మినపగుళ్ళను ఇలా తినడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంలో తృణ ధాన్యాలు అనేక రకాల పోషకాలు అందిస్తాయి. అలాంటి వాటిల్లో మినుములు ఒకటి. మినపపప్పును చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో దోశలు, ఇడ్లీలు తయారు చేసి తింటుంటారు. అలాగే తీపి వంటకాలుక కూడా చేస్తుంటారు. అన్ని పప్పుదాన్యాలలో కన్నా ఈ మినుములు అత్యంత భలవర్థకము. కానీ మినపపప్పు అద్భుతమైన లాభాలను అందిస్తుంది కనుక దాంతో తీపి వంటకాలు చేసి తినడం కన్నా ఇతర మార్గంలో తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి.

black gram dalమినుములను యదాతదంగాను వాడుతారు. లేదా పొట్టుతీసి పప్పును ఉపయోగిస్తారు. మినుములను పొట్టుతీసి మినప గుళ్ళుగాను వినియోగిస్తారు. మినప వడలు, మినపట్టు, ఇడ్లీలు, దోసెలలో మినపప్పు వాడకం తప్పని సరి. సున్నుండలు మినప్పప్పు తోనే చేస్తారు. మినప్పప్పును నూనెలో వేయించి దానికి కొంచెంకారం కలిపి తిన్నా కూడా చాల రుచిగా వుంటాయి. ప్రస్తుతం వీటిని పాకెట్లలో విరివిగా అమ్ముతున్నారు. మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు.. అనేక రోగాల నుంచి కాపాడతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

black gram dalమినుముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. మినుముల వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి.. డయాబెటిస్ సమస్య తలెత్తకుండా మినుములు సహకరిస్తాయి. అంతేకాదు మినపపప్పులో ఐరన్‌ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు మినపపప్పును రోజూ తింటే ఫలితం ఉంటుంది. రక్తం బాగా తయారవుతుంది.

immunity strongమినుములు జీర్ణక్రియకు మెరుగుపరిచి బలాన్ని చేకూరుస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వంద గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు (ఫైబర్) పదార్థం ఉంటుంది. ఒక గ్రాము పొటాషియం, రెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. దీంతోపాటు విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1, బీ3 తోపాటు.. కాల్షియం, మెగ్నిషియం, వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. మినుములను నిత్యం ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. మినుముల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.. కావున ఎవరైనా జీర్ణసమస్యలతో బాధపడుతుంటే.. మినుములను ఆహారంలో చేర్చితే ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు మలబద్దకం, ఉబ్బసం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

fiberమినపపప్పును రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ముందు రోజు రాత్రి నిద్రకు ముందు 60 గ్రాముల మినపపప్పును తీసుకుని నీటిలో నానబెట్టాలి. తరువాత రోజు ఉదయం మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. అందులో అవసరం అనుకుంటే ఇంకా నీళ్లు కలపవచ్చు. అందులో కొద్దిగా తేనె కలిపి తినవచ్చు. మినపపప్పును తినడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. శక్తి లభిస్తుంది. నీరసం తగ్గుతుంది.
తలనొప్పి సమస్య ఉన్న వారు మినపపప్పు ను తింటుండాలి. ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం తలనొప్పిని తగ్గిస్తాయి. ఇవన్నీ ఎముకలు బలంగా, ధృఢంగా మారడానికి దోహదపడతాయి. కావున ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థటైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారు మినుములను తినడం మంచింది.

activeమినుముల్లో గుండె జబ్బులను నివారించే అద్బుతమైన గుణం ఉంది. ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణమని పరిశోధనల్లో తేలింది. అవి రక్తంలో వెలువడే చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ మంచిగా జరగడం వల్ల హృదయ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మినుముల్లో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది. గాయాలు, నొప్పులతో బాధపడుతున్న వారికి మినుములతో తయారు చేసిన ఆహారం వడ్డిస్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వీటిలోని పోషకాల వల్ల చర్మ సౌందర్యం కూడా బాగా పెరుగుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR