతారు. ఇప్పుడు ఉన్న ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.

Are Apple Seeds Poisonousఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు డైటరీ ఫైబర్‌తో సహా ఆరోగ్యకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి.

దీంతో పాటు యాపిల్స్‌ని కొని, తినేటప్పుడు వాటిని శుభ్రంగా కడిగి తినాలి.. తీసుకునే ప్రతి ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ కచ్చితమైన అవగాహనతో ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిట్లుతుంది. ఆపిల్స్ మంచివే. కానీ వీటిని తినే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకపోతే, మన ప్రాణాలను మనమే డేంజర్‌లో పెట్టుకున్నట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

యాపిల్స్‌ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. ఒక వేళ పెట్టినా బయటకు తీసిన 5 నిమిషాల్లోనే తినాలి. లేదంటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. వీటితో పాటు ఆపిల్స్ గింజలు కూడా తినకూడదని చెబుతారు. ఇవి విషంతో సమానమని చెబుతారు. యాపిల్ కోసుకొని తిన్నప్పుడు దాంట్లో ఉండే గింజలను తీసి పారేస్తూ ఉంటారు. తెలియకపోయినా చాలామంది ఆ గింజల్ని తినడానికి ఇష్టపడరు.

అయితే యాపిల్ గింజ ల్లో అమాక్డాలిన్ అనే పదార్థం ఉంటుంది. గింజలను నమిలినప్పుడు ఆ పదార్థం హైడ్రోజన్ సైనైడ్ గా మారుతుంది. 60 కిలోల బరువు ఉన్న 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 15 నుంచి 175 విత్తనాలు తినడం వల్ల చనిపోతారట. అదే పదేళ్లలోపు చిన్నారులు 50 తిన్నా చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని తినే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఆపిల్ పండ్ల‌లో ఉండే విత్త‌నాలు విష‌పూరిత‌మైన‌వే. కానీ అవి మరీ ప్రాణాంత‌కం కాదు అని కొంతమంది చెబుతున్నారు. వాటిని తిన‌డం వ‌ల్ల వికారం, న‌పుంస‌క‌త్వం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కానీ అవి మ‌నుషుల‌ను చంప‌వు.

కాక‌పోతే వాటిని పెద్ద ఎత్తున తీసుకుంటే మాత్రం ప్రాణాంత‌క‌మేన‌ని వైద్యులు చెబుతున్నారు. వీటిని తినే విషయంలో ఏ మత్రం అజాగ్రత్తగా ఉన్న భవిష్యత్‌లో ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకానీ.. ఒక‌టి, రెండు విత్త‌నాల‌ను పొర‌పాటుగా తింటే ఏమీకాద‌ని వారంటున్నారు.

 

Exit mobile version