లిప్‌స్టిక్ వాడుతున్నారా అయితే ఇవి తప్పక పాటించండి ?

ఎంత మేకప్ వేసుకున్నా చివరికి లిప్‌స్టిక్ వేసుకోకపోతే మేకప్ పూర్తవదు. లిప్‌స్టిక్ పెదవుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. అంతేకాదు మీరు ధరించిన దుస్తులు, ముఖాకృతి, శరీర రంగు, సందర్భం తదితర అంశాలను బట్టి లిప్‌స్టిక్ వాడితే అతివల అందం మరింత ఇనుమడిస్తుంది. అయితే మహిళలు లిప్ స్టిక్ ను వాడే ముందు కొన్ని జాగ్రత్తలు, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అందం మరింత పెరుగుతుంది. మరి ఇప్పుడు లిప్‌స్టిక్‌ వేసుకొనే ముందు ఎం చేయాలో తెలుసుకుందాం.

లిప్‌స్టిక్లిప్‌స్టిక్‌ రాసుకునే ముందు పాలలో ముంచిన దూదితో పెదాలను శుభ్రం చేయాలి. లేకపోతే లిప్‌స్టిక్‌ పేలవంగా కనిపిస్తుంది. లిప్‌స్టిక్ వేసుకునే ముందు వేజలైన్ రాసి, దానిమీద లిప్‌స్టిక్ వేసుకుంటే పెదవులు పగలకుండా వుంటాయి. లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత లిప్‌లైనర్ వాడండి. దీనివల్ల లిప్‌స్టిక్ అటూ, ఇటూ మూతి చుట్టూ పరచుకోకుండా ఉంటుంది.

లిప్‌స్టిక్లిప్‌స్టిక్‌ వేసే ముందు పెదవులకు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయాలి. పెదవుల మీద చర్మం మరీ సున్నితంగా ఉంటుంది. మిగతా శరీరంతో పోలిస్తే పెదవుల మీద సూర్యకిరణాల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రపు రక్షణ తప్పనిసరి.పెదవులు మెరవాలంటే లిప్‌స్టిక్‌ వేసిన తర్వాత లిప్‌గ్లాస్‌ వేయాలి. పెదవులు సహజంగా ఉన్న రంగులోనే మెరుస్తూ కనిపించాలంటే లిప్‌గ్లాస్‌ మాత్రమే వాడాలి.

లిప్‌స్టిక్చలికాలంలో పెదవులు త్వరగా పొడిబారతాయి గనుక ముందుగా పెదవులకు కొబ్బరినూనె రాసి 10 నిమిషాలు ఆగి వెచ్చని నీటిలో ముంచిన దూదితో తుడిచి లిప్‌స్టిక్ వేసుకుంటే పెదవులకు తగిన తేమ చేకూరి లిప్‌స్టిక్‌ ఎక్కువ సమయం సహజంగా కనిపిస్తుంది. ఎక్కువ సేపు లిప్‌స్టిక్ నిలిచి ఉండాలంటే… రెండు సార్లు లిప్‌స్టిక్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వేసుకున్నాక టిష్యూపేపర్తో మృదువుగా అద్దిన తరువాత మరోసారి వేసుకోవాలి.

లిప్‌స్టిక్పెదాలను శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా ఫౌండేషన్‌ క్రీము రాసుకుని 3 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత లిప్ స్టిక్ వేయడం మొదలుపెట్టాలి. పగటి పూట లిప్‌స్టిక్‌ వేసుకుంటే కాస్త తక్కువగా, సాయంత్రం వేళ కాస్త ఎక్కువగా వేసుకోవాలి. లిప్‌స్టిక్‌ వేయటం పూర్తయ్యాక చివరగా కాంతినిచ్చే షైనీ ఫినిష్‌తో టచప్ చేయాలి. లేకుంటే పెదవులు జీవం కోల్పోయినట్లు కనిపిస్తాయి.

లిప్‌స్టిక్బాగా పగిలిన పెదవులకు నేరుగా లిప్‌స్టిక్ వేస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది గనుక ముందుగా మెత్తటి కుంచెలున్న బ్రష్‌తో రుద్ది నీటితో కడిగి, లిప్‌బామ్ రాయాలి. నిద్రపోయే ముందు లిప్‌స్టిక్‌ తొలగించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయరాదు. రాత్రంతా లిప్‌స్టిక్‌ ఉన్నట్లయితే పెదవులు నల్లబడడమే కాక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR