Home Unknown facts రావణాసురుడు శివుడి దగ్గర పొంది ఆత్మలింగం ముక్కలై వెలసిన ఆలయాలు

రావణాసురుడు శివుడి దగ్గర పొంది ఆత్మలింగం ముక్కలై వెలసిన ఆలయాలు

0

రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అతడి కఠోర తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యేక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పగా అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని అడుగగా ఒక షరతు పెట్టి వరాన్ని ప్రసాదిస్తాడు శివుడు. మరి శివుడు పెట్టిన షరతు ఏంటి? రావణాసురుడు ఆత్మలింగాన్ని ఎందుకు ముక్కలుగా చేసాడు? ముక్కలైన ఆత్మలింగం పడిన ఆ ఐదు శివాలయాలు ఎక్కడ ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ravanas Athma Lingam

రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చిన శివుడు ఆ ఆత్మలింగం ఎక్కడ అయితే నేలమీద పెడతావో అది అక్కడే స్థాపితం అయిపోతుందని షరతు పెట్టు ఆత్మలింగాన్ని ఇస్తాడు. అయితే అప్పుడు దేవతలందరు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి రావణుడు ఆత్మలింగాన్ని పొంది లంకలో ప్రతిష్టించాలని భావించి ఆత్మలింగాన్ని తీసుకువెళ్తున్నాడు ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలని ప్రార్ధించగా అప్పుడు శ్రీమహావిష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుటకు వెళ్లాలని అనుకోగా అప్పుడు నారదుడు వినాయకుడి ప్రార్ధించగా వినాయకుడు ఒక బ్రాహ్మణా బాలుడి వేషంలో రావణుడికి కనిపిస్తాడు.

ఆ బాలుడిని చూసిన రావణుడు ఆత్మలింగాన్ని ఆ బాలుడికి ఇచ్చి సంధ్యావందనానికి వెళ్ళొస్తా నేను వచ్చే వరకు ఎట్టిపరిస్థితుల్లో దీనిని నేలపైన పెట్టకూడదు అంటూ చెప్పగా, అప్పుడు బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు మూడు సార్లు పిలుస్తాను ఆ లోపు రాకుంటే దీనిని నేలపైన పెట్టి వెళ్లిపోతానని చెబుతాడు. అలా వెళ్లిన రావణుడిని మూడు సార్లు పిలువగా రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చే సమయానికి ఆత్మలింగాన్ని నేలపైన పెడుతాడు. రావణుడు ఆత్మలింగాన్ని ఎంత ప్రయత్నించినా పైకి రావడంతో కోపించిన రావణుడు శివలింగాన్ని పైకి తీసే ప్రయత్నంలో ఆత్మలింగం ఐదు ముక్కలు ఐదు చోట్ల పడగ అక్కడ శివాలయాలు వెలిశాయని పురాణం.

మహాబలేశ్వరాలయం – గోకర్ణం

కర్ణాటక రాష్ట్రం లో గోకర్ణం అనే క్షేత్రం ఉంది. రావణుడు వంటి మహా బలవంతుడు ఆత్మలింగాన్ని పైకి ఎత్తలేకపోయాడు కనుక ఈ ఆలయంలోని స్వామికి మహాబలేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం సగం భూమిలో ఉంటుంది. భూమికి పైన ఉండే సగభాగం శివుడి ఆత్మలింగం కనుక ఆ లింగం చుట్టూ నాలుగు వైపులా కప్పివేస్తూ ఒక దాని మీద ఒకటిగా రాళ్ళూ పేర్చుకుంటూ వచ్చారు. అన్నిటికంటే పైన ఉన్న రాయికి ఆవు చెవి ఆకారంలో అంటే గోకర్ణం ఆకారంలో ఉండే రంద్రాన్ని అమర్చారు. ఆలయానికి వెళ్లిన భక్తుడు ఆ రంద్రంలో చేయి పెడితే లోపల ఉన్న శివలింగం యొక్క కొనభాగం చేతికి తగులుతుంది.

శ్రీ మురుడేశ్వర స్వామి ఆలయం:

కర్ణాటక రాష్ట్రం, అరేబియా సముద్రానికి అనుకోని శ్రీ మురుడేశ్వర స్వామి ఆలయం ఉంది. మూడువైపులా అరేబియా సముద్రం ఉండగా ఒక పర్వతం మీద ఈ ఆలయం ఉంది. ఇక్కడ 123 అడుగుల ఎత్తు ఉన్న శివుడి సుందరమైన విగ్రహం ఉంది. ఇక్కడి గాలి గోపురం ప్రపంచంలో కెల్లా చాలా పెద్దది. అయితే ఆత్మలింగాన్ని భద్రపరిచిన పెట్టెపైన కట్టిన వస్త్రం పడిన చోటు వెలసిన క్షేత్రం ఇది అని చెబుతారు. కన్నడ భాషలో మురుడు అంటే వస్త్రం.

సజ్జేశ్వర ఆలయం:

ఆత్మలింగం పైన ఉన్న కవచాన్ని విచ్చిన్నం చేసి రావణాసురుడు విసిరి వేయగా ఈ ప్రాంతంలో పడిందని చెబుతారు. గోకర్ణం నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

గుణేశ్వరం:

ఆత్మలింగం పైన ఉన్న కప్పును విసిరివేయగా ఈ ప్రాంతంలో పడినది అని చెబుతారు.

ధారేశ్వరం:

ఆత్మలింగం పైన ఉన్న దారం తీసివేసి విసిరివేయగా ఈ ప్రాంతంలో పడినదని చెబుతారు.

ఈవిధంగా రావణాసురుడు ఆత్మలింగాన్ని పొందుటకై ఆగ్రహించి ముక్కలుగా చేసి విసిరివేయగా ఈ పంచ క్షేత్రాలు వెలిసాయని పురాణం. ఈ ప్రసిద్ధ దేవాలయాలకు దేశం నలుమూలల నుండి భక్తులు ఎప్పుడు తరలివస్తుంటారు

Exit mobile version