వింటర్ సీజన్లో వచ్చే జలుబు, దగ్గుకు బార్లీ టీ…!

ప్రస్తుత కాలంలో రకరకాల జబ్బులు, సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విభిన్న ఆహారపు అలవాట్ల వల్ల పురుషులకు సంతానోత్పత్తి, స్త్రీలకు వివిద రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ ఆయుర్వేదంలోని ఒక ‘టీ’ మోతాదులో తీసుకుంటే ఇవే కాదు పలు రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఆ ‘టీ’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బార్లీ గింజలు దాదాపు అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా వేస‌వి కాలంలో ఎండ తాపాన్ని, నీర‌సాన్ని తీర్చుకునేందుకు బార్లీ వాట‌ర్ తాగుతుంటారు. కానీ, స‌మ్మ‌ర్‌లోనే కాదు. ఏ సీజ‌న్‌లో అయినా బార్లీ గింజ‌ల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. బార్లీ గింజలు అనగానే ముందుగా బార్లీ గింజలు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది బీర్ తయారీకి వాడే ముఖ్య పదార్థం అనుకుంటారు. కానీ ఆ గింజలతో చేసిన ‘టీ’లో చాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
మన దేశంలో అంత ప్రాముఖ్యం పొందకపోయిన జపాన్, కొరియా ప్రాంతాలలో ఆయుర్వేద వైద్యానికి వాడుతారు. అధిక ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఫుష్క‌లంగా ఉండే బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ప్ర‌తి రోజు బార్టీ గింజ‌ల‌తో త‌యారు చేసిన టీ ఒక క‌ప్పు తాగితే ఎన్నో జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.

బార్లీ టీ తయారు చేసే విధానం..

1.  బార్లీ గింజ‌ల‌ను లైట్‌గా డ్రై రోజ్ చేసి పౌడ‌ర్‌లా త‌యారు చేసుకోవాలి. తరువాత ఒక కప్పు నీటిని మరిగించండి.
2. అందులో రెండు టేబుల్ స్పూన్ల రోస్టెడ్ బార్లీ కలపండి.
3. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో ఐదు నిమిషాల పాటు నీటిని మరగనివ్వండి.
4. తరువాత స్టవ్ మీద నించి దించి చల్లారనివ్వండి.
5. వడకట్టి ఆ టీని తాగేయండి. ఇందులో కావాల‌నుకంటే తేనె కూడా మిక్స్ చేసుకుని సేవించ‌వ‌చ్చు. కాచిన ఈ బార్లీ ‘టీ’ని వేడి మరియు శీతల పానీయంగా ఆస్వాదించవచ్చు.
ప్ర‌తి రోజు ఒక క‌ప్పు బార్లీ టీ తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫ‌లితంగా, గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి. వెయిట్ లాస్‌లోనూ బార్లీ టీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది. ఉద‌యాన్నే ఒక క‌ప్పు బార్లీ టీ తాగ‌డం వ‌ల్ల‌. అందులో ఉండే ఫైబ‌ర్ బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది.
కొరియన్స్ స్కిన్ ముడతలు పడకుండా ఉండడం కోసం రోజూ బార్లీ టీ  తాగుతారు, దాంతో వీరు స్కిన్ త్వరగా ఏజ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ ని ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ నించి కాకాపాడతాయి ముడతలు త్వరగా రాకుండా చేస్తాయి. ఇందులో ఉండే ఎజిలైక్ యాసిడ్ రొజేషియా, యాక్నే ని రెడ్యూస్ చేస్తుంది. అన్ని రకాల చర్మ సమస్యల నుండీ చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
బార్లీ గింజలలో భారీగా లభించే సెలీనియం ఖనిజం వల్ల శుక్ర కణాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఈ ఖనిజం తక్కువ అయితే సంతానోత్పత్తి సమస్యలతో పాటు కండరాల బలహీనత, జుట్టు రాలడం మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. నెల‌స‌రి నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో బార్లీ ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.కాబ‌ట్టి, ఆ టైమ్‌లో ఖ‌చ్చితంగా ఒక క‌ప్పు బ‌ర్లీ టీ తీసుకోండి. డెల‌వ‌రీ త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు బార్లీ టీ సేవించాలి.ఎందుకంటే, పాలు బాగా ప‌డేలా చేయ‌డంలో బార్టీ సూప‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
టీ యొక్క యాంటీఆక్సిడెంట్ల ప్రభావంతో పెద్దప్రేగు మరియు ఇతర రకాల క్యాన్సర్లను నివారించడంలో ఉపయోగపడుతుంది. అలాగే ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్‌లో జ‌లుబు, ద‌గ్గు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి. బార్లీ టీ ప్ర‌తి రోజు సేవిండ‌చం వ‌ల్ల సీజ‌న‌ల్‌గా వ‌చ్చే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య ఉండ‌నే ఉండ‌వు.
ఈ టీ మోతాదులో తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుందని సైటిఫిక్ గా ప్రూవ్ అయింది. పెప్టైడ్ అనే ప్రోటీన్ ఇందులో పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ బి 6, మెగ్నీషియం మోతాదులో లభించడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని నివారించడంతో పాటు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
గొంతుకు సంబందించిన వ్యాధులు ఉన్నవారు తీసుకోకపోవడం మంచిది. మోతాదులో కాకుండా అధిక మొత్తంలో ఈ బార్లీ ‘టీ’ని తీసుకుంటే క్యాన్సర్‌ కు కారణమవుతుందని కొందరు ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR