Home Health పుచ్చకాయతో బ్యూటీ టిప్స్!

పుచ్చకాయతో బ్యూటీ టిప్స్!

0

ఎండాకాలంలో మామిడిపండ్ల తరువాత ఎక్కువగా కనిపించేవి పుచ్చకాయలే. ఇప్పుడు అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నాయి. ఎ, బి, మరియు సి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది.

water melon juiceఎందుకంటే నీటిని కలిగి ఉండడం వల్ల బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. బీ-కాంప్లెక్స్‌ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి.

పుచ్చకాయ వృద్దాప్య ఛాయలను పోగొడుతుంది. వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ముడతలను, కళ్ళ క్రింద చారలను తొలగిస్తుంది. ముఖం, ముక్కు మీద ఏర్పడే బ్లాక్ హెడ్స్ ను తొలగించడం సహాయపడుతుంది.

వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి.
పుచ్చకాయ ఫేస్‌ప్యాక్ చర్మం లోపల కూడా శుభ్రపరచి మృతకణాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ముఖానికి తాజాదనం వస్తుంది.

పుచ్చకాయ గుజ్జును తీసుకుని దానిని మెడకు, ముఖానికి పట్టించి ఓ అరగంట ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుప్రరచుకుంటే తాజా సౌందర్యంతో తళతళ మెరుస్తారు. పుచ్చకాయలో ఉండే సిలికాన్ మరియు సల్ఫర్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. పాలకూర, క్యారెట్ రసాలకు కాస్త కీర రసం కలపి తరచు తాగితే శీరోజాలు చక్కగా పెరుగుతాయి.

పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు అధికం. అందుకే హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. వీటిలో పుష్కలంగా లభ్యమయ్యే కెరొటినాయిడ్లు మహిళల్లో స్తనాల ఆకృతి చక్కగా ఉండేలా చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.

పుచ్చకాయలో లైకోఫేన్ అనే ప్రత్యేకమైన పదార్ధం, చర్మం నుంచి ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సాయపడుతుంది, దానివల్ల చర్మం పాడవకుండా కాపాడగలుగుతుంది. ఫేస్ మాస్క్, క్లెన్సర్స్, హెయిర్ మాస్క్లు లేదా కండిషనర్ల రూపంలో చర్మం మరియు జుట్టు సంరక్షణా చర్యలలో భాగంగా కూడా దీనిని చేర్చవచ్చు. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ వలె పనిచేస్తుంది. చర్మంలో అదనపు నూనెల ఉత్పత్తిని నిరోధిస్తుంది. పొడి చర్మానికి ఇది ఉత్తమమైన ట్రీట్మెంట్.

Exit mobile version