రోజూ వేడి నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఇంగువ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే పురాతన కాలం నుంచి ఇంగువ భారతీయ వంటకాల్లో భాగమైంది. ఆహారంలో కాస్తంత ఇంగువను జోడిస్తే…ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అంతేకాదు ఇంగును ఎన్నో రకాల రోగాలకు మంచి ఔషధంగా ఉపయోగిస్తారు. పురాతన కాలంలో మహిళలు వంధ్యత్వాన్ని నివారించేందుకు వేడి నీటిలో చిటికెడు ఇంగువను కలుపుకుని తాగేవారు.

benefits of drinking hing water everydayఅంతేకాదు ఇంగువ అజీర్ణ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, 1 చిటికెడు ఇంగుపొడితో ఒక చిటికెడు వెచ్చని నీటితో కలిపి కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. రోజూ వేడి నీటితో కలిపిన చిటికెడు ఇంగువ పౌడర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

benefits of drinking hing water everyday->షుగర్ పేషంట్స్ ప్రతిరోజు ఉదయం ఇంగువ పౌడర్ ను వేడినీటిలో కలుపుకుని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.మూత్రపిండాలను,మూత్రాశయంను శుభ్రపరిచే గుణంలో ఇంగువలో ఉంటుంది. అంతేకాదు కిడ్నీ ఇన్ఫేక్షన్లు రాకుండా కూడా సహాయపడుతుంది.

benefits of drinking hing water everyday->అర టీస్పూన్ ఇంగువను గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యను అరికట్టవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇంగువ శరీరం యొక్క వాత దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

benefits of drinking hing water everyday->వేడినీటిలో ఇంగువ పౌడర్ కలుపుకుని ప్రతిరోజూ తాగినట్లయితే ఎముకలు బలంగా మారుతాయి. ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది.

benefits of drinking hing water everyday->కళ్లలోని బీటా కెరోటిన్ కు ఇంగువ సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేడినీటిలో ఇంగువను కలుపుకుని ప్రతిరోజూ తాగినట్లయితే కళ్ళు ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

benefits of drinking hing water everyday->ఇంగువలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి గాయం నయం చేయడానికి ఉపయోగపడుతాయి. ఐరన్ లోపం వల్ల రక్తహీనతతో బాధాపడేవారికి ఇంగువ దివ్యఔషధంగా పనిచేస్తుంది. దంతాలను బలంగా ఉంచుతుంది.

benefits of drinking hing water everyday->తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఉబ్బసం ఉన్నవాళ్లు గోరువెచ్చని నీటిలో కలుపుకుని ప్రతిరోజూ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR