మంగళ సూత్రానికి దేవుడి ప్రతిమలను జోడిస్తున్నారా???

హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహంలో ముఖ్యమైన తంతు మాంగళ్య ధారణ… మంగళ సూత్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. భారతదేశంలో ముఖ్యంగా పెళ్లైన ఆడవారు మంగళసూత్రాన్ని ధరించడం ఆనవాయితీ. ఈ మంగళసూత్రాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక విధంగా పిలుస్తారు.

gold mangalsutraఅసలు పెళ్లి అయిన వారు తాళి ని ఎందుకు ధరిస్తారో సరైన కారణం బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. మంగళసూత్రం ఎందుకు ధరిస్తారో? మంగళసూత్రం ధరించినపుడు చేయకూడని పనులు ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం…

 

gold mangalsutraసాధారణంగా కొన్ని ప్రాంతాలలోని మహిళలు మంగళసూత్రాన్ని కేవలం నల్లపూసలు మాత్రమే ధరించి ఉంటారు. మరికొందరు నల్లపూసలు వాటి మధ్యలో బంగారు రంగు పూసలను ధరిస్తుంటారు. మరి కొందరు కేవలం పసుపు తాడు ని మంగళసూత్రంగా భావిస్తుంటారు.

turmeric mangalsutraఅయితే మహిళలు నల్లని పూసలతో పాటు బంగారు వర్ణంలో ఉన్న పూసలు మంగళసూత్రంలో ధరించడం వల్ల వారు ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు. మెడలోని నల్లని పూసలు శివునికి ప్రతీక, బంగారు వర్ణం పూసలు పార్వతీదేవిగా భావిస్తారు.

black beads mangalsutraఅటువంటి మంగళసూత్రం మెడలో ఉంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు. పెళ్లికూతురు సుమంగళిగా ఉండి తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పార్వతీ పరమేశ్వరులు మన హృదయానికి దగ్గరగా ఈ మంగళసూత్రంలో కొలువై ఉంటారు.

parvati and shivaసాధారణంగా పెళ్లి లో మూడు ముళ్ళు వేసేటప్పుడు పసుపు తాడుతో మూడు ముడులు వేస్తూ ఒక్కో ముడి దగ్గర పసుపు,కుంకుమలను పెడతారు. అలా పసుపు కుంకుమలు పెట్టడం వల్ల సర్వ మంగళ దేవి మంగళసూత్రం లో కొలువై ఉంటారని మన నమ్మకం.
తరువాత కొద్ది రోజులకు ఆ పసుపు తాడును ఏదైనా పచ్చని చెట్టుకు కట్టి, బంగారు మంగళ సూత్రాన్ని ధరిస్తారు. బంగారు మంగళసూత్రాన్ని ధరించినప్పటికీ వాటి మధ్యలో పసుపు తాడును కడతారు.

3 knots of mangalsutraకొంతమంది మంగళ సూత్రాలుపై వారి ఇంటి కులదైవం, లేదా వారికి ఇష్టమైన దేవుళ్లను మంగళసూత్రంపై వేయించుకుని ధరిస్తారు. ఇలా చేయడంవల్ల తమంతట తామే కష్టాలను కొనితెచ్చుకున్నట్లు.
ముఖ్యంగా మంగళసూత్రంపై లక్ష్మీదేవి ప్రతిమ అస్సలు ఉండకూడదు. అలా ఉండటం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు తగ్గిపోయి, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

mangalsutraఅందువల్ల ఎటువంటి పరిస్థితులలో కూడా దేవుడి ప్రతిమలను మంగళసూత్రం పై వేసుకోకూడదు అని పండితులు చెబుతుంటారు. ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారిని పూజించుకొని ఆ పసుపు కుంకుమలను మంగళసూత్రానికి పెట్టడం ద్వారా వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వసిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR