పుదీనా ప్యాక్ వేయడం వల్ల చర్మ సమస్యలన్నీ దూరం అవుతాయా ?

0
334

అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. ముఖం మీద కనిపించే మొటిమలు మచ్చలు పోగొట్టుకునేందుకు ఖరీదైన క్రీమ్స్ వాడతారు. సబ్బులు, ఫేస్ వాష్‌లు మారుస్తుంటారు. అయినప్పటికీ ఫలితం ఉండదు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగినా కొన్ని రోజులు కాగానే ఆ మెరుపు కూడా మాయం అవుతుంది. ఇలాంటి సమయాల్లో కొన్ని ఇంటి చిట్కాలు చక్కని ఫలితాన్ని చూపిస్తాయి.

Beautiful face with mint face packమన వంటింట్లో ఉపయోగించే ఎన్నో వస్తువులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. అందులో ఒకటే పుదీనా. ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అందాన్ని కూడా ఇస్తుంది. పుదీనా ప్యాక్ వేయడం వల్ల చర్మ సమస్యలన్నీ దూరం అవుతాయి. ఖరీదైన క్రీమ్స్ రాసినా కూడా రాని మెరుపు పుదీనాతో మీ సొంతం అవుతుంది. పుదీనా ప్యాక్ వేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి హ్యాపీగా ఈ ప్యాక్ ఎవరైనా వేసుకోవచ్చు.

Beautiful face with mint face packపుదీనాని రాయడం వల్ల యంగ్‌గా కూడా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. చర్మ రక్షణకు సాయపడే ఎన్నో అద్భుత గుణాలు పుదీనాలో ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఈ కారణంగా వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.

Beautiful face with mint face packపుదీనా కేవలం మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలనే కాదు, దోమకాటు వల్ల ఏర్పడిన మచ్చలను కూడా పోగోడుతుంది. ఇందుకు కారణం పుదీనాలోని ప్రత్యేక గుణాలు ఉండడమే. కాబట్టి రెగ్యులర్‌గా ఈ చిట్కాను ఉపయోగించండి.

Beautiful face with mint face packపుదీనా రసంలో కొద్దిగా శనగపిండి కలిపి దీన్ని ప్యాక్‌లా తయారు చేసుకుని ముఖానికి వేసుకోండి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా చేయడం వల్ల జిడ్డు చర్మం వారికి సమస్య తగ్గుతుంది.

Beautiful face with mint face packపుదీనా రసంలో కాస్తా ముల్తాని మట్టి వేసి దీన్ని ముఖానికి రాసుకుని 10 నుంచి 15 నిమిషాలు అలానే ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయండి.. ఇలా చేయడం వల్ల చర్మంపై మచ్చలు తగ్గడమే కాకుండా.. చిన్న చిన్న రంధ్రాల సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ప్యాక్ వేసుకోండి.

Beautiful face with mint face packపుదీనా పూత కంటి కింద నల్లటి వలయాలను దూరం చేస్తుంది. రెగ్యులర్‌గా రాయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. పుదీనా ఆకుల్లో కొన్ని చెంచాల గ్రీన్ టీ వేసి మిశ్రమంలా చేసి ముఖం, మెడ, చేతులకు రాయడం వల్ల కాలుష్యం వల్ల ఏర్పడిన పేరుకున్న మురికి మొత్తం పోతుంది. చర్మం కూడా మృదువుగా, తాజాగా మారుతుంది.

 

SHARE