చర్మాన్ని రక్షించుకోడానికి మగవారికి కోసం కొన్ని చిట్కాలు

అందం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆడవాళ్ళు. అందమైన ఆడవాళ్ళ సౌందర్యాన్ని మరింత పెంచడానికి చాలా రకాల కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి. మరి మగవారి పరిస్థితేంటి? ప్రస్తుతం వాళ్ళు కూడా అందంలోను, దాని సంరక్షణలోను ఆడవారితో పోటీ పడుతున్నారు. అయితే ఆడవారికి ఉన్నట్లుగా మగవారికి అన్ని రకాల “కాస్మటిక్స్” లేకపొయినప్పటికి, ఎన్నో సహజమైన పద్దతుల ద్వారా వారి అందాన్ని కాపాడుకుంటూ, అందంలో వారుకూడ ఆడవారికి తక్కువ కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

Beauty Tips For Menవాస్తవానికి మగవారి కన్నా ఆడవారికే చర్మం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. పురుషులతో పోల్చితే స్త్రీల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే మగవారి చర్మం ఆడవారి చర్మం కన్నా ఆలస్యంగా ముడతలు పడుతుంది. అయితే మారుతున్న జీవనశైలి, అలవాట్లు, మగవారిని చర్మ సమస్యలలో ముందుకు తీసుకు వచ్చి,ఆడవారితో సమానం చేసేశాయి. ఇలాంటి కలుషిత వాతావరణాన్ని తట్టుకుని తమ చర్మాన్ని రక్షించుకోడానికి మగవారికి కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దామా…

->మగవారికి ముఖ్యమైన, ఎంతో ఉపయోగకరమైన చిట్కా ఏటంటే మద్యానికి దురంగా ఉండటం, ఎందుకంటే మద్యం వల్ల రక్త నాళాలు అవసరమైన దానికంటే ఎక్కువగా సాగి ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండండి.

-> సిగరెట్ తాగడం అనేది మగవారి మాన్లినెస్ కి చిహ్నం లాంటిది. కాని దీని వల్ల వారి వయస్సు అసలు కన్నా ఎక్కువగా అనిపిస్తుంది. ధూమపానము మగవారి చర్మం ముడతలకు, పొడిబారిపోవడానికి కారణం అవుతుంది.

Beauty Tips For Men-> చర్మాన్ని అధికంగా సుర్యుని కాంతిలో ఉంచకండి, దాని వల్ల చర్మం ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.

-> సాధరణంగా మగవారు షేవింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి,షేవింగ్ వల్ల చర్మం కఠినంగా అయిపొయి, చర్మంలోని తేమను తీసివేస్తుంది, అందువల్ల చర్మం పొడిగా మారి ముడతలకు దారి తీస్తుంది. అయితే షేవింగ్ చేసాక చల్లని నీటితో కడిగేసుకొని,తరువాత మాయిశ్చరైజర్ ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

Beauty Tips For Men-> ఆడవారికే కాదు మగ వారి చర్మ సౌందర్యానికి కూడా ద్రాక్ష రసం ఎంతో మంచిది. ప్రతీ రోజూ ఆహారంతో పాటు ద్రక్ష రసాన్ని కలిపి తీసుకుంటే, అది మీ చర్మంలోని ఎలాస్టిసిటీని పెంచి, మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతుంది.

Beaut And Health Benfits of Grapes-> వృద్దాప్యంగా కనిపించడం అనేది మన చర్మం వల్లే కాదు మన కుంగిపోయిన కండరాలు కూడా దీనికి కారణం అవుతాయి,అందుకే ప్రతీ రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయడం వల్ల కండరాలు బలపడి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

Diet for Healthy bones->మంచి నీరు అధికంగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడుకోవచ్చు. రోజుకి కనీసం 8 గ్లాసులు, లేదా 2 లీటర్ల నీరు తీసుకుంటే చర్మ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది.

Beauty Tips For Men-> రోజూ ముఖం పై మెల్లగా మసాజ్ చేయడంవల్ల రక్త ప్రసరణ సజావుగా సాగి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.

Beauty Tips For Men-> ఇంకా రోజూ పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మంలోని మలినాలు అన్నీ పోయి మంచి ఫలితం కనిపిస్తుంది. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.

Beauty Tips For Menముఖ్యంగా బచ్చలికూర లేదా చిక్కుళ్ళు వంటి కూరగాయలలో చర్మం ముడతలు పడకుండా చూసుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR