కోకో పౌడర్ తో బ్యూటీ టిప్స్

కేక్స్ తయారీలో, చాకోలెట్స్ తయారీలో కోకో పౌడర్ వాడతారని మనకు తెలిసిందే. దీన్ని కోకో బీన్స్ నుండి తయారు చేస్తారు. కోకో పౌడర్ సాధారణంగా రెండు రకాలలో లభిస్తుంది: సహజ కోకో పౌడర్, మరియు ఆల్కాలైమైడ్ లేదా “డచ్-ప్రాసెస్డ్,” కోకో పౌడర్. డార్క్ చాక్లెట్ లు తినేవారిలో తెలివి ఎక్కువుంటుందట. దానిలో కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్ పాటు కోకో పౌడర్ ఫ్లేవనాయిడ్స్ కూడా పుష్కలంగా లభించడం వల్ల, ఇది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో రెగ్యులర్​గా చాక్లెట్ లు తినేవారికి మెదడు చురుకుగా పనిచేస్తుందట.

cocoa powderప్ర‌త్యేక‌మైన రుచి, వాస‌న క‌లిపి ఉండే కోకో పౌడ‌ర్‌ వంట‌ల‌కే కాదు చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అవును… చర్మం సమస్యలను వదిలించుకోవడానికి, మెరుస్తున్న చర్మం పొందడానికి కోకో పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మృత కణాలు తొలగించి చర్మాన్ని బిగుతుగా చేయడానికి సహాయపడుతుంది.

cocoa powder face packముఖ్యంగా చ‌ర్మాన్ని తెల్ల‌గా, కోమ‌లంగా మార్చ‌డంలో కోకో పౌడ‌ర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి కోకో పౌడ‌ర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కోకో పౌడ‌ర్ మ‌రియు ఒక‌టిన్న‌ర స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ప‌ది నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు త‌గ్గి చ‌ర్మం మృదువుగా, కోమ‌లంగా మారుతుంది.

smooth faceఒక టీస్పూన్ కోకో పౌడర్, సగం టీస్పూన్ పెరుగు, సగం టీస్పూన్ కలబంద వేరా జెల్ ఈ మూడింటిని కలపి పేస్ట్ సిద్ధం చేయాలి. ఈ పేస్ట్‌ను సుమారు 20 నిమిషాలు అప్లై చేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి. తరువాత ముఖం మీద మాయిశ్చరైజర్ రాస్తే చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు చేయాలి. ఒక టీస్పూన్ కోకో పౌడర్, సగం టీస్పూన్ తేనె, సగం టీస్పూన్ బాగా పండిన అరటి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను సుమారు 20 నిమిషాలు ముఖానికి అప్లై చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది బాగా పని చేస్తుంది.

coco beansనిర్జీవమైన చర్మాన్ని కాంతివంతంగా ఉంచేందుకు 1 టీ స్పూన్ కోకో పౌడర్ కు తగినన్ని పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్యాక్ ను ముఖం పై అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం మెరుస్తుంది. పాలలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. కళ్ళ కింద ఈ ప్యాక్ వేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి. ఉబ్బిన కళ్ళను నయం చేయడానికి కోకో పౌడర్ ఉపయోగపడుతుంది. ఈ పేస్ట్‌ను కళ్ళ కింద పూయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి.

cocoa powderఒక టీ స్పూన్ కోకో పౌడర్, విటమిన్ ఇ క్యాప్సిల్ 1, అర టీస్పూన్ ఓట్ మిల్క్, ఒక టీ స్పూను క్యారెట్ జ్యూస్ ఈ నాలుగింటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 20 నిమిషాలు అయిన తరువాత చల్లటి నీటితో కడిగి, ఆ తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే వృద్ధాప్య ఛాయలు తొలగి మెరిసే మోము మీ సొంతం అవుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR