ఈ వస్తువులును దానం చేస్తున్నారా అయితే జాగ్రత్త ?

దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు. భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు, సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. ‘అమ్మకం’ అనకుండా ‘దానం’ అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర, చర్మం , గుండె, మూత్రపిండం, రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.

దానంబలి చక్రవర్తి మూడడుగులు విష్ణుమూర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.

శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.

కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి “దాన కర్ణుడి”గా నిలిచాడు. ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు. ఏదైనా పంచుతూ పోతే… చివరకు మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలా మంది. నిజానికి దానం చేసే వాళ్లే ధనవంతులవుతారని పండితులు చెబుతున్నారు.

దానందానం.. ఎప్పుడు ఎవరికీ చేసినా మంచిదే. లేని వారికి ఉన్నవారు ఎంతో కొంత, ఎదో ఒక రూపం లో చేసే సహాయం వల్లే మనిషి ఆత్మకి సంతృప్తి దొరుకుతుంది. కుల మతాలతో సంభందం లేకుండా అందరూ అలవర్చూకోవాల్సింది దాన గుణమే. అన్ని దానాల్లోకి అన్న దానం గొప్పదని తెలిసిందే. విద్యా దానాన్ని మించినది లేదంటారు పెద్దలు. అవసరార్థం రక్త దానమో, అవయవ దానమో చేస్తే అంతకన్నా మహాభాగ్యం ఉండదు. దానం చేస్తే సద్గతులు ప్రాప్తిస్తాయని పండితుల ఉవాచ. ఇవన్నీ చేయాల్సిన దానాలే కానీ కొన్ని ఎట్టి పరిస్తితుల్లోకూడా చేయకూడని దానాలు కూడా ఉన్నాయట. తెలిసి చేసినా, తెలియక చేసినా ఈ దానాలు చేస్తే మన కొంప మునిగే ప్రమాదముందట. కొన్ని దానాల జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళకండని పండితులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం.

దానంచెడిపోయిన లేదా తినడానికి పనికిరాని ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు. ఇలాంటి ఆహారాన్ని దానం చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి.

కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఎంత సంపాదించినా, వచ్చింది వచ్చినట్టు కర్పూరంలా కరిగిపోతుందట.

చినిగిపోయిన దుస్తులు, పాడైపోయిన పాత్రలు, విరిగిపోయిన కుర్చీలను దానం చేస్తే దురదృష్టం వెంటాడి అన్ని అపజయాలే ఎదురవుతాయి. అసలు మనకి పనికిరాని వస్తువు ఇంకెవరికీ దానం చేయరాదట.

దానంచీపుర్లు దానం చేసినవారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. లక్ష్మీదేవిగా భావించే చీపురును దానం చేయడమంటే చేజేతులా లక్ష్మీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లేనట.

ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడమే కాదు, బదులుగా ఇచ్చినా కూడా కెరీర్ నాశనమైపోతుందట.

సూది, కత్తెర, కత్తులు లాంటివి దానం చేస్తే ఏరి కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట . ఇవి దానం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి, జీవితంలో వారికి ఏదీ కలిసిరాదట.

దానంపేదవాళ్లకు మీరు దానం ఇవ్వదలిస్తే… ఇత్తడి (brass) ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. అది కూడా పౌర్ణమి నాడు ఇస్తే మంచిదట. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో ఆహారానికీ, సంపదకు లోటు ఉండదని సూచిస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR