Home Unknown facts Edward Michael “Bear Grylls” : A Man With Stupendous Courage

Edward Michael “Bear Grylls” : A Man With Stupendous Courage

0

డిస్కవరీ ఛానల్ లో వచ్చే మోస్ట్ పాపులర్ రియాలిటీ షో man vs wild . ఈ ప్రోగ్రాం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బేర్ గ్రెల్స్ ఇంకా అతడు చేసే సాహసాలు. అయితే అతిచిన్న వయసులోనే బ్లాక్ బెల్ట్ సాధించిన అయన, కేవలం 23 సంవత్సరాలు ఉన్నపుడు ఎవరెస్ట్ ని అధిరోహించి అతి తక్కువ వయసులో ఎవరెస్టు అధిరోహించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ఇలాంటి సాహసాలు ఎన్నో అయన జీవితంలో ఉన్నాయి. ఇక అత్యంత అవసరమైన పరిస్థితులలో మనిషి జీవన మనుగడ ఎలా ఉండాలి అని క్లియర్ గా చూపించే man vs wild ప్రోగ్రాం కి దాదాపుగా 150 కి పైగా దేశాలలో ప్రేక్షాదరణ విపరీతంగా ఉంది. ఈ షో అమెరికాలో మొదటి స్థానంలో నిలిచింది. మరి వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించినా బేర్ గ్రెల్స్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bear Grylls

బేర్ గ్రెల్స్ జూన్ 7 వ తేదీ 1974 వ సంవత్సరంలో డోనాఘడ్, కౌంటీ డౌన్, నార్తర్న్ ఐర్లాండ్ లో జన్మించారు. బేర్ గ్రెల్స్ తండ్రి పేరు మైఖేల్ గ్రిల్స్, తల్లి పేరు సారా గ్రిల్స్. బేర్ గ్రెల్స్ అసలు పేరు ఎడ్వార్డ్ మైకేల్ గ్రిల్స్. అయితే అతను పుట్టిన వారానికి అయన అక్క లారా ఇతనికి బేర్ గ్రెల్స్ అని ముద్దు పేరు పెట్టింది. బేర్ గ్రెల్స్ నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తండ్రి దగ్గర నుండి climbing and sailing లో శిక్షణ తీసుకున్నాడు.

బేర్ గ్రెల్స్ టెరిటోరియల్ ఆర్మీ లో చేరి 1996 లో 1997 వరకు మూడు సంవత్సరాల పాటు స్పెషల్ ఎయిర్ సర్వీస్ యూనిట్ లో పని చేసారు. అయితే బేర్ గ్రెల్స్ free-fall parachuting ప్రమాదంలో తన బ్యాక్ బోన్ మూడు చోట్ల విరిగినప్పుడు అయన తిరిగి మళ్ళీ నడవటం కూడా అసాధ్యం అని అయన సర్జన్ తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా అయన మిలటరీ జీవితం ముగిసింది. కానీ ఇది జరిగిన 18 నెలలకే బేర్ గ్రెల్స్ తన హార్డ్ వర్క్ తో ఎలాంటి వండర్స్ అయినా సృష్టించగలం అని ప్రూవ్ చేసుకున్నాడు.

ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఎవరు లెక్కలేని పర్వతం Mount Ama Dablam. కానీ బేర్ గ్రెల్స్ 1997 వ సంవత్సరంలో Mount Ama Dablam అధిరోహించి ఇది సాధించిన అతి తక్కువ వయసు ఉన్న బ్రిటిష్ వ్యక్తిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

ఇక 1998 మే 16 వ తేదీన 23 సంవత్సరాలు ఉన్న బేర్ గ్రెల్స్ అయన చిన్నప్పటి కళ అయినా మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించాడు. అతి తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా బేర్ గ్రెల్స్ అనేక ప్రశంసల్ని అందుకోవడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించాడు. అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి బేర్ గ్రెల్స్ కి తొమ్మిది రోజులు పట్టింది.

ఇక మొట్ట మొదటగా బేర్ గ్రెల్స్ చేసిన టీవీ షో man vs wild కాదు. escape to the legion with bear grylls. ఆ తరువాత బేర్ గ్రెల్స్ చేసిన man vs wild 180 దేశాలలో ప్రసారం అవుతూ సూపర్ క్రేజ్ సంపాదించింది. ఈ ప్రోగ్రాంలో అత్యంత అవసరమైన పరిస్థితులలో మనిషి జీవన మనుగడ ఎలా ఉంటుందో చూపించడం కోసం బేర్ గ్రెల్స్ పచ్చి మాంసాన్ని, చిన్న చిన్న పురుగుల్ని, బ్రతికి ఉన్న పాముల్ని తిన్నాడు. ఇంకా ఈ షో లో అయన చేసే సాహసాలు టీవీ ముందు ఉండే ప్రతి ప్రేక్షకుడిని కట్టి పడేలా చేస్తాయి.

ఇంకా బేర్ గ్రెల్స్ మొత్తం 11 పుస్తకాలను రచించాడు. అందులో మొదటిది facing up . ఈ బుక్ బ్రిటన్ లో టాప్ టెన్ లిస్ట్ లో ఒకటిగా నిలిచింది. ఇదే పుస్తకాన్ని అమెరికాలో The Kid Who Climbed Everest అనే పేరుతో రిలీజ్ చేసారు. బేర్ గ్రెల్స్ రాసిన 11 పుస్తకాలలో 4 teenage fiction కి మరియు 7 survival కి సంబంధించినవి.

బేర్ గ్రెల్స్ 2005 వ సంవత్సరంలో మరో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. భూమి నుండి 76 వేల మీటర్ల ఎత్తులో ఒక హాట్ ఎయిర్ బెలూన్ లో కూర్చొని డిన్నర్ చేసి మరొకసారి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.

ఇక 2006 వ సంవత్సరంలో man vs wild అనే టీవీ షో మొదలైంది. ఈ ప్రోగ్రాం కి మొదట్లో Born Survivor: Bear Grylls అనే పేరు ఉండేది. ఈ ప్రోగ్రాంతో ఎంతో మంది అభిమానాలను సొంతం చేసుకున్నబేర్ గ్రెల్స్ పేదవారికి సహాయం చేయడంలో ముందుంటు కొన్ని స్వచ్చంధ సంస్థలకి తన వంతు సహాయం చేస్తుండేవాడు.

2009 వ సంవత్సరంలో, అతను ముప్పై ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు స్కౌట్ అసోసియేషన్ చీఫ్ స్కౌట్ గా ఆయన్ని నియమించారు. ఇలా అతి తక్కువ వయసులో చీఫ్ స్కౌట్ యొక్క స్థానాన్ని సంపాదించినా వ్యక్తిగా అయన నిలిచారు.

బేర్ గ్రెల్స్ వ్యక్తిగత విషయానికి వస్తే, బేర్ గ్రెల్స్ కి షరా కానింగ్స్ తో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు. అయితే బేర్ గ్రెల్స్ యొక్క కుమారుడు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్విమింగ్ పూల్ లో పడిన ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడి తన సాహసానికి అందరి ప్రశంసలు పొందాడు.

ఇక అత్యంత అవసరమైన పరిస్థితులలో మనిషి జీవన మనుగడ ఎలా ఉండాలో చూపిస్తూ ప్రజలను ప్రేరేపిస్తూ బేర్ గ్రెల్స్ చేసిన సాహసాల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే బేర్ గ్రెల్స్ ultimate survivor.

Exit mobile version