వంకాయతో ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో మేలు

మసాలా బాగా దట్టించి.. నూనెలో వేయించి వంకాయను కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది. వంకాయను మసాలా తోనే రకరకాలు వండుకోవచ్చు. మసాలా పెట్టినా, కూర చేసినా, ఇతర కూరగాయలతో కలిపి వండినా రుచిలో మాత్రం దాన్ని కొట్టేది మరొకటి లేదు. అందుకే వంకాయను కూరగాయల్లో రారాజుగా చెప్తారు.
Beauty enhancing tips with vankaya
అయితే, వంకాయ తో వంటలు చేసుకోవడం మాత్రమే మనకు తెలుసు. కానీ అందాన్ని పెంపొందించవచ్చు అని చాలా మందికి తెలియదు. వంకాయ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇంత ఆరోగ్యకరమైన ఈ కాయగూరలో అందాన్ని పెంపొందించే గుణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Beauty enhancing tips with vankaya
వంకాయ జుట్టు ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే వంకాయని జుట్టుకి, మాడుకి పట్టించడం వల్ల సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయి.
Beauty enhancing tips with vankaya
వంకాయలో 92 శాతం నీళ్లు ఉంటాయి. దీనిలో ఉండే నీళ్లు చర్మాన్ని డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంచడానికి సహాయ పడుతుంది. అలానే ఇది మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది.
Beauty enhancing tips with vankaya
దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. మరియు క్యాన్సర్ ని నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. వంకాయ తొక్కని ఉపయోగించడం వల్ల ముడతలు, డార్క్ స్పాట్స్ వంటివి తగ్గిపోతాయి.
Beauty enhancing tips with vankaya
వంకాయ స్కిన్ టోనర్ గా కూడా పని చేస్తుంది. అయితే దీని కోసం మీరు వంకాయ తీసుకొని జ్యూస్ కింద చేయండి. కొద్దిగా ఈ జ్యూస్ ని తీసుకుని విచ్ హ్యజర్ లో మిక్స్ చేయండి. దీనిని కాసేపు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత స్కిన్ టోనర్ కింద ఉపయోగించండి. ఇలా తరచూ చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది మరియు మృదువుగా ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR