ప్రకృతితో మమేకమై పూలను పూజించే బతుకమ్మ పండుగ విశిష్టత..

సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత దేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహలు, వీధులు, ఆలయాల్లో నిల్పి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగు పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాదు, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. జొన్న పంట కూడా సిద్ధంగా తల ఊపుతూ ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యమైన రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వేడుకగా చేసుకుంటారు. ఈ 9 రోజులు ప్రతి గడపకు పండుగ కళ వస్తుంది. అక్కాచెల్లెలు అంతా ఒక దగ్గరకు చేరుకుని కలిసి, ఆడి, పాడుతారు.

ముఖ్యంగా 9 రోజులపాటు ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిదిరోజులు ఎవరైనా నైవేద్యం తయారు చేయవచ్చు. కానీ, సద్దుల రోజు మాత్రం కేవలం మహిళలు మాత్రమే నైవేద్యాన్ని తయారు చేస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ..

sesameమహాలయ అమావాస్య లేదా పెతారమాస రోజు అంటే మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేస్తారు. ఈ రోజు బతుకమ్మకు నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ..

atukuluఆశ్వయుజ శుద్ధ పాడ్యమిరోజు అటుకుల బతుకమ్మను చేస్తారు. ఈ రోజు నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా అమ్మకు సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ..

lentilsమూడో రోజు నిర్వహించుకునే ఈ బతుకమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ..

riceనానపెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి, బతుకమ్మకు సమర్పిస్తారు. ఇది నాలుగో రోజు జరుపుకునే బతుకమ్మ వేడుక.

అట్ల బతుకమ్మ..

atluఐదవరోజు వచ్చేది అట్ల బతుకమ్మ. ఈ రోజు దోశలు లేదా అట్టు పోసి బతుకమ్మకు నైవేద్యం పెడతారు.

అలిగిన బతుకమ్మ..
ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ..

neemఏడో రోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. బియ్యం పిండిని వేయించి వేప పండ్లుగా తయారు చేస్తారు. దీన్ని బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.

వెన్నముద్దల బతుకమ్మ..

venna muddaluఎనిమిదవ రోజు జరుపుకునే ఈ వెన్నముద్దల బతుకమ్మకు నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ..
ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాష్టమి కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇది చివరిది కాబట్టి ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, నువ్వుల అన్నం, కొబ్బరి అన్నం.
ఈ రోజుల్లో ఆడపడుచులు మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుకుని బతుకమ్మను ఆడతారు. ప్రతిరోజూ సాయంత్రం ఒక వేడుకలా జరుపుకుని ఆ తరువాత దగ్గర్లో ఉన్న చెరువుల్లో లేదా బావుల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR