Home Health పరగడుపున అల్లం ముక్క తినడం వలన కలిగే ప్రయోజనాలు

పరగడుపున అల్లం ముక్క తినడం వలన కలిగే ప్రయోజనాలు

0

కరోనా తీవ్ర రూపం దాలుస్తున్నవేళ పరిస్థితి మన చేతుల్లో లేదు. కాబట్టి రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. మనలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే వంటింట్లో ఉండే అల్లం తో రోగనిరోధక శక్తి పెరగడం మాత్రమే కాదు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Benefits of eating a piece of gingerఅల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే, దీన్ని తినేందుకు చాలామంది ఇష్టపడరు. అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్‌లో అల్లాన్ని చేర్చుకుంటారు. ఎందుకంటే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తాగితే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే.

  • అల్లం మంచి యాంటి ఆక్సీడెంట్. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయకుండా సహాయపడటంలో అల్లం పాత్ర ఎంతో కీలకమైంది.
  • స్వతహాగా అల్లం ఘాటు ఎక్కువగా ఉండి మంట పుట్టిస్తుంది. అయితే దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ వంటివి ఏర్పడవు. కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది.

షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లం. అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది.

ఇకపోతే సహజంగా వచ్చే దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమోఘంగా పనిచేస్తుందనే చెప్పాలి. విపరీతమైన దగ్గు ఇబ్బంది పెడుతుంటే వెంటనే అల్లం, ఉప్పు కలిపి తీసుకోంటే సరి.. ఆ సమస్య అక్కడే ఆగిపోతుంది. ఈ ఎఫెక్టివ్ రెమెడీ వెంటనే దగ్గును మాయం చేస్తుంది.

  • అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతులో, శ్వాసనాళాల్లో ఉన్న టాక్సిన్స్ ని వెంటనే తొలగిస్తాయి. శ్వాస సంపూర్తిగా అందేందుకు సహకరిస్తుంది.
  • ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున క్రమం తప్పకుండా చిన్న అల్లం ముక్కను తింటే ఆ రోజుంతా ఎంత ఆరోగ్యంగా ఉంటారో చెప్పనక్కర్లేదు.
  • మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం.
  • బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు.
  • ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి, దంటాలను ఆరోగ్యాంగా ఉంచుతుంచి. అల్లం నుండిఅల్లం నూనెను తయారు చేస్తారు.

  • ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి వస్తుంది.
  • అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
  • కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లాన్ని జలుబు, ఫ్లూ చికిత్స కోసం వాడుతున్నారు.
  • అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.
  • అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.

మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.

 

Exit mobile version