అశ్వగంధ ఇన్ని రకాలుగా ఉపయోగిస్తారా?

అశ్వగంధ ఓ పురాతన మూలిక. 3వేల ఏళ్లకు పైగా దీన్ని వాడుతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఇది మంచి ఔషధం. దీని యొక్క వేర్లు మరియు పండ్లు కూడా మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దీని ఆకులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఒత్తిడిని తగ్గించడంలో, ఎంగ్జైటీ, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలకు ఇది ఫుల్ స్టాప్ పెడుతుంది.

అశ్వగంధ అంటే… గుర్రం వాసన అని అర్థం. ఎందుకంటే ఈ మూలిక వాసన ప్రత్యేకంగా ఉంటుంది. అశ్వగంధ మొక్క ఇండియా, ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వేర్లు, ఆకుల్ని ఔషధాల్లో వాడుతారు. ఇది మన శరీరం, బ్రెయిన్‌కి ఎంతో మేలు చేస్తుంది. అశ్వగంధని ఉపయోగించడం వల్ల రోగ నిరోధకశక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.

immunity boostఅలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటే అశ్వగంధ తీసుకుంటే ఒత్తిడిని దూరం చేయవచ్చు. అశ్వగంధ తీసుకోవడం వల్ల నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ మరియు ఇమ్యూన్ సిస్టమ్ బాలెన్స్ గా ఉంటాయని నిపుణులు అంటున్నారు. చాలా రోజుల నుంచి ఒత్తిడి పడుతున్న కూడా అశ్వగంధ సులువుగా ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నా మీరు అశ్వగంధ తీసుకో వచ్చు దీనితో మీకు చక్కగా పరిష్కారం ఉంటుంది.

అశ్వగంధ మనలో ఎనర్జీ లెవెల్స్ పెంచగలదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించగలదు, స్పెర్మ్ కౌంట్ పెంచగలదు. లైంగిక సామర్థ్యాన్ని అశ్వగంధ చూర్ణం పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నరాల బలహీనతను ఈ చూర్ణం దూరం చేస్తుంది. వంద గ్రాముల అశ్వ‌గంధ పొడిని తీసుకుని అందులో పావు కిలో నెయ్యిని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని రోజూ ఒక టీస్పూన్ చొప్పున ఒక గ్లాసు వేడి పాలు లేదా గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని.. వీర్య లోపాలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అశ్వగంధ చూర్ణాన్ని పది గ్రాముల మోతాదులో తీసుకుని అరగ్లాసు వేడిపాలలో కలిపి మహిళలు రుతుక్రమం అయిన నాలుగో రోజు నుంచి తీసుకుంటే సంతాన లేమిని దూరం చేసుకోవచ్చు.

ashwagandha powderఅశ్వగంధని వాడటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి మరీ ముఖ్యంగా కీళ్ల వాతంతో బాధ పడేవారికి ఇది మంచి మూలిక అని చెప్పొచ్చు. అశ్వగంధ కేవలం నిద్రలేమి సమస్య మాత్రమే కాదు జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. అశ్వగంధని తీసుకోవడం వల్ల కోలైన్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలు కూడా దీనిని తీసుకో వచ్చు.

rheumatoid arthritisఅశ్వగంధ పొడిని ఐదు గ్రాములు, పటిక బెల్లం పొడి ఐదు గ్రాములు కలిపి మహిళలు రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే అధిక రక్తస్రావం క్రమం అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అశ్వగంధ లో క్యాన్సర్ కు విరుద్ధంగా పోరాడే గుణాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ స్థాయిలని పెంచేందుకు కూడా అశ్వగంధ బాగా పని చేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తీసుకోవడం వల్ల రక్తం లో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.

wounds and soresఅశ్వ గంధను తీసుకోవడం వల్ల చర్మం శుద్ధి అవుతుంది. గాయాలను, పుండ్లను మానిపించడానికి కూడా అశ్వగంధ బాగా ఉపయోగ పడుతుంది. శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించడంలో అశ్వగంధ ఎంతో బాగా పని చేస్తుందని చెప్పొచ్చు. గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యలను కూడా ఇది రాకుండా చేస్తుంది. జుట్టు కుదుళ్ల కి మంచి బెనిఫిట్స్ ని ఇచ్చి జుట్టుకు బలాన్ని కూడా ఇస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR