Home Health అటిక మామిడి తీగ వలన కలిగే ప్రయోజనాలు

అటిక మామిడి తీగ వలన కలిగే ప్రయోజనాలు

0

భారతదేశం అంటేనే ఆయుర్వేదానికి పుట్టినిల్లు. ఆయుర్వేదం విలువ తెలుసు కాబట్టే మన పూర్వీకులు పైసా ఖర్చు లేకుండా ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పడ్డారు. దానికి కారణం పెరటి మొక్కల వైద్యమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ సమస్యకి మన చుట్టూ ఉండే మొక్కల్లోనే సమాధానం దొరుకుతుంది. అటువంటిదే అటిక మామిడి తీగ. దీన్నే అంటుడుకాయ మొక్క అని కూడా అంటారు. ఊళ్లలో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తాయి. ఇది మన పెరట్లోనే పెరుగుతుంది. పెరట్లోనే ఉన్న అటిక మామిడి చెట్టు మొత్తం ఔషధ గుణాలతో ఉన్నదే. దీనిని సంస్కృత గ్రంథాలు పునర్వవగా పేర్కొనగా వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం బొహేవియా డిప్యూస. దీనిని మిగిలిన ఆకు కూరల్లాగానే వండుకుని తింటే ఇంకా మంచిది.

Benefits of Attic Mango Vineకళ్ల నుంచి కాళ్ల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీ సమస్యలన్నిటికీ ఇది చక్కటి పరిష్కారం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, ఈ ఆకుతో తగ్గించుకోవచ్చని మన సంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీల్లో పెరిగిన ఎంత పెద్ద రాళ్లనయినా ఈ ఆకు రసం ఇట్టే కరిగించేయగలదు. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు ఆకులే కాదు.. చెట్టు వేర్లు, కాండం, పువ్వులు, రెమ్మలు అన్నీ తెంపి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

ముందుగా కొన్ని నీళ్లను తీసుకొని ఒక గిన్నెలో పోసి.. సన్నని మంట మీద ఓ ఐదు నిమిషాలు కాగ బెట్టండి. నీళ్లు బాగా కాగాక.. సన్నగా ముక్కలు చేసిన అటిక మామిడి ముక్కలను ఆ నీళ్లలో వేయండి. అలాగే అవి కాసేపు నీళ్లలో మరిగాక.. వాటి సారం నీళ్లలో దిగాక ఆ నీటిని వడబోయండి. రోజు ఉదయమే పరిగడుపున 50 మిల్లీలీటర్ల రసాన్ని తాగితే చాలు.

ఈరసాన్ని కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నవాళ్లు.. సమస్యలు వస్తాయనుకునేవాళ్లు.. ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. డయాలసిస్ చేయించుకునేవాళ్లు, కిడ్నీ సమస్యల కోసం ఇంగ్లీష్ మందులు వాడేవాళ్లు కూడా వాడొచ్చు. అటిక మామిడి ఆకులను ఇంగ్లీష్ కిడ్నీ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారట.

ఒక కిడ్ని వ్యాదులే కాదు, లివర్ సంబధించిన, రక్తహీనత, పచ్చకామెర్లు, గుండె వ్యాధులు రాకుండా ముందస్తు ఆహార ఔషధముగా వాడవచ్చు. పచ్చకామెర్లకు నేల ఉసరితో కలిపి వాడలి. ముఖ్యంగా ఇది వగరు ,చెదు,ఘటు రుచులు కలిసి నట్లుగా వుండి, కొత్తవారి తాగడానికి ఇబ్బంది వుండవచ్చు. ద్రవరూపంలో వుండి, ఆహల్కహల్ కలిగి వుండటం చేత ఎంత మోతాదు లో మెడిసేన్ తిసుకున్నారో, అంతే మోతదులో నీళ్ళు కలపి తిసుకోవాలి.

Exit mobile version