మెరిసే చర్మం కోసం ఈ చిట్కాలు తప్పనిసరి ?

ఆరోగ్యమైన, అందమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ర‌క ర‌కాల క్రీములు రాస్తూ, ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటూ మెరుపులు అద్దుతుంటారు. అలా కాకుండా ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. చ‌ర్మంపై ఏర్పడే మచ్చలు మొటిమలు పోయి ఆరోగ్యంగా కనిపించాలంటే ఏం తినాలంటే.

దానిమ్మ:

tips for glowing skinచర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన ఆహారం దానిమ్మ. దానిమ్మ గింజలను పేస్ట్ చేసి ముఖానికి రాయడం వల్ల ఇందులోని యాంటిఆక్సిడెంట్ చర్మ పగుళ్ళ నుండి కాపాడి, చర్మాన్ని ఎల్ల వేళలా తేమగా ఉంచుతుంది

అవొకాడో:

tips for glowing skinఅవొకాడో పండు తినడానికి మాత్రమే కాదు. అవొకాడోలో బయోటిన్ పుష్కలంగా ఉన్నందు వల్ల, దీని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని, చిట్లిన కురులను, చిట్లిన గోళ్ళ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడైతే ముఖానికి అప్లై చేస్తామో అప్పటి నుండి చర్మం తేమగా మారి కాంతి వంతంగా మారుతుంది. అందుకు అవొకాడో పండును తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ముఖంమీద అలాగే అప్లై చేయడం వల్ల ముఖంలోని మచ్చలను, ముడుతలను తొలగిస్తుంది.

గ్రీన్ టీ:

tips for glowing skinగ్రీన్ టీతో బరువు తగ్గడమే కాదు.. చర్మ కాంతిని కూడా పెంచుకోవచ్చు. గ్రీన్ టీలో చర్మ సంరక్షణకు కావలసినన్ని ఫోలిఫినోల్స్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఫ్రెష్ గా, తేమగా ఉండేలా కాపాడుతుంది. కాబట్టి రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీ తాగండి.

టమోటో:

tips for glowing skinటమోటో గుజ్జులో లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల సన్ బర్న్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి టమోటో గుజ్జును ఆలివ్ ఆయిల్ తో చేర్చి ముఖానికి పది వారాల పాటు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. టమోటోల్లోని యాంటిఆక్సిడెంట్స్, లైకోపిన్, హైకెరోటినాయిడ్స్ వంటివి ఫ్రీరాడికల్స్ నుండి కాపాడుతుంది.

సాల్మన్:

tips for glowing skinసాల్మన్ ఫిష్ ను వారానికి ఒక సారి తినడం వల్ల వయస్సు పైబడనియ్యకుండా కాపాడుతుంది. సాల్మన్ ఫిష్ లోని కెరోటినాయిడ్స్ స్కిన్ ఎలాసిటీన్ వృద్దిచేస్తుంది.

గుడ్డు:

tips for glowing skinఫ్రీరాడికల్స్ డామేజ్ వల్ల చర్మ సమస్యలను కాపాడటానికి గుడ్డులోని ప్రోటీన్స్ బాగా పనిచేస్తాయి. గుడ్డులో అధిక శాతంలో ప్రోటీలు కలిగి ఉంటాయి. ఇంకా చర్మ ఆరోగ్యానికి కావల్సిన బయోటిన్, ఎసెన్సియల్స్ విటమిన్స్ కలిగి ఉండి వయస్సు పైబడనియ్యకుండా.. చర్మం పొడిబారినియ్యకుండా కాపాడుతుంది.

వాల్ నట్స్:

tips for glowing skinఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక్క ఫిష్ లో మాత్రమే కాదు వాల్ నట్స్ లో కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో వాల్ నట్స్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల చర్మం నునుపుగా మారడమే కాకుండా కురులకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. దాంతో యంగ్ గా కనబడేలా చేస్తుంది.

బీన్స్:

tips for glowing skinమరో ప్రోటీన్ ఆహారం బీన్స్ . చీక్కుళ్ళలో ఫ్రీరాడికల్ నుండి పాడైన చర్మ కణాలను తిరిగీ ఆరోగ్యంగా మారడానికి సహాయపడుతుంది. అమినో యాసిడ్స్ పాడైన చర్మ కణాలను పునరుత్పత్తిని వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR