Home Health సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి అవగాహన ఉందా? 

సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి అవగాహన ఉందా? 

0
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం గమనిస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద సెలెబ్రెటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న ​ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే పరిస్థితి చేయి దాటిపోతుంది.
  • అయితే గుండెపోటు అనగానే ఒక వ్యక్తి ఆకస్మాత్తుగా గుండె పట్టుకొని కుప్పకూలిపోవడం, కళ్ళు వెనక్కి తిప్పడం, తీవ్రమైన నొప్పితో మూలగడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ఇది నిజానికి చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా గుండెపోటు వేగంగా అనుకోకుండా వస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే గుండెపోటు చాలా సందర్భాల్లో నిదానంగా కూడా వస్తుంది. ఈ గుండెపోటును నిశ్శబ్ద గుండెపోటు అని పిలుస్తారు.
  • నిశ్శబ్ద గుండెపోటు సూక్ష్మంగా ఉండటం వల్ల ప్రజలు దానిని గమనించలేరు. కానీ తరువాత అది జీవితానికి ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. ఈ నిశ్శబ్ద గుండెపోటు లేదా సైలెంట్ హార్ట్ ఎటాక్ అంతకన్నా భయంకరమైనది. గుండె పనిచేయడానికి ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం అవసరం కాబట్టి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో అడ్డుగా ఏదైనా ఏర్పడితే రక్త ప్రసరణ నిలిచిపోతుంది.
  • గుండెకు రక్తప్రసరణ లేనప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది. దీని కారణంగా నిశ్శబ్ద గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఛాతీలో ఎప్పుడైనా అసౌకర్యం ఎదురైనట్టు అనిపిస్తే ఆ సమయంలో గుండె పరీక్షను చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఛాతి నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం, ఇవన్నీ కొన్నిసార్లు గుండెపోటు ముందు కనిపిస్తాయి. ఈ లక్షణాలుంటే ఇది నిశ్శబ్ద గుండెపోటు అని అర్థం చేసుకోవచ్చు. లేదంటే ఛాతీ మధ్యలో కొంచెం నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుంది. దీని కారణంగా కొద్దిగా ఒత్తిడి, అసౌకర్యాన్ని అనుభవించవచ్చు.
  • ఈ లక్షణాలు కనిపించినప్పుడు సాధారణంగా ఎవ్వరైనా నిర్లక్ష్యం చేస్తారు. ఇది తరువాత ప్రమాదకరంగా మారుతుంది. జలుబు, చెమటలు, వికారం సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు కావచ్చు. సాధారణంగా ఈ లక్షణాలు ఫ్లూలో కనిపిస్తాయి కానీ ఫ్లూ చికిత్స తర్వాత కూడా ఈ సమస్య ఉంటే  తీవ్రంగా పరిగణించి వైద్యుడిని సంప్రదించాలి.
  • అకస్మాత్తుగా మైకం, శ్వాస సంబంధిత సమస్యలు వేధిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నిశ్శబ్ద గుండెపోటుకు ఛాతీ నొప్పి కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఛాతీ నొప్పితో శ్వాస ఆడకపోవడం నిశ్శబ్ద గుండెపోటుకు సాధారణ సంకేతం. ఒక్కోసారి మైకంతో మూర్ఛపోవడం కూడా జరుగుతుంటుంది.
  • ఈ లక్షణాలు కనిపించిన సమయంలో సాధారణంగా చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అయితే నిర్లక్ష్యం చేసిన వాళ్లు తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నిశ్శబ్ద గుండెపోటు లక్షణాల గురించి అవగాహన కలిగి ఉంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

Exit mobile version