కరోనా భయంతో తుమ్ము ఆపుకుంటున్నారా? నరాలు చిత్లిపోతాయట!

కరోనా భీభత్సం మొదలైనప్పటి నుండి ఎవరైనా చిన్నగా దగ్గినా, తుమ్మినా అనుమానిస్తున్నారు. దాంతో చాలామంది తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరిఘ్గా గమనిస్తే ఈ మధ్య సమాజంలో తుమ్మేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇదివరకటిలా బహిరంగ ప్రదేశాల్లో పెద్దగా అరుస్తూ ప్రశాంతంగా తుమ్మే వాళ్ళు కనిపించట్లేదు. తుమ్మితే చుట్టుపక్కల వాళ్లు ఎక్కడ కరోనా సోకిందని అనుకుంటారోనని తుమ్ము వచ్చినా బలవంతంగా ఆపేసుకుంటున్నారు. ముక్కును మూసేసుకొని వేగంగా గాలి పీల్చుతూ, వదిలేస్తూ, ఏదో ఒకటి చేసి తుమ్మును ఆపేస్తున్నారు.

sneezingరుతువులు మారిన ప్రతీసారి దగ్గులు, తుమ్ములు రావటం సర్వసాధారణంగా చూస్తుంటాం. అంతేనా.. నీరు మారినా చాలామందికి జలుబు చేస్తుంది. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినపుడు గాలి మార్పు వల్లా కొందరికి ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఒకసారి జలుబు బారిన పడితే ఇక తుమ్ములు రావటం అది కాస్తా దగ్గుగా పరిణమించటం జరుగుతుంది. కొందరికి కొన్ని రకాల ఆహారం, వాసనలు పడకపోయినా అలర్జీ రూపంలో తుమ్ములు వస్తుంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తుమ్మితే నేరమై పోయింది. అందుకే బలవంతంగా తుమ్ములు ఆపుకుంటున్నారు.

sneezingఅంతేకాదు… బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే మంచిది కాదని కొంతమంది నమ్ముతుంటారు. ముఖ్యంగా శుభకార్యాల కోసం వెళ్లే సందర్భంలో తుమ్ము వచ్చినా కొంతమంది ఆపుకోవటానికి ప్రయత్నిస్తారు. అయితే తుమ్ము వచ్చినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దంటున్నారు డాక్టర్లు. తుమ్ము వస్తే మోచేతిని అడ్డం పెట్టుకొనో లేదంటే కర్చీఫ్ అడ్డం పెట్టొకొనో తుమ్మాలే తప్ప అసలు తుమ్మడాన్ని బలవంతంగా ఆపితే మరింత ప్రమాదం అంటున్నారు.

sneezingఆయుర్వేదం ప్రకారం… తుమ్ములు, ఆవలింత, మూత్ర విసర్జన వంటి 13 అంశాలను అధారణీయ వేగాలు అంటారు. అంటే ఆపుకోవటానికి ప్రయత్నించకూడని విషయాలన్నమాట. మన శరీరంలో గొంతు నుంచి ముక్కు వరకు ఉన్న మార్గంలో ఏదైనా అవరోధం కలగటం, పుప్పొడి రేణువులు వంటివి లోపలికి వెళ్తున్నప్పుడు వాటిని ఆపటానికి లేదా త్యజించటం కోసం తుమ్మును ప్రేరేపిస్తుంది. తుమ్ము వచ్చినపుడు ఊపిరితిత్తులలో నుంచి గంటకు 160కి.మీ వేగంతో గాలి బయటకు వస్తుంది. దీని వల్ల దుమ్ము వంటివి బయటకు పోతాయి.

గాలిలో పుప్పొడి రేణువులు, సిద్ధబీజాలు వంటివి అనేకం ఉంటాయి. వీటి సైజు చాలా తక్కువగా ఉంటుంది. మనం గాలిని పీల్చుకున్నప్పుడు సులభంగా ఊపిరితిత్తులలోకి చేరగలవు. ఈ రేణువులను బయటకు పంపటం కోసం శరీరంలో మ్యూకస్‌ తయారవుతుంది. ఈ మ్యూకస్‌ ఊపిరితిత్తులలో పేరుకున్నప్పుడు దగ్గు వస్తుంది. అలా కాకుండా పైకి ఉన్నప్పుడు తుమ్ము వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. సూర్యకిరణాలు ముక్కు మీద పడినా కూడా తుమ్ము వచ్చే అవకాశం ఉంది.

mucusముక్కులో ఏదైనా సూక్ష్మక్రిమి, లేదా చెడు వాసనతో బ్యాక్టీరియా ముక్కులోకి వస్తే ముక్కు దాన్ని బలవంతంగా తుమ్మడం ద్వారా బయటకు పంపేస్తుంది. తుమ్మును ఆపేస్తే ఆ బ్యాక్టీరియా లేదా వైరస్ ముక్కులోనే ఉండిపోతుంది. కాసేపటి తర్వాతైనా మళ్లీ దాన్ని బయటకు పంపేందుకు ముక్కు ప్రయత్నిస్తుంది. తుమ్మును ఆపితే ఆ తర్వాత వచ్చే తుమ్ము మరింత బలంగా ఉంటుంది. తుమ్మును బలవంతంగా ఆపేస్తే చెవిలోని డయాఫ్రమ్ దెబ్బతింటుంది. చెముడు వచ్చే ప్రమాదం ఉంటుంది.

bacteriaఅలాగే కంట్లోని రక్త నాళాలు దెబ్బతింటాయి. కంట్లోని తెల్ల పొరపై ఐరిస్ చుట్టూ రక్తనాళాలు బ్రేక్ అవుతాయి. బ్రెయిన్‌లోని రక్త నాళాలు బలహీనంగా మారిపోతాయి. కొన్ని సార్లు కళ్ళు, మెదడులో రక్తనాళాలు పగిలి పోవడం వంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తుమ్మును ఆపుకోకపోవడం మంచిది. సైనస్ సర్జరీ చేయించుకున్నవారు తుమ్ములను అస్సలు ఆపకూడదు. అలా చేస్తే వీపరీతమైన తలనొప్పి, ఒక్కోసారి గుండె జబ్బు కూడా రావచ్చంటున్నారు డాక్టర్లు.

head acheకాబట్టి తుమ్ము ఎలాంటిదైనా తుమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం తుమ్ములు, దగ్గుల ద్వారా కరోనా వైరస్ ప్రభలుతోంది కాబట్టి తుమ్ము వస్తే వీలుంటే ఎవరూ లేని ప్రదేశంలో లేదా మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మడం మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR