వ్యాయామం చేయాలనుకుంటున్నారా? ఈ నియమాలు తప్పక పాటించండి!

మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగా ఆధునిక జీవనశైలిని కూడా మార్చుకోవాలి. లేకుంటే ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో మనం వెనుకబడిపోతాం. ఇందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. అయితే ఏ వయసు వారు ఎంతసేపు ఎలా వ్యాయామం చేయాలనే అవగాహన చాలామందికి ఉండదు. ఆ విషయాన్ని కొంత వివరంగా తెలుసుకుందాం..

వ్యాయామంయువత ఏ టైంలో నైనా వ్యాయామం చేయొచ్చు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యల్లేకుంటే నిశ్చింతగా చేయొచ్చు. కానీ 45 ఏళ్లు దాటిన మగవారు.. 55 ఏళ్లు దాటిన మహిళలు కొంచెం కేర్ తీసుకోవాలి. వారికేమైనా అనారోగ్య సమస్యలుంటే ఖచ్చితంగా వైద్యుల సూచనలు పాటించి వ్యాయామం ప్రారంభించాలి.

వ్యాయామంఅయితే లక్ష్యం లేని జీవితం వృధా అంటారు. మనం వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలంటే కచ్చితంగా లక్ష్యం నిర్ధారించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్తగా వ్యాయామం చేసేవాళ్లు చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకెళ్లడం ఉత్తమం. పెద్ద గోల్స్ పెట్టుకుంటే అవి సాధించలేని స్థితిలో చాలా మంది ముందులోనే వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. లక్ష్యాలు నిర్దేశించుకున్న తర్వాత అనుకున్న ఫలితాలు రాలేదని కుంగిపోకూడదు. దాన్ని అలా కొంతకాలం కొనసాగించాలి. ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడో తిన్న తిండిని కరిగించడం అనేది ఒక నెలో రెండు నెలల్లోనే అయ్యే పని కాదు. అది దీర్ఘకాల ప్రక్రియ.

వ్యాయామంవ్యాయామం ప్రారంభించిన కొత్తలోనే రోజుకు పది కిలోమీటర్లు పరిగెత్తి అలసిపోకండి. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తేనే శరీరంలోని కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. వ్యాయామం ప్రారంభించే కొత్తలో వాకింగ్, డ్యాన్సింగ్, సైక్లింగ్ వంటవి చేయడం ఉత్తమం. రన్నింగ్ చేయాలనుకుంటే చిన్నగా ప్రారంభించాలి. రోజుకు కొంతదూరం పెంచుకోవాలే తప్ప ఒకేసారి మారథాన్ లాంటివి చేయకూడదు.

వ్యాయామంఇక ఉదయం లేవగానే షూ లేస్ కట్టుకుని ఇంటిదగ్గర్నుంచే పరిగెత్తాలనే తొందరని వదిలేయండి. వ్యాయామానికంటే ముందు మన బాడీని అందుకు సిద్దం చేయాలి. అందుకోసం వార్మప్ కచ్చితంగా చేయాలి. అలా చేయడం వల్ల మన బాడీ ని ఎక్సర్సైజ్ కు సిద్ధం చేసినట్లవువుతుంది. అయితే కొత్తగా వ్యాయామం చేసేవాళ్లు పెద్ద పెద్ద బరువులెత్తకూడదు. కార్డియో, శక్తిని పెంచే వ్యాయామాలు చేయాలి. అలా చేస్తే మన బాడీ కూడా ఎక్కువ సేపు వ్యాయామం చేయడానికి సన్నద్దంగా ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR