Home Health దోశలు వేయడానికి నాన్‌ స్టిక్‌ పెనం వాడుతున్నారా? అయితే అనారోగ్యం తప్పదు!

దోశలు వేయడానికి నాన్‌ స్టిక్‌ పెనం వాడుతున్నారా? అయితే అనారోగ్యం తప్పదు!

0

భారతీయులకు అందరికీ పరిచయమైన, ఇష్టమైన అల్పాహారం దోశ. మనదేశంలో ఎక్కువశాతం మంది ఉదయాన్నే టిఫిన్ లోకి దోశ తినడానికి ఇష్టపడతారు. దోశలో చాల రకాలు ఉంటాయి కాబట్టి రోజూ తిన్నా బోర్ కొట్టదు. రుచికే కాదు దోశ తయారు చేయడానికి కూడా ఎక్కువగా సమయం పట్టదు.

non-stick panఅయితే అంటుకోకుండా వస్తాయని ఇప్పుడందరూ దోశ వేయడానికి నాన్‌ స్టిక్‌ పెనమే వాడుతున్నారు. కానీ దాని వలన వచ్చే ప్రమాదాన్ని గుర్తించట్లేదు. నాన్‌స్టిక్‌‌ పెనంపై వేసే దోశ కంటే ఇనుప దోసె పెనం వాడడం మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. నాన్‌స్టిక్‌ పెనంపై అంటుకోకుండా టెఫ్లాన్‌ అనే రసాయన పదార్థం పూతలా పూస్తారు. ఇవి ఆరోగ్యానికి కీడు చేస్తాయి.

రసాయనాలు, ఆమ్లాలతో తయారయ్యే నాన్‌ స్టిక్‌ వస్తువులను వాడటం ద్వారా కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు ఏర్పడుతాయి. నాన్‌స్టిక్‌లోని టెఫ్లాన్‌ అనే రసాయన పదార్థం.. వేడి చేయడం ద్వారా కరిగి తద్వారా ఆహారంలో కలుస్తుందని.. ఫలితంగా అనా రోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇనుము పెనంపై దోసెలు పోయడం వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇనుము పెనంపై దోసెలను పోయడం ద్వారా రసాయ నాల ప్రభావం వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

Exit mobile version