ఏ నదిలో స్నానం ఆచరిస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుంది???

మనిషి నిద్రించేటప్పుడు సగం శవంతో సమానమని అంటారు. మనలో ఉన్న పంచేంద్రియాలు పనిచేస్తూ ఉంటేనే మనం జీవించి ఉన్నట్టు అర్ధం. అందుకే నిద్ర లేచాక మనం మన శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి స్నానం చేస్తాం.
పూర్వకాలంలో స్నానం చెయ్యాలి అంటే నదులకి వెళ్లి చేసేవారు. నదీ ప్రవాహం తప్ప మిగిలిన నీరు స్నానానికి, శరీర శుద్ధికి పనికిరాదని ఒక నమ్మకం ఉండేది. కాని కాలం మారుతూ వచ్చింది. రోజులు మారేకొద్దీ నదులకు దూరంగా ఇళ్ళు కట్టుకోవటం వల్ల ప్రత్యేకించి నదులకు వెళ్లి స్నానం చేసి వచ్చేంత దగ్గరలోనూ నదులు లేవు, అక్కడికి వెళ్లి స్నానంచేసి వచ్చేంత సమయము లేకుండా పోయింది.
సాధారణంగా పుణ్య క్షేత్రాలన్నీ కూడా నదీ తీరాలవెంటే ఉంటాయి. అందువల్ల ఆయా పుణ్య క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి నదుల్లో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు. ఇక పుష్కర సమయంలోను, కార్తీక మాసంలోను, విశేషమైన కొన్ని పుణ్య దినాల్లోను నదీ స్నానాలు చేయటం తప్పనిసరి అయిందని చెప్పవచ్చు.
గంగ కృష్ణ యమున గోదావరి నర్మద తుంగభద్ర గౌతమీ నదీ తీరాల వెంట ఎన్నో పుణ్య క్షేత్రాలు . మరెన్నో దివ్య క్షేత్రాలు ఉన్నాయి. గంగానదిలో స్నానం చేయడం వల్ల  పాపాలన్నీ పోతాయని భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది.
గోదావరి నదిలో ఒకసారి స్నానం చేయడం వల్ల వంద సంధ్యా వందనాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెపుతున్నాయి. కృష్ణా నది స్నానం శ్రీ మహా విష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
తుంగభద్ర నదిలో స్నానం చేసినవారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఒక్కసారి గౌతమీ నది స్నానం చేయడం వలన అనేక పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇక నర్మదా నదిలో స్నానం చేసి అనుకున్నవి దానంచేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఇక పుష్కర కాలంలో ఆయా నదుల్లో స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నదీ స్నానాల ఫలితంగా పుణ్యాన్ని ఆర్జించిన వారంతా సువర్ణముఖీ నదీ తీరంలో జన్మిస్తారనేది పురాణాల్లో ఉన్నది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR