పొట్ట దగ్గర కొవ్వును త్వరగా కరిగించే కూరగాయలు ఏంటో తెలుసా ?

పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల పొట్ట భారీగా, అంద విహీనంగా కనిపిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే కాదు, దాని వల్ల అనారోగ్య సమస్యలూ వస్తాయి. పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పేరుకుపోతే డయాబెటిస్‌, గుండె జబ్బులు, ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవాలి. అందుకు నిత్యం కొన్ని కూరగాయలను తీసుకుంటే కొవ్వు త్వరగా కరిగేందుకు అవకాశం ఉంటుంది.

Belly fat can be reduced with these vegetables1. శాకాహారులు, మాంసాహారులు పుట్టగొడుగులను ఇష్టంగా తింటారు. కొందరైతే పుట్ట గొడుగులను కాఫీలో వేసి తయారు చేసి తాగుతుంటారు. పుట్టగొడుగులు డయాబెటిస్‌ సమస్యను తగ్గించడమే కాదు, అధిక బరువును తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు మెటబాలిజంను పెంచుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది.

Belly fat can be reduced with these vegetables2. పాలకూర,ఇతర ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు ఏవైనా సరే వాటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి కొవ్వును కరిగిస్తాయి. నిత్యం పాలకూరను తినడం వల్ల కొవ్వు కరుగుతుందట. రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా మధ్యాహ్నం లంచ్‌లో పాలకూర తింటే మంచిది. పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా కరుగుతుంది.

Belly fat can be reduced with these vegetables3. గుమ్మడికాయతో కొందరు తీపి వంటకాలను చేసుకుని తింటుంటారు. కానీ అలా కాదు, దీన్ని కూరగాయ రూపంలో తీసుకోవాలి. అలా అయితేనే ఫలితం ఉంటుంది. గుమ్మడికాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే సలాడ్లు, డ్రింక్స్‌ రూపంలోనూ వీటిని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా కరుగుతుంది.

Belly fat can be reduced with these vegetables4. కాలిఫ్లవర్‌, క్యాబేజీ, బ్రొకొలిలలో హై క్వాలిటీ ఫైబర్‌ ఉంటుంది. అలాగే ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. బ్రొకొలిలో ఫైటోకెమికల్స్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. కాలిఫ్లవర్‌ కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. దీంతోపాటు ఆకలి అదుపులో ఉంటుంది. కాలిఫ్లవర్‌లో ఉండే సల్ఫరఫేన్‌ అనబడే ఫైటో న్యూట్రియెంట్‌ వాపులను తగ్గిస్తుంది. కాలిఫ్లవర్‌ ద్వారా మనకు ఫొలేట్‌, విటమిన్‌ సిలు కూడా లభిస్తాయి.

Belly fat can be reduced with these vegetables5. మిరపకాయలను తింటే కారం అవుతుందని చెప్పి కొందరు వీటికి దూరంగా ఉంటారు. కానీ వీటిని తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం మిరపకాయలను తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. అది క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది.

Belly fat can be reduced with these vegetables

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR