డ్రై ఫ్రూట్స్ లిస్ట్ లో ఇప్పుడు ఎండు ఉసిరి కూడా చేరిపోయింది!

టెక్నాలజీతో పాటు ఆయుర్వేదం కూడా ఇప్పుడు మన ముంగిట్లోనే అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం ద్రాక్ష, బాదంపప్పు, జీడిపప్పు వంటివి మాత్రమే లభించేవి. కానీ ప్రస్తుతం మార్కెట్లో కివి, అంజూర, ఉసిరి మొదలైన పండ్లను కూడా ఎండబెట్టి మార్కెట్లో మనకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ పండ్లన్నిటికి పచ్చిగా ఉన్నప్పటికంటే ఎండిన తరువాతే డిమాండ్ ఎక్కువ.

3-Mana-Aarogyam-792తాజా పండ్లలో ఉన్నటువంటి పోషక విలువలు అన్ని కూడా ఈ ఎండిన పండ్లలో ఉండటం వల్ల చాలామంది ఈ డ్రైఫ్రూట్స్ కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ డ్రైఫ్రూట్స్ ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవడానికి వీలు ఉంటుంది కనుక మార్కెట్లో వీటికి అధిక డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఎండు ఉసిరి డిమాండ్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే సాధారణంగానే ఆయుర్వేదంలో ఉసిరికి ప్రాధాన్యత ఎక్కువ.

కేవలం ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఉసిరిలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. చలికాలంలో లభించే ఉసిరి ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది. దీనితోపాటు ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పచ్చడి, మురబ్బా, క్యాండీ, జ్యూస్‌.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.

4-Mana-Aarogyam-792ఉసిరి కాయలు నేరుగా కూడా తినేయొచ్చు. ఇందులో ఉన్న పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోజూ పరగడుపున ఉసిరి రసం పుక్కిలించడం ద్వారా నోటిలో వచ్చే పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, ఫ్లూ వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజువారీ ఆహారంలో ఉసిరి ఉండేలా చూసుకుంటే బరువు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.

ముఖ్యంగా ఉసిరిలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మనకు ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి దోహదం చేస్తాయి. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్యలో ఆర్థరైటిస్ సమస్య ఒకటి.ఈ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత రెండు ఎండిన ఉసిరి ముక్కలను తినడం వల్ల ఈ విధమైన సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

5-Mana-Aarogyam-792తరచూ ఉసిరిని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మానికి మంచి మెరుపు వస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బ్లడ్‌ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. ఉసిరి రసం రోజూ తీసుకుంటే శరీరంలో చెడు కొలెసా్ట్రల్‌ స్థాయులు తగ్గి, గుండె పనితీరు మెరుగు పడుతుంది. శరీరం నుంచి చెడు టాక్సిన్లను బయటకు పంపడానికి ఉసిరి రసం సహాయపడుతుంది.

కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణ, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఇది సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తుంది. ఉసిరి నూనె వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యవంతమైన కేశసంపదను అందిస్తుంది. కుదుళ్లకు తగిన బలాన్నిచ్చి జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది.

2-Mana-Aarogyam-792

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR