పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయితోనే ఎక్కువ ప్రయోజనాలు!

సాధారణంగా బాగా పండిన పండ్లనే తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కాని కొన్ని పండ్లు పచ్చిగా ఉంటే ఎక్కువ ప్రయోజనాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పచ్చి బొప్పాయి. చాలా వరకు బొప్పాయి పండ్ల‌ను పండిన త‌రువాతే తింటారు. కానీ ప‌చ్చి బొప్పాయిల‌‌ను కూడా తిన‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే పండిన బొప్పాయి పండ్ల కంటే ఎక్కువ పోష‌కాలు, ఎంజైమ్‌లు ప‌చ్చి బొప్పాయిల‌లోనే ఉంటాయి. క‌నుక ప‌చ్చి బొప్పాయిల‌ను తింటేనే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌చ్చి బొపాయిల పైభాగం ఆకుప‌చ్చ రంగులో ఉంటుంది. లోప‌లి భాగం క్రీమ్ లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఇది తియ్య‌గా ఉండదు. తినేందుకు క‌ష్టంగా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని ఉడ‌క‌బెట్టుకుని తిన‌వ‌చ్చు. లేదా వెజిట‌బుల్ స‌లాడ్స్‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు.

పచ్చి బొప్పాయి తినడం వలన కలిగే ప్రయోజనాలుముఖ్యంగా పచ్చి బొప్పాయి ఉదర సంబంధిత వ్యాధులకు ఉపయోగపడుతుంది. ప‌చ్చి బొప్పాయి గ్యాస్, కడుపు నొప్పి మరియు జీర్ణక్రియ సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు, ప‌చ్చి బొప్పాయి ఆర్థరైటిస్ మరియు ఉమ్మడి సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుంది. ప‌చ్చి బొప్పాయిని గ్రీన్ టీతో ఉడకబెట్టడం ద్వారా తయారుచేసిన టీని తీసుకోవడం ఆర్థరైటిస్‌ను నయం చేస్తుంది. అధిక బరువును త‌గ్గించ‌డంలో ప‌చ్చి బొప్పాయి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. ప్ర‌తి రోజు కొన్ని ప‌చ్చి బొప్పాయి ముక్క‌లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న అద‌న‌పు కొవ్వును క‌రిగిస్తుంది. దాంతో వేగంగా బరువు తగ్గిపోతుంది.

పచ్చి బొప్పాయి తినడం వలన కలిగే ప్రయోజనాలుఇది మాత్రమే కాదు, డయాబెటిస్‌కు ప‌చ్చి బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తక్కువ కాదు. రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది, ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అదే స‌మ‌యంలో శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ క‌రిగించి, మంచి కొల‌స్ట్రాల్ పెంచుతుంది. త‌ద్వారా గుండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. పచ్చి బొప్పాయిలో ఉండే పొపైన్, చైమో పొపైన్‌లు మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. స్థూలకాయంతో బాధపడేవారు, అజీర్తితో బాధపడేవారు ఇది తినడం వలన ప్రయోజనం ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

పచ్చి బొప్పాయి తినడం వలన కలిగే ప్రయోజనాలుఅలాగే అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య ఉన్న వారు ప‌చ్చి బొప్పాయి తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చి బొప్పాయి కంటి సంబంధిత వ్యాధులు, విటమిన్ల లోపం రాకుండా చూస్తుంది. తరుచూ పచ్చి బొప్పాయి ముక్కలు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ముడి బొప్పాయి లేదా పచ్చి బొప్పాయి మెదడును అభివృద్ధి చేయడంలో, మరింత చురుకుగా చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు బలంగా తయారవడానికి బొప్పాయి తోడ్పడుతుంది.

పచ్చి బొప్పాయి తినడం వలన కలిగే ప్రయోజనాలుఅయితే ప‌చ్చి బొప్పాయిల‌లో ఉండే లేటెక్స్ ఫ్లుయిడ్ వ‌ల్ల కొంద‌రికి అల‌ర్జీలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల చ‌ర్మంపై దద్దుర్లు వ‌స్తాయి. అలా గ‌న‌క ఎవ‌రికైనా వ‌స్తే వెంట‌నే ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం మానేయాలి. అలాగే గ‌ర్భిణీలు కూడా ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌రాదు. ఇక మిగిలిన ఎవ‌రైనా స‌రే ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌వ‌చ్చు. మూత్రపిండ సమస్యలను సరిదిద్దడంలో ప‌చ్చి బొప్పాయి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ప‌చ్చి బొప్పాయి కామెర్లు లేదా కాలేయానికి సంబంధించిన ఇతర సమస్యలలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ప‌చ్చి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు క్యాన్సర్‌ను తొలగించే ఇతర పోషకాలు ఉన్నాయి.

పచ్చి బొప్పాయి తినడం వలన కలిగే ప్రయోజనాలుప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం వ‌ల్ల మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. ఆ ఇన్‌ఫెక్ష‌న్ల‌కు కార‌ణం అయ్యే బాక్టీరియా న‌శిస్తుంది. ప‌చ్చి బొప్పాయిల‌లో పండిన వాటి క‌న్నా ఎక్కువ‌గా ఎంజైమ్‌లు ఉంటాయి. ముఖ్యంగా ప‌పైన్‌, కైమోప‌పిన్‌లు అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల జీర్ణాశ‌యం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ప‌చ్చి బొప్పాయిల‌లో విట‌మిన్లు ఎ, సి, ఇలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,680,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR