లిచీ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

చూపుకి స్ట్రాబెరీలా కనిపించే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. చైనాలో పుట్టిన ఈ పండు ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరుదైన ఈ ఫ్రూట్ అంతే కాస్ట్లీ కూడా. ఈ పండ్లు ఎక్కువ‌గా స‌మ్మ‌ర్‌లోనే ల‌భిస్తాయి. ఈ పండ్ల‌ను చెట్టు రెమ్మ‌ల నుంచి వేరు చేసిన‌ప్పుడు సువాస‌న‌తో పాటు తాజాద‌నం త్వ‌ర‌గా కోల్పోతాయి. అందుకే ఈ పండ్ల‌ను రెమ్మ‌ల‌తో పాటు కోసి అమ్ముతుంటారు.

లిచీ పండులిచీ పండ్ల‌లోని పై పొర‌ను తొల‌గిస్తే.. సుగంధ ప‌రిమ‌ళంతో కూడిన సున్నిత‌మైన జ్యూసీగా ఉండే తెల్ల‌టి ప‌దార్థం ఉంటుంది. ఇది కేవ‌లం రుచి, సువాస‌న మాత్ర‌మే కాదు.. అద్భుత‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. ఈ దీన్ని తిన‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెర‌గ‌డ‌మే కాకుండా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డ‌టంలో, ర‌క్త‌క‌ణాల‌నుపెంపొందించుకోవ‌డంలోనూ సహాయ‌ప‌డుతుంది.

లిచీ పండులిచీ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతి రోజు తినడం జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల శోషణను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణలో లిచీ పండు కూడా చాలా సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్‌, జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ద్ర‌వాల‌ను స్థిరీక‌రిస్తుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నిరోధిస్తుంది. లిచీ పండు డయాబెటిస్‌ను కూడా నియంత్రిస్తుంది.

లిచీ పండులిచీ పండు రోగనిరోధక వ్యవస్థను రక్షిస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, కాలానుగుణ ఇన్ఫెక్షన్లు , దీర్ఘకాలిక వ్యాధుల నుండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది, వాటి పనితీరుకు సహాయపడుతుంది.

లిచీ పండుఅలాగే మ‌న శ‌రీరానికి ఒక రోజుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో పుష్క‌లంగా ల‌భిస్తుంది. కాబ‌ట్టి శ‌రీరంలో తెల్ల ర‌క్త‌క‌ణాల సామ‌ర్థ్యం పెర‌గ‌డంతో పాటు వ్యాధినిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జలుబు, దగ్గుతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. లిచీ పండులో చాలా నీరు ఉంటుంది, ఇది వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేట్ గా ఉంచుతుంది. డీహైడ్రేషన్ సమస్య ఉంటే, లిచీ పండు తినవచ్చు లేదా దాని రసం తాగడం కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

లిచీ పండువృద్ధాప్య‌ఛాయ‌ల‌ను తొల‌గించ‌డ‌లోనూ లిచీ పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. అధిక ఆక్సిడేటివ్ ఒత్తిడి కార‌ణంగా శ‌రీరంలో ఫ్రీరాడిక‌ల్స్ పెరిగిపోతాయి. ఇది వృద్ధాప్య ప్రారంభ సంకేతాలుగా చెప్పొచ్చు. అయితే లిచీలో ఉండే విట‌మిన్ సీ.. శ‌రీరంలో నుంచి ఫ్రీరాడిక‌ల్స్‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. స్కిన్ డ్యామేజిని నిరోధిస్తుంది.

లిచీ పండుఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి, శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. లిచీ పండులో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. అవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తాయి. లిచీ పండులో కనిపించే యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి పనిచేస్తాయి.

లిచీ పండుబ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారికి లిచీ పండ్లు గొప్ప మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి కీల‌క పాత్ర పోషిస్తాయి. వీటిలో నీటిశాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఫ్యాట్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల‌రీలు కూడా ఇందులో త‌క్కువ‌గానే ఉంటాయి.

లిచీ పండులిచీలో విటమిన్ బి 3 ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ వ్యవస్థను నియంత్రిస్తుంది. విటమిన్ బి 3 శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది , హానికరమైన ట్రైగ్లిజరైడ్స్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. లిచీ పండులో సోడియం, కొలెస్ట్రాల్ ఉండదు. ఇది స్ట్రోక్, గుండె జబ్బులు, రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ వ్యాధి, అవకాశాలను తగ్గిస్తుంది.

లిచీ పండులిచీ పండు గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ నుండి రక్షిస్తుంది. లిచీ పండ్ల‌లో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. వీటిల్లో ఉండే బీటాకెరోటిన్‌, ఓలిగోన‌ల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ధ‌మ‌నులు, ర‌క్త‌నాళాల‌ను లిచీ పండ్ల‌లో ఉండే పొటాషియం ఆరోగ్యంగా ఉంచుతుంది.

లిచీ పండువాటి సంకోచ, వ్యాకోచాల‌ను మెరుగ్గా ఉంచుతుంది. దీనివ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌రిగి గుండెపోటు వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది. అలాగే ఎర్ర ర‌క్త‌క‌ణాల వృద్ధి కోసం లిచీ పండ్ల‌లో ఉండే కాప‌ర్‌, ఐర‌న్ స‌హాయ‌ప‌డ‌తాయి. ర‌క్తంలోని ద్ర‌వాల‌ను సంతులితం చేయ‌డం ద్వారా హైబీపీని నియంత్రించ‌డంలో లిచీ పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి.

లిచీ పండుఅధికంగా తాగడం, రక్తహీనత, పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్, కొన్ని మందుల అధిక వినియోగం కాలేయం దెబ్బతినడానికి దారితీస్తుంది. కాలేయ వైఫల్యం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. లిచీలో కాలేయ వ్యాధుల సమర్థవంతమైన చికిత్సకు సహాయపడే హెపాటోప్రొటెక్టివ్ ఏజెంట్లు ఉన్నాయి.

లిచీ పండులిచీ పండ్ల‌లో మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, ఐర‌న్‌, మాంగ‌నీస్‌, కాప‌ర్ వంటి న్యూట్రీషియ‌న్లు పుష్క‌లంగా ఉంటాయి. ఎముక‌లు కాల్షియాన్ని గ్ర‌హించే స్థాయిని ఇవి ఎంచుతాయి. దీనివ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా త‌యార‌వుతాయి.

లిచీ పండులిచీ పండు చర్మానికి చాలా మంచిది. ఇది విటమిన్ ఎ, సి కలిగి ఉంటుంది, ఇది చర్మాన్ని పొడి , ముడుతలతో కాపాడుతుంది. లిచీలో చర్మం తెల్లబడటం , మొటిమల నిరోధక లక్షణాలు ఉంటాయి. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల నుండి రక్షిస్తాయి.

లిచీ పండుఅయితే సాధార‌ణ పండ్ల‌తో పోలిస్తే లిచీ పండ్లు చాలా భిన్న‌మైన‌వి. వీటిని ప‌రిగ‌డుపున‌, రాత్రి ప‌డుకోబోయే ముందు అస్స‌లు తినొద్దు. పచ్చిగా ఉండే లిచీ పండ్ల జోలికి అస్సలు వెళ్లొద్దు. ఇటీవల కొంతమంది వ్యాపారులు పచ్చి లిచీ పండ్లకు ఎర్ర రంగు వేసి అమ్మేస్తున్నారు. వాటిని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రాత్రులు నిద్రపోయే ముందు, ఉదయం ఖాళీ కడుపున లిచీ పండ్లను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

లిచీ పండుముఖ్యంగా పిల్లలకు వీటిని దూరంగా ఉంచడం చాలా మంచిదని చెబుతున్నారు. ప‌చ్చి లిచీ పండ్ల‌లో మిథిలెన్ సైక్లోప్రోపిల్-గ్లైసిన్ రసాయనం ఉంటుంది. ఇది మెద‌డు ప‌నితీరును దెబ్బ‌తిస్తుంది. మెద‌డు వాపు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR